క్యాబ్   ప్రయాణాలలో పెరుగుతున్న భద్రతా సమస్యలను దృష్టిలో పెట్టుకొని ఉబర్ ఒక కొత్త ఆలోచనని ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టబోతుంది. ఉబర్ క్యాబ్ డ్రైవరు, ప్రయాణికుల మధ్య ఆడియో రికార్డింగ్ ఫీచర్ ని ప్రవేశపేట్టాలనుకుంటుంది.  ప్రయాణికుల రక్షణ కోసం ఉబెర్ ఈ తాజా ప్రయత్నాన్ని యునైటెడ్ స్టేట్స్ లో మొదట అమలు చేయాలని యోచిస్తోంది.

also read  స్మార్ట్‌ఫోన్‌ హ్యాకర్లకు గూగుల్ ఛాలెంజ్...గెలిస్తే 10 కోట్ల బహుమతి ఇంకా...

వచ్చే నెలలో కొన్ని లాటిన్ అమెరికన్ నగరాల్లో మొదట పైలట్ దిశగా ప్రయోగించనుంది. ఉబెర్ తెలిపిన సమాచారా ప్రకారం ఏదైనా ఉబర్ క్యాబ్ ప్రయాణ సమయంలో ఆడియో రికార్డింగ్‌  చేయడానికి వినియోగదారులను అనుమతిస్తుంది.

"ప్రతి ఉబర్ ట్రిప్ ముగిసినప్పుడు ప్రతిదీ సరిగ్గా ఉందా అని క్యాబ్ డ్రైవరు వినియోగదారుడిని అడుగుతారు. భద్రతా విషయంలో ఏదైనా సమస్య  ఉంటే ట్యాప్‌లతో ఆడియో రికార్డింగ్‌ను ఉబర్‌కు పంపించవచ్చు" అని ఉబెర్ ఎగ్జిక్యూటివ్ ఇమెయిల్ లో రాశారు. "ఆడియో ఫైల్ ఉబెర్ యొక్క కస్టమర్ సపోర్ట్ ఏజెంట్లకు పంపబడుతుంది. వారు ఆ రికార్డింగ్ విని బాగా అర్థం చేసుకోని  తరువాత తగిన చర్య తీసుకోవడానికి అవకాశం ఉంటుంది."

 ఈ ఆడియో రికార్డింగ్‌ డ్రైవర్‌కుగానీ, ప్రయాణికులకుగానీ అందుబాటులో ఉండదని, ట్రిప్పు ముగియగానే ప్రయాణం సౌకర్యంగానే జరిగిందా ? అన్న ప్రశ్న ప్రయాణికులకు వెళుతుందని, వారి నుంచి సానుకూలమైన సమాధానం వచ్చినట్లయితే ఆడియో స్క్రిప్టును ప్రయాణికుల మాటలను విశ్లేషించే అనుబంధ ఏజెంట్‌కు పంపుతారని, ప్రయాణికులకు, డ్రైవర్‌ మధ్య ఇబ్బందులు, ఘర్షణ పరిస్థితి ఏర్పడితే పోలీసులకు అందజేయడం కోసం ఆడియో రికార్డింగ్‌ను భద్రపరుస్తామని ఉబర్‌ యాజమాన్యం వెల్లడించింది. 

also read  షియోమీ రెడ్‌మీ.. ఫోన్ వాడుతున్నారా? అయితే జాగ్రత్త.. లేదంటే ...?

అనవసరంగా ఎవరి ప్రైవసీని దెబ్బతీయమని తెలియజేసింది. అమెరికాలో ప్రజల ప్రైవసీకి సంబంధించి వివిధ రాష్ట్రాల్లో వేరు వేరు చట్టాలున్నాయని, డ్రైవర్, ప్రయాణికుల మాటలను రికార్డు చేయాలంటే వారిరువురి అనుమతి తప్పనిసరని మీడియా ఉబర్‌ యాజమాన్యం దృష్టికి తీసుకపోగా అప్పటికీ ఒకే జాతీయ చట్టం రావచ్చేమోనని వ్యాఖ్యానించింది. ప్రయోగాత్మకంగా అమెరికాలో కూడా ‘ఆడియో రికార్డింగ్‌ ఫీచర్‌’ విజయవంతం అయితే ఇతర దేశాలకు విస్తరించే అంశాన్ని పరిశీలిస్తామని యాజమాన్యం పేర్కొంది.