స్మార్ట్‌ఫోన్ హ్యాకర్లకు గూగుల్ ఛాలెంజ్...గెలిస్తే 10 కోట్ల బహుమతి ఇంకా...
. గూగుల్ పిక్సెల్ స్మార్ట్‌ఫోన్‌ను ఎవరైనా హ్యాక్ చేయగలిగితే వారికి గూగుల్ 1.5 మిలియన్ డాలర్లు ( 10 కోట్లకు పైగా ) బహుమతిగా చెల్లించనుంది. గూగుల్ ఒక బ్లాగ్ పోస్ట్‌లో “ఈ రోజు మేము ఈ బగ్ బౌంటీ ప్రోగ్రామ్‌ను మరింతగా విస్తరిస్తున్నాము అలాగే రివార్డ్ మొత్తాన్ని కూడా పెంచుతున్నాము" అని తెలిపింది.
ఆండ్రయిడ్ OS యొక్క డెవలపర్ వెర్షన్లలో లోపాలను చూపించగలిగే లేదా హ్యాక్ చేయగల వ్యక్తుల /హ్యాకర్ల కోసం గూగుల్ అద్భుతమైన ఆఫర్ అందిస్తోంది. గూగుల్ పిక్సెల్ స్మార్ట్‌ఫోన్‌ను ఎవరైనా హ్యాక్ చేయగలిగితే వారికి గూగుల్ 1.5 మిలియన్ డాలర్లు ( 10 కోట్లకు పైగా ) బహుమతిగా చెల్లించనుంది.
also read షియోమీ రెడ్‌మీ.. ఫోన్ వాడుతున్నారా? అయితే జాగ్రత్త.. లేదంటే ...?
గూగుల్ పిక్సెల్ స్మార్ట్‌ఫోన్ వినియోగదారులకు మంచి అనుభవాన్ని అందించడానికి బగ్ బౌంటీ ప్రోగ్రామ్‌లను ప్రతిసారీ గూగుల్ నిర్వహించడం సాధారణం.గూగుల్ పిక్సెల్ స్మార్ట్‌ఫోన్‌ను హ్యాక్ చేయగల ఎవరికైనా కంపెనీ 1.5 మిలియన్ డాలర్లు లేదా రూ .10 కోట్లకు పైగా చెల్లిస్తుందని ప్రకటించింది.
గూగుల్ ఒక బ్లాగ్ పోస్ట్‌లో “ఈ రోజు మేము ఈ బగ్ బౌంటీ ప్రోగ్రామ్‌ను మరింతగా విస్తరిస్తున్నాము అలాగే రివార్డ్ మొత్తాన్ని కూడా పెంచుతున్నాము" అని తెలిపింది.పిక్సెల్ డివైజెస్ లో టైటాన్ M స్ట్రాంగ్ సెక్యూరిటి చీప్ ని అమర్చారు. ఇది పూర్తి చైన్ రిమోట్ కోడ్ తో సెన్సిటివ్ డాటాను దోపిడీకి గురి కాకుండా వ్యవహరిస్తుంది. ఇది డివైజ్ లో ఉన్న డాటాను సెక్యూర్ గా ఉంచుతుంది.
అందుకే మేము దీన్ని హ్యాక్ చేయగలిగితే 1 మిలియన్ డాలర్ల బహుమతిని ఇస్తున్నాము.పిక్సెల్ డివైజెస్ లో కనిపించే ఎంటర్‌ప్రైజ్-గ్రేడ్ సెక్యూరిటీ చిప్, ఆపరేటింగ్ సిస్టమ్‌లో ఉన్న డేటాను భద్రపరచడానికి నిర్మించబడింది. ఇంటర్నల్ సెక్యూరిటి పరంగా చిప్ బలమైన చిప్‌సెట్‌గా గుర్తించబడింది.
also read మొబైల్.. చార్జీల పెంపు ప్రకటన...వినియోగదారులలో ఆందోళన...
ఆండ్రయిడ్ OS యొక్క డెవలపర్ వెర్షన్లలో లోపాలను హ్యాక్ చేయగల లేదా ఎత్తి చూపగల వ్యక్తుల కోసం గూగుల్ ఇతర బహుమతులను కూడా అందిస్తోంది.బగ్ బౌంటీ కార్యక్రమాన్ని ప్రారంభించినప్పటి నుండి గత నాలుగు సంవత్సరాల్లో కంపెనీ 1800 కి పైగా నివేదికలను ఇచ్చింది. ఎప్పటివరకు బగ్ బౌంటీ హాకర్లకు 4 మిలియన్ డాలర్లను కూడా చెల్లించింది.