Asianet News TeluguAsianet News Telugu

ఈ ప్లాట్‌ఫామ్ పై ఆల్-టైమ్ హై...100 మిలియన్లు దాటిన స్నాప్‌డీల్

అక్టోబర్ 2019లో స్నాప్‌డీల్‌కు నెలవారీ ట్రాఫిక్ అంటే వెబ్ సైట్ వీక్షకులు 240 మిలియన్లను దాటిందని కంపెనీ పేర్కొంది.ఏడాది క్రితం 73 మిలియన్ డౌన్‌లోడ్‌లకు పైగా 37 శాతం లాభం నమోదైందని ఇ-కామర్స్ సోమవారం తెలిపింది.

snapdeal crosses 100 million site viewers in last month
Author
Hyderabad, First Published Nov 26, 2019, 4:09 PM IST

గూగుల్ ప్లే స్టోర్‌లో స్నాప్‌డీల్ 100 మిలియన్ యాప్ డౌన్‌లోడ్‌లను దాటిందని, ఏడాది క్రితం 73 మిలియన్ డౌన్‌లోడ్‌లకు పైగా 37 శాతం లాభం నమోదైందని ఇ-కామర్స్ సోమవారం తెలిపింది.అక్టోబర్ 2019లో స్నాప్‌డీల్‌కు నెలవారీ ట్రాఫిక్ 240 మిలియన్ల సందర్శకులను దాటిందని, ఇది ఈ ప్లాట్‌ఫామ్ పై ఆల్-టైమ్ హై అని కంపెనీ పేర్కొంది.

also read 2020 నుంచి కస్టమర్లకు అప్పులివ్వనున్న ట్రూకాలర్ యాప్

ఈ పండుగ సీజన్ ఆర్డర్లలో 52 శాతం పెరుగుదల కనిపించిందని, అందులో 90 శాతం ఆర్డర్లు నాన్- మెట్రో నగర వినియోగదారుల నుండి వస్తున్నాయి అని తెలిపింది.స్నాప్‌డీల్ వృద్ధికి  వస్తువుల  ధరల పై మేము దృష్టి సారించడం వల్లే  కారణమని కంపెనీ తెలిపింది.

"100 మిలియన్ల ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్‌లు మా అభివృద్ధికి  ప్రతిబింబం అని భారత్-కేంద్రీకృత ఇ-కామర్స్ స్నాప్ డీల్ తెలిపింది. భారతదేశం అంతటా మిలియన్ల మంది వినియోగదారులకు ఈ కామర్స్ ద్వారా సౌకర్యాలను ఇంకా  అమ్మకాలను మెరుగుపరచడానికి మా ప్రయత్నాలు మేం చేస్తున్నాం.

also read  ఇండియాలో ఐఫోన్‌...తయారీ, విక్రయాలు ఎక్కడి నుంచి చేస్తున్నారో తెలుసా...?

భారతదేశంలో ఇ-కామర్స్ మార్కెట్ పెరుగుతున్నందుకు, వినియోగదారులతో  మరింతగా కొనసాగుతున్నందుకు మేము సంతోషిస్తున్నాము ”అని స్నాప్ డీల్ తెలిపింది.గత రెండు సంవత్సరాల్లో స్నాప్‌డీల్ 60 వేల మంది కొత్త అమ్మకందారులను భాగస్వాములగా చేర్చింది.స్నాప్‌డీల్‌లో 5 లక్షల మందికి పైగా రిజిస్టర్డ్ సెల్లర్లు ఉన్నారు. వీరు మార్కెట్‌లో 200 మిలియన్లకు పైగా జాబితాలను కలిగి ఉన్నారని కంపెనీ పేర్కొంది.

Follow Us:
Download App:
  • android
  • ios