Asianet News TeluguAsianet News Telugu

2020 నుంచి కస్టమర్లకు అప్పులివ్వనున్న ట్రూకాలర్ యాప్

ఒకనాడు అపరిచిత కాల్స్, స్పామ్ కాల్స్ గుర్తించేందుకు రూపొందించిన ట్రూ కాలర్ యాప్.. తన కస్టమర్లకు రుణ పరపతి కల్పించేందుకు సిద్ధమవుతుంది. వచ్చే ఏడాది నుంచి యూజర్లకు అప్పులివ్వడం ద్వారా ఫిన్ టెక్ సంస్థగా నిలుస్తామని ట్రూ కాలర్ సహా వ్యవస్థాపకుడు నమి జరింగ్లమ్ తెలిపారు.

Truecaller to foray into credit business in early 2020: Co-founder Nami Zarringhalam
Author
Hyderabad, First Published Nov 26, 2019, 11:49 AM IST

 ఒకనాడు అపరిచిత వ్యక్తుల నుంచి వచ్చే కాల్స్‌‌తోపాటు పలు స్పామ్ కాల్స్‌‌ను కనుగొనేందుకు ఉపకరించిన ట్రూకాలర్ యాప్.. ఇప్పుడు అప్పులు కూడా ఇవ్వబోతుంది. వచ్చే ఏడాది నుంచి అప్పులిస్తామని, పూర్తిగా ఫిన్‌‌టెక్ కంపెనీగా మారతామని ట్రూకాలర్ తెలిపింది. 

2020 ప్రారంభంలో తన పేమెంట్స్ ప్లాట్‌‌ఫామ్ ద్వారా క్రెడిట్ వ్యాపారాల్లోకి అడుగుపెడతామని ట్రూకాలర్ కోఫౌండర్ నమి జరింగలం పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. ట్రూకాలర్‌‌‌‌ పే ద్వారా క్రెడిట్ వసతి అందించి ఫిన్‌‌టెక్ మార్కెట్‌‌లోకి అడుగుపెడతారా? అనే ప్రశ్నపై నమి స్పందిస్తూ  2020 ప్రారంభంలో ఈ సర్వీసులను అందించడానికి చూస్తున్నామని చెప్పారు.

aslo read ఇండియాలో ఐఫోన్‌...తయారీ, విక్రయాలు ఎక్కడి నుంచి చేస్తున్నారో తెలుసా...?

పరిమిత సంఖ్యలో యూజర్లపై ఈ సర్వీసులను టెస్ట్ చేశామని, వారి నుంచి అద్భుతమైన స్పందన వచ్చిందన్నారు. వారి నుంచి వచ్చిన స్పందన మేరకు, ఇండియాలోని యూజర్ల కోసం ‘ట్రూకాలర్  పే’ను అప్‌‌డేట్ చేయడంపై వర్క్ చేస్తున్నామని తెలిపారు. తమ కస్టమర్లకు అవసరమైన అన్ని రకాల డిజిటల్ ఎక్స్‌‌పీరియెన్స్‌‌ను అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు నమి చెప్పారు. 

Truecaller to foray into credit business in early 2020: Co-founder Nami Zarringhalam

ట్రూకాలర్​ పే ప్లాట్‌‌ఫామ్‌‌పై 2 కోట్ల మంది యూజర్లు ఉంటారని, వారిలో సగం మంది వరకు టైర్ 2, టైర్ 3 నగరాల వారేనని నమి అన్నారు. ట్రూకాలర్ పే భవిష్యత్‌‌పై ఆశాభావంగా ఉన్నారు.  అప్లికేషన్‌‌ నుంచి అప్రూవల్ వరకు ప్రతీది ఎండ్ టూ ఎండ్ డిజిటల్ ఎక్స్‌‌పీరియెన్స్‌‌ను కస్టమర్లకు అందించడానికి ప్రస్తుతం తాము పనిచేస్తున్నామని, భవిష్యత్ చాలా బాగుంటుందని పేర్కొన్నారు. ఎందుకంటే మైక్రోఫైనాన్స్, క్రెడిట్‌‌ వంటి సేవలను ఆఫర్ చేనున్నామని చెప్పారు.

ట్రూకాలర్‌‌‌‌ యాప్ తన ప్లాట్‌‌ఫామ్‌‌పై స్పామ్ కాల్స్‌‌ను కనిపెట్టడంతోపాటు, పేమెంట్స్, ఛాట్ వంటి సేవలను అందిస్తోంది. పెగాసస్ లాంటి సాఫ్ట్‌‌వేర్‌‌‌‌లతో దీనికి ప్రమాదాలు పొంచి ఉన్నాయి. పెగాసస్, ఇతర సాఫ్ట్‌‌వేర్‌‌‌‌లు టార్గెట్ చేసి అటాక్ చేస్తాయని నమి చెప్పారు. ఎక్కువ మంది ప్రజలు ప్రస్తుతం డిజిటల్ ప్రపంచంలోనే నివసిస్తుండటంతో,  సెక్యూరిటీపై అవగాహన కూడా పెరుగుతుందన్నారు. అంతకుముందులాగా పరిస్థితి లేదన్నారు. 

also read షియోమీ నుండి అదిరిపోయే ఫీచర్లతో మరో ఎంఐ కొత్త ఫోన్​...

తమ సిస్టమ్స్‌‌పై తనకు విశ్వాసం ఉందని నమి చెప్పారు. యూజర్లు వాడే సాఫ్ట్‌‌వేర్, సెక్యురిటీ పాచస్, అప్లికేషన్స్‌‌ అప్‌‌ టూ డేట్ లేకపోతే, ప్రమాదాలు సంభవిస్తాయన్నారు. ఇండియాలో డిజిటల్ పేమెంట్ తీరుపై నమి స్పందిస్తూ క్యాష్‌‌లెస్‌‌గా మారడానికి ఇండియా అవసరమైన మౌలిక వసతి అభివృద్ధి చేసుకోవడానికి సుమారు 10 ఏళ్లు పట్టొచ్చని నమి తెలిపారు. 

కొన్ని సార్లు డిజిటల్ పేమెంట్ల వాడకం తగ్గొచ్చని, కొన్ని సార్లు పెరగొచ్చని ఇది సహజ ప్రక్రియ అని నమి చెప్పారు. ఇండియాలో చాలా పేమెంట్ ప్రొడక్ట్‌‌లను ప్రజలు వాడుతున్నారని, కానీ ఇప్పటికీ పర్సులో క్యాష్ లేకుండా బయటికి మాత్రం వెళ్లడం లేదన్నారు. ఈ అడాప్షన్‌‌కు మరింత సమయం పట్టే అవకాశాలున్నాయని నమి చెప్పారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios