భారతీయ సిసిటివి మార్కెట్లో వేగంగా వృద్ధి చెందుతున్న కంపెనీ సెక్యూర్ఐ కొ-ఆక్సియల్ ఆడియో సపోర్ట్ తో కొత్త 2 మెగాపిక్సెల్ హెచ్‌డి టివిఐ కెమెరాను విడుదల చేసింది.  దీని అతిపెద్ద ప్రత్యేకత ఏంటంటే సెక్యూర్‌ఐ నుండి ఈ హెచ్‌డి సిసిటివి కెమెరాతో వీడియోను 1080 పిక్సెల్‌లలో రికార్డ్ చేయవచ్చు.

అంతే కాకుండా కొ-ఆక్సియల్ ఆడియో  సపోర్ట్ కారణంగా ఒకే కేబుల్ నుండి మల్టీ ఛానెల్‌లలో ఆడియో అవుట్‌పుట్ తీసుకోవచ్చు. ఐపి కెమెరాతో సింగిల్ కేబుల్ చాలా కాలంగా అందుబాటులో ఉంది.

కెమెరాకు ఆటోమేటిక్ 3డి డిఎన్‌ఆర్‌ సపోర్ట్ ఉంది, ఇది డిజిటల్ నాయిస్ తొలగించడంలో బాగా సహాయపడుతుంది. దీంతో పాటు ఇది కలర్ మిక్సర్‌గా కూడా పనిచేస్తుంది. సంస్థ  ప్రకారం ఈ కొత్త కెమెరా పగలు ఇంకా రాత్రి సమయంలో  సరిగ్గా ఉపయోగపడుతుంది. కెమెరా ధర గురించి కంపెనీ ఎటువంటి సమాచారం ఇవ్వలేదు.

also read ఆన్‌లైన్ షాపింగ్‌లో ఐఫోన్ ఆర్డర్ చేశాడు.. కానీ పార్శిల్ ఓపెన్ చేసి చూస్తే షాక్.. ఎం వచ్చిందో తెలుసా ...

సెక్యూర్ఐ సిసిటివికి 3.6 ఎంఎం హెచ్‌డి లెన్స్, 2 ఎంపి హెచ్‌డి టివిఐ కెమెరాతో వైడ్ యాంగిల్ సపోర్ట్ కూడా ఉంది. ఈ కెమెరా 20–30 మీటర్ల పరిధిలో వచ్చే ప్రతిదాన్ని ఖచ్చితత్వంతో గుర్తించగలదు.  కొ-ఆక్సియల్ కేబుల్  సపోర్ట్ తో  ఈ కెమెరా వీడియోతో పాటు స్పష్టమైన ఆడియోను రికార్డు చేయగలదు.
 
ఈ కొత్త ప్రయోగంలో సెక్యూర్ఐ కంపెనీ సెక్యూరిటీ డైరెక్టర్ మనీష్ అగర్వాల్ మాట్లాడుతూ, "ఈ రోజు మనకు ఇన్ఫ్రా రెడ్ నైట్ విజన్, కలర్ నైట్ విజన్, మోషన్ డిటెక్టర్ మొదలైన అనేక రకాల భద్రత, నిఘా కెమెరాలు ఉన్నాయి, అయితే ఈ విభాగంలో ఇంకా చాలా కొత్త వాటిని తయారు చేయవలసి ఉంది. వాటిని భర్తీ చేయడానికె  మా ఈ కొత్త కెమెరా  ప్రయత్నం '.  అని అన్నారు.