Asianet News TeluguAsianet News Telugu

ఆన్‌లైన్ షాపింగ్‌లో ఐఫోన్ ఆర్డర్ చేశాడు.. కానీ పార్శిల్ ఓపెన్ చేసి చూస్తే షాక్.. ఎం వచ్చిందో తెలుసా ?

చాలా సందర్భాలలో వినియోగదారులు స్మార్ట్ ఫోన్‌ ఆర్డర్ చేస్తే దానికి  బదులుగా పార్లే జీ బిస్కెట్లు లేదా సబ్బు వేరే ఇంకేదో వచ్చినట్లు  వినే ఉంటారు కాని ఈసారి ఇలాంటిది ఏమి జరిగాయి కానీ ఒక అద్భుతం చోటు చేసుకుంది. 

Online shopping: man ordered iPhone 6s, but iPhone-like table delivered at home
Author
Hyderabad, First Published Mar 26, 2021, 6:31 PM IST

ఆన్‌లైన్ షాపింగ్‌లో ఏదో కొంటె ఇంకేదో  వచ్చినట్లు తరచుగా వార్తల్లో చూస్తుంటాం.... చాలా సందర్భాలలో వినియోగదారులు స్మార్ట్ ఫోన్‌ ఆర్డర్ చేస్తే దానికి  బదులుగా పార్లే జీ బిస్కెట్లు లేదా సబ్బు వేరే ఇంకేదో వచ్చినట్లు  వినే ఉంటారు కాని ఈసారి ఇలాంటిది ఏమి జరిగాయి కానీ ఒక అద్భుతం చోటు చేసుకుంది.

ఒక వ్యక్తి ఐఫోన్‌ను ఆర్డర్ చేస్తే ఫోన్‌కు బదులుగా టేబుల్ వచ్చింది. ప్రత్యేక విషయం ఏమిటంటే, కస్టమర్ కి పంపిణీ చేసిన టేబుల్ సరిగ్గా ఐఫోన్ లాగా ఉంటుంది.  

 మలేషియాలోని ఒక నివేదిక ప్రకారం, ఒక యువకుడు ఇ-కామర్స్ వెబ్‌సైట్ నుండి తక్కువ ధరను చూసిన ఐఫోన్‌ను ఆర్డర్ చేశాడు, కాని అతను ఉత్పత్తి వివరణను సరిగ్గా చూడలేదు. యువకుడు ఐఫోన్‌కు బదులుగా ఐఫోన్‌ లాంటి టేబుల్‌ను ఆర్డర్ చేసినట్లు తేలింది. ఆర్డర్ డెలివరీ తర్వాత అతను ప్యాకెట్ చూస్తే మనిషి అంతా సైజ్ ఉన్న ఐఫోన్ బయటకు వచ్చింది. 

also read అద్భుతమైన కెమెరాతో వివో కొత్త సిరీస్ స్మార్ట్ ఫోన్స్ : ఏప్రిల్ 2 నుంచి సేల్స్ ప్రారంభం.. ...

ఈ  ఐఫోన్‌ టేబుల్ తో పాటు టేబుల్ కి అమర్చడానికి నాలుగు కాళ్ళు కూడా వచ్చాయి. ఈ  ఐఫోన్‌ టేబుల్  ఆకర్షణీయంగా ఐఫోన్ 6 ఎస్ కు పూర్తిగా సమానంగా ఉంటుంది, కాకపోతే సైజ్ లో మాత్రమే తేడా. ఈ  ఐఫోన్‌ టేబుల్ కి టచ్ ఐడి కూడా ఉంది. ఐఫోన్‌ టేబుల్ తో ఉన్న ఈ యువకుడి ఫోటో సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతోంది.

 2019లో బెంగళూరుకు చెందిన ఒక వ్యక్తి ఐఫోన్‌ను ఆర్డర్ చేస్తే చేతిలో పట్టుకునే ఐఫోన్ స్టిక్కర్‌తో కూడిన  నకిలీ ఫోన్ వచ్చింది. దీనికి ముందు స్మార్ట్‌ఫోన్‌ల బదులు ప్రజలకు  ఇతర వస్తువులు, రాళ్ళు కూడా వచ్చాయి.

Follow Us:
Download App:
  • android
  • ios