న్యూఢిల్లీ: విలాస వసతులు కోరుకునే సంపన్నులే లక్ష్యంగా శామ్‌సంగ్​ ఇండియా ఓ సరికొత్త ఎల్​ఈడీ స్క్రీన్​ను మార్కెట్లోకి తీసుకురానున్నది. రూ.3.5 కోట్ల నుంచి రూ.12 కోట్ల ధరతో మూడు సైజులలో ఈ డిస్​ప్లేలను అందుబాటులోకి తేనున్నట్లు శామ్‌సంగ్​ వెల్లడించింది​.

ఎలక్ట్రానిక్​ దిగ్గజం శాంసంగ్​.. సరికొత్త మాడ్యులర్​ మైక్రో ఎల్​ఈడీ డిస్​ప్లే 'ది వాల్​'ను భారత మార్కెట్​కు పరిచయం చేసింది. జాయింట్​ స్క్రీన్​తో 146 అంగుళాలు, 219 అంగుళాలు, 292 అంగుళాల వేరియంట్లలో ఈ డిస్​ప్లేలను మార్కెట్లోకి తేనున్నట్లు శామ్‌సంగ్​ ప్రకటించింది. 

also read ఇక అక్కడ సిమ్ కొనలంటే ఫేస్ స్కాన్ తప్పనిసరి...

ఈ టీవీల ధరలు రూ.3.5 కోట్ల నుంచి రూ.12 కోట్ల వరకు ఉండనున్నట్లు శామ్‌సంగ్​ పేర్కొంది. లగ్జరీ స్క్రీనింగ్​ అనుభూతిని కోరుకునే సంపన్నులే లక్ష్యంగా ఈ డిస్​ప్లేను పరిచయం చేసినట్లు శామ్‌సంగ్​ తెలిపింది. 

2022 నాటికి 200 యూనిట్లు విక్రయించి రూ.498 కోట్లు ఆర్జించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు శామ్‌సంగ్​ ఇండియా కన్సూమర్ ఎలక్ట్రానిక్స్ విభాగం ఉపాధ్యక్షుడు పునీత్​ సేతి తెలిపారు. భారత్​లో ప్రస్తుతం 140 మంది బిలియనీర్​లు, 950 మంది మల్టీ మిలియనీర్లు ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి.

ఈ స్క్రీన్​లకు మెట్రో, నాన్​ మెట్రో పట్టణాల నుంచి డిమాండ్​ ఉండొచ్చని శామ్‌సంగ్​ భావిస్తోంది. ముఖ్యంగా హైదరాబాద్​, బెంగళూరు, పుణె, లుథియానా, అహ్మదాబాద్​, ఛండీగఢ్​ల నుంచి ఎక్కువగా డిమాండ్​ ఉంటుందని అంచనా వేస్తోంది.

ది వాల్ 146 అంగుళాల డిస్​ప్లే.. మైక్రో ఎల్​ఈడీ సదుపాయంతో లభించనుంది.219 అంగుళాల డిస్​ప్లే, 6కే డెఫినిషన్​తో, 292 అంగుళాల డిస్​ప్లే 8కే డెఫినిషిన్​తో రూపొందిస్తున్నారు. ది వాల్​తో వినియోగదారులు ఇంతకు ముందు ఎన్నడూ లేని స్క్రీన్​ అనుభూతి పొందుతారని శామ్‌సంగ్ చెబుతోంది. 

also read  బెస్ట్ కెమెరా​ ఫోన్​ కొనాలనుకుంటున్నారా? అయితే ఈ స్మార్ట్​ఫోన్లపై ఓ లూక్కెయండి...

ఈ డిస్​ప్లేలలో 0.8 ఎంఎం పిక్సెల్​ పిఛ్​ టెక్నాలజీ పొందుపరిచినట్లు తెలిపింది. దీని ద్వారా సినిమా, వీడియోలలో లగ్జరీ వినియోగదారులు అనుభూతి పొందుతారని శామ్‌సంగ్ పేర్కొంది. అన్ని రకాల ఓఎస్​లకు ది వాల్ అనుకూలంగా ఉండనున్నట్లు శామ్‌సంగ్ తెలిపింది. 

ది వాల్​ ప్రొఫెషనల్ వెర్షన్​ను అందుబాటులోకి తేనుంది శామ్‌సంగ్. పెద్ద పెద్ద వ్యాపారాలకు, రిటైలర్లకు ఇది ఉపయోగకరంగా ఉండనున్నట్లు తెలిపింది. ఇది పూర్తి కస్టమైజబుల్​ ఫీచర్లతో రానున్నట్లు పేర్కొంది.ది వాల్​ను పూర్తిగా ఆఫ్​ ​చేయాల్సిన అవసరం లేకుండా రూపొందించినట్లు శామ్‌సంగ్  వెల్లడించింది. ఎక్కువ సమయం వాడకపోతే ఇంటీరియర్​కు తగ్గట్లు సీనరీలు, ఆర్ట్​ల వంటివి డిస్​ప్లే అవుతూ ఉంటాయని తెలిపింది.