జియో కొత్త ప్రాడక్ట్ ...ఆ కస్టమర్లకు మాత్రమే...

జియో ఫైబర్ దాని పెడ్ కస్టమర్స్ కి ఉచితంగా ఆండ్రాయిడ్ ఆధారిత సెట్-టాప్ బాక్స్‌ను ఇస్తోంది. మరికొన్ని వారాల్లో ఇది దేశవ్యాప్తంగా అందుబాటులో రానుంది.సెట్-టాప్ బాక్స్‌లో బ్లూటూత్  రిమోట్ కంట్రోల్, హెచ్‌డిఎంఐ కేబుల్, ఈథర్నెట్ కేబుల్  ఉంటాయి.

reliance jio set up box launch

జియో ఫైబర్ కొత్త టారిఫ్ ప్లాన్‌లను ప్రకటించిన కొన్ని నెలల తర్వాత, జియో ఫైబర్  ప్రివ్యూ ఆఫర్ కస్టమర్లకు పెడ్ ప్లాన్లను ప్రారంభించింది. ఇందులో భాగంగా బ్రాడ్ బాండ్ సర్విస్  ప్రస్తుత వినియోగదారులకు జియో ఫైబర్ సెట్-టాప్ బాక్స్‌ను ఉచితంగా ఇస్తోంది. సైన్ అప్ చేసిన క్రొత్త కస్టమర్లకు కాంప్లిమెంటరీ కింద కూడా సెట్-టాప్ బాక్సును ఇస్తుంది. మరికొన్ని వారాల్లో ఇది దేశవ్యాప్తంగా అందుబాటులో రానుంది.

ఈ ఏడాది ప్రారంభంలో జియో ఫైబర్ తన బ్రాడ్‌బ్యాండ్ సర్విస్ కస్టమర్ల కోసం సెట్-టాప్ బాక్స్‌కు ఇవ్వనున్నట్లు తెలిపింది. ఫ్రీ జియో ఫైబర్ సెట్-టాప్ బాక్స్ అనేది ఆండ్రయిడ్- బెసేడ్ స్ట్రీమింగ్ మీడియా ప్లేయర్, వినియోగదారులు HDMI కనెక్షన్‌ని ఉపయోగించి దీనిని వారి టీవీలకు కనెక్ట్ చేయవచ్చు. సెట్-టాప్ బాక్స్‌లో బ్లూటూత్  రిమోట్ కంట్రోల్, హెచ్‌డిఎంఐ కేబుల్, ఈథర్నెట్ కేబుల్  ఉంటాయి.

also read షియోమీ, వన్‌ప్లస్ లాగే ‘స్మార్ట్ టీవీల్లోకి’ ఇన్ఫినిక్స్


సెట్-టాప్ బాక్స్ ప్రస్తుతం కొన్ని యాప్స్, సర్వీసెస్ నుండి కంటెంట్‌ను ప్రసారం చేస్తుంది. ఇది DTH సెట్-టాప్ బాక్స్ లాగా కాకుండా ఇంటర్నెట్ నుండి కంటెంట్‌ను ప్రసారం చేయడానికి మాత్రమే ఉపయోగించబడుతుంది. ఇతర ఆన్‌లైన్ స్ట్రీమింగ్ మీడియా ప్లేయర్ లాగానే కంటెంట్‌ను ప్రసారం చేయడానికి మీకు ఇంటర్నెట్ కనెక్షన్ అవసరం.  

రిలయన్స్ సంస్థ బ్రాడ్‌బ్యాండ్ సర్విస్ పాత, కొత్త కస్టమర్లకు జియో ఫైబర్ సెట్-టాప్ బాక్స్ అందుబాటులో ఉంది.  
ప్రస్తుత జియో ఫైబర్ ప్రివ్యూ ఆఫర్ వినియోగదారులకు కాంప్లిమెంటరీ కింద జియో ఫైబర్ సెట్-టాప్ బాక్స్ పొందటానికి  మై జియో యాప్ ద్వారా మీకు నచ్చిన పెడ్ ప్లాన్ కోసం సైన్ అప్ అవ్వాలి. మీరు నెలవారీ, త్రైమాసిక లేదా వార్షిక ప్రణాళికను సెలెక్ట్ చేసుకోవాలి.

మీరు పేమెంట్ చేసిన తర్వాత మై జియో యాప్ స్క్రీన్‌పై బ్యానర్‌ వస్తుంది. ఇది మీ సెట్-టాప్ బాక్స్ ఇన్‌స్టాలేషన్ కోసం అపాయింట్‌మెంట్ షెడ్యూల్ చేయడానికి అడుగుతుంది. ఫ్రీ జియో ఫైబర్ సెట్-టాప్ బాక్స్‌ పొందటానికి సమీపంలోని రిలయన్స్ జియో రిటైల్ స్టోర్ లో కూడా పొందవచ్చు. 

also read తొలి ఏడాదే ఇండియన్ బెస్ట్ బ్రాండ్ ‘రియల్ మీ’


ప్రస్తుతానికి జియో ఫైబర్ సెట్-టాప్ బాక్స్ హార్ట్ స్టార్, యూట్యూబ్, వూట్, జియో సావన్, జియో టివి ప్లస్, సోనీలైవ్, జియో సినిమా యాప్స్ తో వస్తుంది. సెట్-టాప్ బాక్స్‌లో క్రొత్త యాప్స్ డౌన్‌లోడ్ చేసుకోడానికి జియోస్టోర్ ద్వారా చేసుకోవచ్చు. స్ట్రీమింగ్ సర్వీసెస్ తో పాటు,గేమ్స్ కూడా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. మీ టారిఫ్ ప్లాన్ ఆధారంగా హాట్‌స్టార్ విఐపి ప్లాన్, సోనీలైవ్, వూట్ యాప్స్ కాంప్లిమెంటరీ కింద ఫ్రీగా వాడుకోవచ్చు.

మీరు జియో ఫైబర్ సెట్-టాప్ బాక్స్‌లో బాక్స్‌లో ప్రీ ఇన్‌స్టాల్ చేసిన జియో ప్లస్ యాప్ ద్వారా లైవ్ టీవీ ఛానెల్‌, ఎంటర్టైన్మెంట్, మ్యూజిక్, న్యూస్ ఛానెల్‌లు చూడవచ్చు. ఈ సెట్-టాప్ బాక్స్‌లో మీరు 4కె కంటెంట్‌ను కూడా ప్లే  చేయవచ్చు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios