తొలి ఏడాదే ఇండియన్ బెస్ట్ బ్రాండ్ ‘రియల్ మీ’
చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజం ఒప్పో అనుబంధ సంస్థ రియల్ మీ భారతదేశంలో అడుగు పెట్టిన తొలి ఏడాదే కోటిన్నర మొబైల్ ఫోన్లు విక్రయించింది. తొలి ఏడాదే బెస్ట్ బ్రాండ్‌గా నిలిచింది రియల్ మీ.
న్యూఢిల్లీ: చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజం ఒప్పో సబ్ బ్రాండ్‌గా ఇండియా మార్కెట్‌లో అడుగుపెట్టిన రియల్మీ తొలి ఏడాదిలోనే అత్యంత వేగంగా ఎదిగిన బ్రాండ్‌గా నిలిచింది. ఈ ఏడాదిలో మొత్తం 1.50 కోట్ల హ్యండ్‌సెట్లను విక్రయించింది. తద్వారా భారతదేశంలో ఇప్పటికే ప్రజాదరణ పొందిన షియోమీ ఫోన్‌కు గట్టి పోటీ ఇస్తోంది.
వచ్చే ఏడాది రియల్మీ అమ్మకాలు ప్రస్తుతం కన్నారెండింతలు అవుతాయని కంపెనీ ఇండియా సీఈఓ మాధవ్సేఠ్ అన్నారు. రూ. 7000, రూ. 20,000 ఫోన్స్సెగ్మెంట్లలో షియోమీకి ఈ బ్రాండ్గట్టి పోటీ ఇస్తోంది.వివో, ఒప్పో వంటి బ్రాండ్లలా కాకుండా, పూర్తిగా ఈ కంపెనీ ఆన్‌లైన్ డిస్ట్రిబ్యూషన్‌పై దృష్టి సారించింది. రియల్ మీ మొదట ఒప్పో సబ్ బ్రాండ్‌గా ఇండియాలో అడుగుపెట్టినా, తర్వాత పూర్తి ఇండిపెండెంట్బ్రాండ్గా మారింది. ఈ కంపెనీని ఒప్పో పేరెంట్ కంపెనీ బీబీకేతో కలిసి మాధవ్శేఠ్ ఇండియాలోకి తీసుకొచ్చారు.
also read అమెజాన్ అలెక్సాతో బోట్ స్టోన్ పోర్టబుల్ స్పీకర్
రియల్మీ 2019లో ప్రపంచంలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న స్మార్ట్‌ఫోన్ బ్రాండ్లలో ఏడవ స్థానాన్ని పొందిందని మాధవ శేఠ్ అన్నారు. “ ‘మనం 2019 చివరిలో ఉన్నాం. ఇది మా ఆపరేషన్స్‌కు మొదటి పూర్తి ఏడాది. ఈ ఏడాదిలో 1.50 కోట్ల హేండ్‌సెట్లను విక్రయించాం. వచ్చే ఏడాది మా అమ్మకాలను రెండింతలు చేయడమే మా టార్గెట్” అని రియల్ మీ ఇండియా సీఈఓ మాధవ్ శేఠ్ అన్నారు.
ఇంటర్నేషనల్ డేటా కార్పోరేషన్ (ఐడీసీ) డేటా ప్రకారం ఈ ఏడాది మూడవ క్వార్టర్‌లో ఇండియాలో మా బ్రాండ్ 14.3 శాతం వాటాను దక్కించుకుందని రియల్ మీ ఇండియా సీఈఓ మాధవ్ శేఠ్ తెలిపారు. మొత్తంగా ఇండియాలో రియల్మీ నాల్గవ అతిపెద్ద స్మార్ట్ఫోన్బ్రాండ్గా అవతరించిందని ఐడీసీ పేర్కొంది.
మూడవ క్వార్టర్‌లో ఇండియాలో షియోమీ 27.1 శాతం మార్కెట్ వాటాతో మొదటి స్థానంలో ఉండగా, శామ్‌సంగ్ 18.9 శాతంతో, వివో 15.2 శాతంతో తర్వాతీ స్థానాల్లో ఉన్నాయి. షియోమీ తక్కువ ధరలలో నాణ్యమైన స్మార్టఫోన్లతో తన ప్రయాణాన్ని 2015లో ప్రారంభించింది.
షియోమీ మార్గాన్నే రియల్ మీ కూడా అనుసరిస్తోంది. రియల్మీ ఇండియాలో మొదట 2018 మే నెలలో ప్రారంభించింది. 2018 మూడవ క్వార్టర్‌లో ఈ బ్రాండ్ మార్కెట్ వాటా కేవలం 3.1 శాతం మాత్రమే. ప్రస్తుతం చైనా, ఇండియా, సౌత్ ఈస్ట్ఏసియా, రష్యా, యూరోప్ వంటి 20 మార్కెట్లలో అందుబాటులో ఉంది.
కేవలం దీపావళి సిజన్‌లోనే 52 లక్షల స్మార్ట్‌ఫోన్లను విక్రయించామని రియల్ మీ ఇండియా సీఈఓ మాధవ్శేఠ్ అన్నారు. కౌంటర్‌పాయింట్ సంస్థ అధ్యయనం ప్రకారం రియల్మీ 2019 మూడవ క్యార్టర్‌లో కోటి స్మార్ట్‌ఫోన్లను రవాణా చేసింది. ఇది ఏడాది ప్రాతిపదికన 808 శాతం పెరుగుదల. ఈ పండుగ సీజన్‌లో రియల్మీ సీ2, రియల్మీ 3ఐ, రియల్మీ 5 మోడల్స్అత్యధికంగా అమ్ముడు పోయాయి. ప్రస్తుతం ఈ కంపెనీ అంతర్జాతీయ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో ఏడవ ర్యాంక్‌లో ఉందని కౌంటర్‌పాయింట్ పేర్కొంది.
also read ఫోన్‌పే యాప్ ద్వారా ఇప్పటివరకు ఎన్ని ట్రాన్సాక్షన్స్ జరిగాయో తెలుసా...?
ఆఫ్‌లైన్‌లో అందుబాటులో ఉండే సిరీస్‌లను ప్రారంభించనున్నామని రియల్ మీ ఇండియా సీఈఓ మాధవ్ శేఠ్ తెలిపారు. బెటర్ బ్యాటరీ, టచ్‌తో ఇవి మిడ్ ప్రీమియం రేంజ్‌లో ఉంటాయని తెలిపారు. “పలుసార్లు స్మార్ట్ యాక్ససరీలతో పాటు ట్రెండీ డిజైన్, గ్రేట్ పెర్ఫార్మెన్స్‌తో రియల్మీ కస్టమర్లను పలకరించనుంది. 2020 లో టెక్ లైఫ్‌స్టైల్ బ్రాండ్‌గా రియల్మీ నిలవనుంది’ అని శేఠ్ తెలిపారు.
సీ సిరీస్, నంబర్సిరీస్, ప్రో సిరీస్, ఎక్స్సిరీస్లతో ఇండియాలో రియల్మీ ప్రజాదరణ పొందింది. ప్రస్తుతం ఈ బ్రాండ్ ఆన్‌లైన్ మార్కెట్లో విస్తరించింది. ఫ్లిప్‌కార్ట్‌లో నెంబర్ వన్ బ్రాండ్‌గా రియల్ మీ నిలవగా, మొత్తం మీద రెండో నెంబర్ స్థానంలో ఉంది. ప్రస్తుతం ఈ కంపెనీ ఆఫ్‌లైన్ మార్కెట్లోకి విస్తరించడానికి ప్రణాళికలు వేస్తోంది.
70 శాతం అమ్మకాలు ఆన్‌లైన్‌ద్వారా, 30 శాతం ఆఫ్లైన్ద్వారా జరపడమే రియల్ మీ టార్గెట్‌గా పెట్టుకుంది. ఈ సంస్థ పేరెంట్ కంపెనీ అయిన బీబీకే ఎలక్ట్రానిక్స్ వివో, ఒప్పో వంటి బ్రాండ్లను కూడా తయారు చేస్తోంది. ప్రస్తుతం రియల్మీ ఇండిపెండెంట్ కంపెనీగా నడుస్తోంది. ఈ కంపెనీ ఫౌండర్మాజీ ఒప్పో వైస్‌చైర్మన్ స్కైలీ. రియలీ మొబైల్ టెలికమ్యునికేషన్స్ ప్రై. ప్రస్తుతం ఇండిపెండెంట్ బ్రాండ్‌గా ఉందని మాధవ్శేఠ్ అన్నారు.