జియో కస్టమర్లకు మరో బ్యాడ్ న్యూస్...చార్జీల పెంపు..
రిలయన్స్ జియో రాబోయే కొన్ని వారాల్లో టారిఫ్ ప్లాన్ లను పెంచనున్నట్లు అలాగే టారిఫ్ ప్లాన్ వల్ల డాటా వినియోగం పై ఎలాంటి ప్రభావం ఉండదు అని తెలిపింది.
భారతీ ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా టారిఫ్ లను పెంచే నిర్ణయాన్ని ప్రకటించిన తర్వాత, రిలయన్స్ జియో మంగళవారం టెలికాం సర్వీస్ ఛార్జీలను పెంచనున్నట్లు తెలిపింది. "డేటా వినియోగం లేదా డిజిటల్ సేవ వృద్ధిని ప్రభావితం చేయకుండా మరియు పెట్టుబడులను నిలబెట్టుకునేల టారిఫ్ లలో తగిన పెరుగుదలను నిర్వహిస్తామని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది.
also read మొబైల్ టారిఫ్‌లను పెంచనున్న ఐడియా, వోడాఫోన్...కారణం ?
"ఇతర ఆపరేటర్ల మాదిరిగానే, మేము కూడా భారతీయ వినియోగదారులకు ప్రయోజనం చేకూర్చేలా అలాగే పరిశ్రమను బలోపేతం చేయడానికి ప్రభుత్వంతో కలిసి పనిచేస్తాము. డేటా వినియోగం లేదా వృద్ధిని ప్రతికూలంగా ప్రభావితం చేయని విధంగా రాబోయే కొద్ది వారాల్లో టారిఫ్ లను తగిన విధంగా పెంచడానికి చర్యలు తీసుకుంటాము. డిజిటల్ సేవలో పెట్టుబడులను ఇప్పటిలాగే కొనసాగిస్తుంది "అని రిలయన్స్ తెలిపింది.
భారతీ ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా డిసెంబర్ 1 నుండి వినియోగదారులకు టారిఫ్ లను పెంచే ప్రణాళికలను ప్రకటించాయి. 2019 సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో ఇరు నెట్వర్క్ లు భారీ నష్టాలను నివేదించారు. అయితే టెలికాం కంపెనీలకు మొత్తం నష్టాలు రూ. 74,000 కోట్లు.
also read 6 inch హెచ్‌డి డిస్ప్లేతో షియోమి ఎంఐ రీడర్
మొబైల్ డేటాకు డిమాండ్ పెరుగుతూనే ఉన్నప్పటికీ, భారతదేశంలో మొబైల్ డేటా ఛార్జీలు ప్రపంచంలో ఎంత చౌకగా ఉన్నాయో కూడా వోడాఫోన్ ఐడియా హైలైట్ చేసింది. కంపెనీ డిసెంబర్ 1, 2019 నుండి సుంకాలను కూడా పెంచుతుంది.