6 inch హెచ్‌డి డిస్ప్లేతో షియోమి ఎంఐ రీడర్
షియోమి చివరకు ఎంఐ రీడర్‌ను ప్రారంభించింది. ఈ డివైజ్ అమెజాన్ కిండిల్ లాగా ఉంటుంది. HD ఇ-ఇంక్ డిస్‌ప్లే కలిగి ఉంది. క్రౌడ్ ఫండింగ్ ద్వారా రేపు ఎంఐ రీడర్ ప్రీ-ఆర్డర్ చేసుకోవచ్చు.
కొద్ది రోజుల క్రితం ఈ బుక్ రీడర్ ప్రారంభించడాన్ని టీజ్ చేసిన తరువాత షియోమి చివరకు ఎంఐ రీడర్‌ను ప్రారంభించింది. ఈ డివైజ్ అమెజాన్ కిండిల్ లాగా ఉంటుంది. HD ఇ-ఇంక్ డిస్‌ప్లే కలిగి ఉంది. ఇది 24 బ్రైట్నెస్ సెట్టింగులకు సపోర్ట్ చేస్తుంది అలాగే ఎంఐ రీడర్ క్వాడ్-కోర్ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది.
అన్నీ రకాల ఫైల్ ఫార్మాట్‌లకు సపోర్ట్ చేస్తుంది. ఆండ్రాయిడ్ 8.1 ఓరియో ఆధారంగా కస్టమ్ స్కిన్‌ను ఉంటుంది. ఆసక్తికరంగా ఎంఐ రీడర్ యుఎస్బి టైప్-సి పోర్టును కలిగి ఉంటుంది దీనికి 1,800 ఎమ్ఏహెచ్ బ్యాటరీతో ప్యాక్ చేశారు.
also read మొబైల్ టారిఫ్‌లను పెంచనున్న ఐడియా, వోడాఫోన్...కారణం ?
షియోమి ఎంఐ రీడర్ ఫీచర్స్
ఎంఐ రీడర్ 6 అంగుళాల హెచ్‌డి ఇ-ఇంక్ డిస్‌ప్లే, 212 PP పిక్సెల్, షియోమి ఈ బుక్ రీడర్ 24 బ్రైట్నెస్ సెట్టింగులకు సపోర్ట్ చేస్తుంది, TXT, EPUD, PDF, DOC, XLS, PPT వంటి మల్టీ ఫైల్ ఫార్మాట్‌లకు అనుకూలంగా ఉంటుంది. WPS, మైక్రోసాఫ్ట్ ఆఫీస్ కంటెంట్, ఇది వినియోగదారులు తమ లైబ్రరీని క్లౌడ్ నుండి డౌన్ లోడ్ చేసుకోవడానికి అలాగే ఫోన్‌లో సజావుగా వాటిని చదవటానికి ఎంఐ రీడర్ సహాయపడుతుంది.
ఎంఐ రీడర్‌లో 1,800 ఎంఏహెచ్ బ్యాటరీ, యుఎస్‌బి టైప్-సి పోర్ట్, 5 వి / 1.5 ఎ ఛార్జర్ కలిగి ఉంటుంది. ఈ డివైజ్ వైట్ బెజెల్స్‌తో కూడిన డ్యూయల్-టోన్ డిజైన్ తో వస్తుంది. వెనుక స్ట్రాంగ్ ప్యానెల్, చేతిలో పట్టుకోవడానికి మంచి పట్టుని కలిగి ఉంటుంది. షియోమి యొక్క కొత్త ఈ బుక్ రీడర్ 1.8GHz వద్ద క్లాక్ చేయబడిన క్వాడ్-కోర్ ఆల్విన్నర్ B300 ప్రాసెసర్ ద్వారా పనిచేస్తుంది. ఇది 1GB RAM, 16GB ఇంటర్నల్ స్టోరేజ్ తో జతచేయబడింది. ఎంఐ రీడర్ ఆండ్రాయిడ్ 8.1 ను కస్టమ్ స్కిన్‌తో ఉంటుంది. ఇది 159.2 x 116 x 8.3mm సైజ్, 178 గ్రాముల బరువు ఉంటుంది.
also read ఐఫోన్ నుండి ట్వీట్ చేసిన రియల్ మీ సీఈఓ....ఎందుకు.. ?
షియోమి ఎంఐ రీడర్ ధర
నవంబర్ 20, బుధవారం నుండి క్రౌడ్ ఫండింగ్ ద్వారా దీనిని బుక్ చేసుకోవచ్చు దీని ప్రారంభ ధర CNY 579 (సుమారు రూ. 5,900). క్రౌడ్ ఫండింగ్ సాధించిన తర్వాత ఎంఐ రీడర్ ధర CNY 599 కు పెంచబడుతుంది (సుమారు రూ .6,100 ). అయితే ఎంఐ రీడర్ ఎప్పుడు ఆన్ లైన్ అమ్మకాలకు వెళుతుందో, ఇంకా భారత్‌తో సహా అంతర్జాతీయ మార్కెట్లలోకి ప్రవేశిస్తుందా అనే దానిపై కంపెనీ ఇంకా ఎలాంటి సమాచారం వెల్లడించలేదు. చైనాలో ఎంఐ రీడర్ షిపింగ్ డిసెంబర్ 18 నుండి ప్రారంభమవుతుంది.