Asianet News TeluguAsianet News Telugu

రెడ్‌మి కొత్త వెరియేంట్ ఫోన్...లాంచ్ ఎప్పుడంటే..

రెడ్‌మి నోట్ 8  కొత్త కలర్ వేరియంట్ లాంచ్ చేసింది. ఈ కొత్త వేరిఏంట్ కలర్ ని కాస్మిక్ పర్పుల్ అని పిలుస్తారు. రెడ్‌మి నోట్ 8 కాస్మిక్ పర్పుల్ ఫోను ఇటీవల చైనాలో లాంచ్ అయిన నెబ్యులా ఫోన్ పర్పుల్ కలర్ వేరియంట్‌తో సమానంగా ఉంటుంది. 

red mi launches its new varient phone
Author
Hyderabad, First Published Nov 27, 2019, 4:33 PM IST

స్మార్ట్ ఫోన్ కంపెనీ షియోమి ఇప్పుడు పర్పుల్ గ్రేడియంట్ ఫినిష్‌తో కొత్త రెడ్‌మి నోట్ 8 కలర్ వేరియంట్ లాంచ్ చేసింది. ఈ కొత్త వేరిఏంట్ కలర్ ని కాస్మిక్ పర్పుల్ అని పిలుస్తారు. రెడ్‌మి నోట్ 8 కాస్మిక్ పర్పుల్ ఫోను ఇటీవల చైనాలో లాంచ్ అయిన నెబ్యులా ఫోన్ పర్పుల్ కలర్ వేరియంట్‌తో సమానంగా ఉంటుంది. రెడ్‌మి నోట్ 8 కాస్మిక్ పర్పుల్ కలర్ వేరియంట్ నవంబర్ 29 నుండి భారతదేశంలో అందుబాటులో ఉంటుందని షియోమి ప్రకటించింది.

also read డిసెంబర్ 10న రెడ్​మీ '5జీ' స్మార్ట్​ఫోన్ లాంచ్... రెండు కొత్త ఫీచర్లతో...

రెడ్‌మి ఇండియా అధికారిక  ట్విట్టర్ ఈ రోజు ప్రారంభంలో ఒక ట్వీట్ ద్వారా రెడ్‌మి నోట్ 8 యొక్క కాస్మిక్ పర్పుల్ కలర్ ఫోన్ అధికారికంగా చూపించింది. దానితో పాటు ఒక చిన్న వీడియో కూడా ఉంది. కొత్త పెయింట్‌జాబ్‌ను ప్రదర్శిస్తూ రెడ్‌మి నోట్ 8  మొదటి అమ్మకం నవంబర్ 29 న నిర్వహించబడుతుంది. ఇది మధ్యాహ్నం 12 గంటలకు (మధ్యాహ్నం) IST నుండి ప్రారంభం కానుంది. ఇది భారతదేశంలోని ఏంఐ.కామ్ మరియు అమెజాన్ రెండింటిలో లభిస్తుంది. రెడ్‌మి నోట్ 8 కాస్మిక్ పర్పుల్ వేరియంట్  మొదటి అమ్మకం షియోమి  బ్లాక్ ఫ్రైడే సేల్ ప్రారంభంతో సమానంగా ఉంటుంది. ఈ అమ్మకాలు డిసెంబర్ 2 వరకు కోనసాగుతుంది.

red mi launches its new varient phone


భారతదేశంలో రెడ్‌మి నోట్ 8 ధర
రెడ్‌మి నోట్ 8 భారతదేశంలో 4 జీబీ ర్యామ్ 64 జీబీ స్టోరేజ్ వేరియంట్‌కు రూ.9,999 రూపాయలు, రూ. 6 జీబీ 128 జీబీ మోడల్‌కు రూ.12,999 రూపాయలు. కొత్త కాస్మిక్ పర్పుల్ కలర్ తో పాటు ఇది మూన్లైట్ వైట్, నెప్ట్యూన్ బ్లూ మరియు స్పేస్ బ్లాక్ వేరియంట్లలో కూడా వస్తుంది. ఫోన్ కాస్మిక్ పర్పుల్ వేరియంట్ ఏంఐ.కామ్ మరియు అమెజాన్ నుండి నవంబర్ 29 నుండి మధ్యాహ్నం 12 గంటల (మధ్యాహ్నం) నుండి కొన్ని ఆఫర్లతో లభిస్తుంది.

also read మార్కెట్లోకి విడుదలైన ఫస్ట్ 5జీ స్మార్ట్‌ఫోన్..ధర ఎంతంటే ?

 

రెడ్‌మి నోట్ 8 లక్షణాలు


రెడ్‌మి నోట్ 8 ఆండ్రాయిడ్ 9 పై  MIUI 10 కస్టమ్ స్కిన్‌తో వస్తుంది. ఇది 19:9 మరియు 6.39-అంగుళాల పూర్తి-హెచ్‌డి (1080x2280 పిక్సెల్స్) డిస్ ప్లే ను మరియు పై భాగంలో వాటర్‌డ్రాప్ నాచ్‌ను కలిగి ఉంటది. బడ్జెట్ షియోమి ఫోన్ ఆక్టా-కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 665 SoC ద్వారా నడుస్తుంది. ఇది 6GB వరకు RAM తో జత చేయబడింది.

ఇమేజింగ్ విభాగంలో రెడ్‌మి నోట్ 8  క్వాడ్ రియర్ కెమెరా సెటప్‌లో 48 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఇంకా 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ స్నాపర్, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్, 2 మెగాపిక్సెల్ మాక్రో లెన్స్ ఉన్నాయి. ముందు భాగంలో 13 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా, వీడియో కాల్స్ నిర్వహించడానికి ఎఫ్ / 2.0 లెన్స్‌తో ఉంటుంది. రెడ్‌మి నోట్ 8లో 4,000 ఎంఏహెచ్ బ్యాటరీ 18W ఫాస్ట్ ఛార్జింగ్‌ లభిస్తుంది.

Follow Us:
Download App:
  • android
  • ios