Asianet News TeluguAsianet News Telugu

డిసెంబర్ 10న రెడ్​మీ '5జీ' స్మార్ట్​ఫోన్ లాంచ్... రెండు కొత్త ఫీచర్లతో...

చైనా స్మార్ట్ ఫోన్ల మేజర్ షియోమీ డ్యూయల్​ పంచ్​ హోల్​ సెల్ఫీ కెమెరా, డ్యూయల్​ మోడ్​ 5జీతో కొత్త ఫోన్​ను మార్కెట్లోకి రానున్నది. రెడ్​మీ కే20 ఫోన్ సాధించిన సక్సెస్‌తో అదే శ్రేణిలో మరో ఫోన్​ను రెడ్​మీ కే30 పేరుతో విడుదల చేయనున్నట్లు పేర్కొంది. 

Redmi K30 Series Launch Date Set for December 10
Author
Hyderabad, First Published Nov 27, 2019, 12:19 PM IST

న్యూఢిల్లీ చైనా స్మార్ట్​ఫోన్​ దిగ్గజం షియోమీ మరో కొత్త మిడ్​రేంజ్​ ఫోన్​ను భారత విపణిలో విడుదల చేసేందుకు సిద్ధమైంది. రెడ్​మీ కే20 ఫోన్ సాధించిన సక్సెస్‌తో అదే శ్రేణిలో మరో ఫోన్​ను రెడ్​మీ కే30 పేరుతో విడుదల చేయనున్నట్లు పేర్కొంది. గతంలో రెడ్​మీ కే30 ఫోన్​ గురించి వచ్చిన అంచనాలకు అనుగుణంగా రెండు సెల్ఫీ కెమెరాలతో (డ్యూయల్ పంచ్​ హోల్ కెమెరా), డ్యూయల్ మోడ్​ 5జీ సపోర్ట్​తో అందుబాటులోకి రానున్నట్లు షియోమీ స్పష్టం చేసింది. ఈ రెండు ఫీచర్లతో వస్తున్న తొలి ఫోన్ ఇదే కావడం గమనార్హం.

also read  Black Friday Sales:ఫోన్ కొన్నాక కస్టమర్లకు ఏం గిఫ్ట్‌ ఇస్తున్నారో తెలుసా ? 

ఈ ఫోన్​ను వచ్చే నెల 10వ తేదీన చైనాలో విడుదల చేయనున్నట్లు షియోమీ వెల్లడించింది. అయితే రెడ్​ మీ కే30 ప్రోను అదే రోజు విడుదల చేస్తుందా? లేదా? అనే విషయంపై షియోమీ స్పష్టతనివ్వలేదు. ఇప్పటి వరకు ఉన్న టెక్ వార్తా సంస్థ సమచారం ప్రకారం రెడ్​మీ కే30 ప్రో వచ్చే ఏడాది తొలినాళ్లలో మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉన్నది. 

5జీ నెట్​వర్క్ అనేది చాలా దేశాల్లో ఇంకా ప్రారంభ దశలోనే ఉంది. అయితే చైనా, అమెరికా, బ్రిటన్​, జపాన్​ వంటి దేశాలు 5జీని విసృతం చేసేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నాయి. కొన్ని దేశాల్లో 5జీ కోసం 4జీ నెట్​వర్క్​ మౌలిక సదుపాయాల్లోనే మార్పులు చేశారు. 

aslo read  మార్కెట్లోకి విడుదలైన ఫస్ట్ 5జీ స్మార్ట్‌ఫోన్..ధర ఎంతంటే ?

దీన్ని 5జీ నాన్​ స్టాండ్​ అలోన్​ యాక్సెస్​ (5జీ ఎన్​ఎస్​ఏ) అని అంటారు. సాధారణ 5జీ నెట్​వర్క్​ను స్టాండ్ అలోన్ యాక్సెస్ (5జీఎస్​ఏ) అంటారు. ఈ నేపథ్యంలో రెండు రకాల నెట్​వర్క్​లను వాడేందుకు వీలుగా రెడ్​మీ కే30 మోడల్​ను షియోమీ ఆవిష్కరించనున్నట్లు తెలుస్తోంది.

రెడ్ మీ కే 30 మోడల్ ఫోన్ భారత్​లో ఎప్పుడు విడుదలవుతుంది అనే విషయంపై షియోమీ స్పష్టతనివ్వలేదు. అయితే భారత్​లో ఇప్పటి వరకు 5జీ నెట్​వర్క్​ దిశగా పెద్దగా అడుగులు పడటం లేదు. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది తొలినాళ్లలో రెడ్​మీ కే30 4జీ వేరియంట్​ను భారత్​లో విడుదల చేసే అవకాశం ఉన్నట్లు పలు టెక్​ వార్తా సంస్థలు అంచనా వేస్తున్నాయి.
 

Follow Us:
Download App:
  • android
  • ios