ఇక వాట్సాప్ ఆండ్రాయిడ్‌లో ఫింగర్ ప్రింట్ లాక్ ఫీచర్‌

ఆండ్రాయిడ్ వినియోగదారుల కోసం వాట్సాప్ ఇప్పుడు ఒక కొత్త యాప్ లాక్ ఫీచర్ ని  తీసుకువస్తుంది - 
ఈ వాట్సాప్ ఫీచర్  ద్వారా వాట్సాప్ ని ఫింగర్ ప్రింట్ సెన్సార్ సహాయంతో యాప్ ని లాక్ మరియు ఆన్ లాక్ చేసుకోవచ్చు. 
 

WhatsApp for Android users can now choose to lock the app

ఆండ్రాయిడ్ కోసం ఫింగర్ ప్రింట్ లాక్‌ను విడుదల చేస్తున్నట్లు వాట్సాప్ గురువారం ప్రకటించింది.  ఫేస్బుక్ యాజమాన్యంలోని సంస్థ చివరకు ఆండ్రాయిడ్ యాప్ కి బయోమెట్రిక్ ప్రామాణీకరణను తీసుకువస్తోంది.

ఐఫోన్ వినియోగదారులు ఈ సంవత్సరం ఫిబ్రవరి నుండి టచ్ ఐడి (వేలిముద్ర గుర్తింపు) , ఫేస్ ఐడి (ముఖ గుర్తింపు)ఫీచర్ రెండింటినీ  పొందుతారు. ఆండ్రాయిడ్  వినియోగదారులు ఇప్పుడు ఆటోమేటిక్ గా  యాప్ లాక్‌  ఫీచర్ పొందుతారు అలాగే వారి వేలిముద్రతో మాత్రమే వాట్సాప్ అన్‌లాక్ చేయవచ్చు.

also read త్వరలో ఇండియాలోకి వాట్సాప్ పేమెంట్ అప్

ఆండ్రాయిడ్ కోసం వాట్సాప్ ఫింగర్ ప్రింట్ లాక్

ఐఫోన్ వినియోగదారుల కోసం ప్రారంభించిన టచ్ ఐడి ఫీచర్ మాదిరిగానే, ఆండ్రాయిడ్ వినియోగదారుల కోసం వాట్సాప్ ఇప్పుడు యాప్ లాక్ చేయడానికి ఎంచుకోవచ్చు - ఆ తర్వాత దాన్ని అన్‌లాక్ చేయడానికి వారి వేలిముద్రలతో చేసుకోవచ్చు.

WhatsApp for Android users can now choose to lock the app

యాప్ ఆటోమాటికల్ లాక్, ఆన్  లాక్  వెంటనే లేదా 1 నిమిషం తర్వాత, 30 నిమిషాల తర్వాత వినియోగదారులు సెట్ చేసుకోవచ్చు. సందేశం పంపినవారితో సహా నోటిఫికేషన్లలో వారి సందేశాల కంటెంట్ చూపించాలా వొద్దా అనేది వినియోగదారులు సెలెక్ట్ చేసుకోవచ్చు.

also read ట్విటర్‌ సంచలన నిర్ణయం...తెలిస్తే షాకవ్వాల్సిందే!


పైన అందించిన స్క్రీన్ షాట్ లో కంపెనీలో ఫీచర్స్ స్పష్టంగా కనిపిస్తాయి. ఆండ్రాయిడ్  కోసం వాట్సాప్ ఫింగర్ ప్రింట్ లాక్ ఆన్ చేయడానికి, వినియోగదారులు సెట్టింగులు> అకౌంట్ >ప్రైవసీ> ఫింగర్ ప్రింట్ లాక్ ను సెలెక్ట్ చేసుకోవాలి.

వారు అన్‌లాక్ విత్ ఫింగర్ ప్రింట్ ఎంపికను ప్రారంభించిన తర్వాత, వారి వేలిముద్రను యాప్ ఓపెన్ చేయడానికి అడుగుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆండ్రాయిడ్ వినియోగదారుల కోసం ఈ ఫీచర్ త్వరలో ప్రారంభమవుతుంది.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios