న్యూఢిల్లీ: మొబైల్ ఫోన్ రింగ్‌పై టెలికం ఆపరేటర్ల మధ్య వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో మొబైల్ ఫోన్‌‌కు చేసే ఇన్‌‌కమింగ్ కాల్స్‌‌ రింగ్ టైమ్ కనీసం 30 సెకన్లు ఉండాలని టెలికాం రెగ్యులేటరీ సంస్థ (ట్రాయ్) నిర్దేశించింది. ల్యాండ్‌‌లైన్స్‌‌కు చేసే కాల్స్‌‌కు 60 సెకన్లు ఉండాలని ట్రాయ్‌ పేర్కొంది. 

తద్వారా ఇన్‌కమింగ్ కాల్ రింగ్ విషయంలో ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తున్న టెలికం సంస్థలకు భారత టెలికం నియంత్రణ మండలి (ట్రాయ్) చెక్ పెట్టింది. ఇప్పటివరకు టెలికాం కంపెనీలు పోటాపోటీగా ఇన్ కమింగ్ కాల్ రింగ్ సమయాన్ని తగ్గించడమే ట్రాయ్‌ స్పష్టమైన గడువుతో కూడిన నిర్దేశకాలు జారీ చేయడానికి ముఖ్య కారణం. 

also read ఇక ఎయిర్‌టెల్ 3G సేవలు ఉండవ....?

వాస్తవానికి గతంలో ఇన్ కమింగ్ రింగ్ సమయానికి ఎలాంటి పరిమితి లేదు. ఎవరు కాల్ చేసినా 45 సెకన్లు రింగవుతూ ఉండేది. కాల్ లిఫ్ట్ చేయకపోతే 45 సెకండ్ల తర్వాత డిస్‌కనెక్ట్ అయ్యేది. మొదట ఇన్‌కమింగ్ కాల్ రింగ్ సమయాన్ని జియో 25 సెకన్లకు తగ్గించింది. 

ఎయిర్‌టెల్, వొడాఫోన్‌ కూడా అదేవిధంగా 25 సెకన్లకు తగ్గించాయి. దీంతో వినియోగదారులు ఫోన్ ఎత్తేలోపే లైన్ కట్ అవుతండడంతో పలు సమస్యలను ఎదుర్కొన్నారు. ఇకపై కాల్ ఎత్తకపోయినా లేదా రిజక్ట్ చేసినా ఇన్‌‌కమింగ్ వాయిస్ కాల్స్‌‌ అలర్ట్‌‌కు ఈ సమయాభావాన్ని తప్పనిసరిగా అమలు చేయాలని ఆపరేటర్లకు తెలిపింది. 

ట్రాయ్‌ తీసుకున్న తాజా నిర్ణయంతో టెలికాం సంస్థల మధ్య నెలకొన్న పోటీకి తెరపడినట్టే. మొబైల్ వినియోగదారుడు ఆన్సర్ చేసినా, చేయకున్నా 30 సెకన్ల పాటు సెల్యులార్ మొబైల్ టెలిఫోన్ సర్వీసులు, నిమిషం పాటు బేసిక్ టెలిఫోన్ సర్వీసులకు కల్పించాలని ట్రాయ్ తాజాగా విడుదల చేసిన నూతన మార్గదర్శకాల్లో వెల్లడించింది.

also read హైదరాబాద్: స్పై వెర్ దాడులతో వాట్సాప్ కు హాని

ఈ నూతన నిబంధనలు వచ్చే 15 రోజుల్లో అమల్లోకి రానున్నాయని ట్రాయ్ ఒక ప్రకటనలో తెలిపింది. ఇప్పటివరకు భారత్‌లో ఎలాంటి పరిమితులు లేకపోవడంతో టెలికం సంస్థలు ఇష్టమొచ్చినట్లు వ్యవహరిస్తున్నాయి. నిబంధనలకు విరుద్దంగా వ్యవహరించిన టెలికం సంస్థలపై ఇది వరకే ట్రాయ్ భారీగా జరిమానా విధించింది. ఈసారి గట్టి హెచ్చరికలు కూడా జారీ చేసింది. 

ఇన్‌కమింగ్ కాల్స్ రింగ్ సమయాన్ని టెలికం సంస్థలే తగ్గించుకున్నాయని, ఇతర నెట్‌వర్క్‌ల వినియోగదారులను ఆకట్టుకోవాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నాయని ట్రాయ్ ఆరోపించింది. ఈ నూతన మార్గ దర్శకాలకు లోబడి అన్ని నెట్‌వర్క్‌లో ఇన్‌కమింగ్ కాల్స్ రింగ్ సమయం 30 సెకన్లుగా ఉండనున్నది. మరోవైపు, లేపని కాల్ గురించి 90 సెకండ్ల తర్వాతే ఆయా కస్టమర్‌కు సంక్షిప్త సమాచార రూపంలో తెలపాలని సూచించింది.