ఒప్పో నుంచి మరో రెండు చౌకైనా 5జి స్మార్ట్ ఫోన్లు.. ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ ద్వారా అందుబాటులోకి..
ఒప్పో కంపెనీ తాజాగా రెండు కొత్త స్మార్ట్ ఫోన్లను ఇండియాలో లాంచ్ చేయనుంది. వీటిలో ఒకటి చౌకైనా 5జి స్మార్ట్ ఫోన్ కూడా ఉంది. ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ ద్వారా త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి.
చైనా స్మార్ట్ ఫోన్ బ్రాండ్ ఒప్పో ఈ నెలలో రెండు కొత్త స్మార్ట్‌ఫోన్‌లను భారత్‌లో విడుదల చేయబోతోంది. వీటిలో ఒప్పో ఎ74 5జి, ఏ54 ఉన్నాయి. ఈ రెండు స్మార్ట్ ఫోన్లను ఏప్రిల్ 19న, ఏప్రిల్ 20 న తీసుకురానున్నారు. ఒప్పో ఏ54 కోసం ఫ్లిప్‌కార్ట్ మైక్రోసైట్‌ను ప్రసారం చేయగా, ఒప్పో ఎ74 5జిని అమెజాన్‌లో లిస్ట్ చేశారు.
ఒప్పో ఎ74 5జి ధర
అమెజాన్ ఇండియా దాని వెబ్ సైట్లో ఒప్పో ఎ74 5జి పేజీని ప్రసారం చేసింది. అమెజాన్ పేజీలో ఫోన్ ముందు భాగం ఫోటో కూడా ఉంది. అమెజాన్ లిస్టింగ్ ప్రకారం ఒప్పో ఎ74 5జి లాంచ్ ఏప్రిల్ 20న మధ్యాహ్నం 12 గంటలకు ఉంటుంది.
ఒప్పో ఏ74 5జిని మొదట కంబోడియా, థాయ్‌లాండ్‌లో లాంచ్ చేశారు. అక్కడ దాని ధర 8,999 థాయ్ బట్ట్ అంటే ఇండియాలో 21,500 రూపాయలు. అలాగే భారతదేశంలో కూడా దాని ధర సుమారు రూ .20వేల కంటే తక్కువగా ఉంటుందని భావిస్తున్నారు. ఫోన్‌ను ఫ్లూయిడ్ బ్లాక్, ఫెంటాస్టిక్ పర్పుల్ కలర్‌లో కొనుగోలు చేయవచ్చు.
also read కొత్త ప్రాసెసర్‌తో రియల్‌మీ లేటెస్ట్ 5జి స్మార్ట్ ఫోన్.. లాంచ్ కి ముందే ఫీచర్స్ లీక్.. ...
ఒప్పో ఏ74 5జి స్పెసిఫికేషన్లు
లీక్ అయిన సమాచారం ప్రకారం, ఒప్పో ఏ74 5జి 90Hz రిఫ్రెష్ రేటుతో ఎల్‌సిడి డిస్ ప్లే, ఫుల్ హెచ్‌డి ప్లస్ ఏఎంఓఎల్‌ఈడి ఉంటుంది. దీని సైజ్ 6.5 అంగుళాలు అంతేకాకుండా స్నాప్‌డ్రాగన్ 480 ప్రాసెసర్, 6 జీబీ, 128 జీబీ స్టోరేజ్ అందించారు.
ఒప్పో ఏ74 5జిలో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది, దీని ప్రైమరీ లెన్స్ 48 మెగాపిక్సెల్స్, మిగతా రెండు లెన్సులు 2 మెగాపిక్సెల్స్. సెల్ఫీ కోసం దీనికి 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఇచ్చారు. ఒప్పో ఏ74 5జిలో 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, 5,000mAh బ్యాటరీని లభిస్తుంది.
ఒప్పో ఏ54 స్పెసిఫికేషన్లు
ఒప్పో ఏ54లో కూడా ఒప్పో ఏ74 5జి వంటి ఫీచర్స్ లభిస్తాయి. ఆండ్రాయిడ్ 10 ఆధారిత కలర్ ఓఎస్ 7.2, 720x1600 పిక్సెల్‌ల రిజల్యూషన్‌తో 6.51-అంగుళాల హెచ్‌డి ప్లస్ డిస్‌ప్లే లభిస్తుంది. ఈ ఫోన్‌లో మీడియాటెక్ హెలియో పి35 ప్రాసెసర్, 4 జిబి ఎల్‌పిడిడిఆర్ 4 ఎక్స్ ర్యామ్, 128 జిబి స్టోరేజ్ అందించారు. దీనికి బ్యాక్ కెమెరాలు 4 ఉంటాయి, ఇందులో ప్రైమరీ లెన్స్ 13 మెగాపిక్సెల్స్, సెల్ఫీ కోసం 16 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది.