ఒప్పో నుంచి బడ్జెట్ స్మార్ట్ ఫోన్... ఫీచర్లు అదిరిపోయాయి

First Published 14, Jul 2018, 12:03 PM IST
Oppo A3s With Dual Rear Cameras, 6.2-Inch Display, 4230mAh Battery Launched in India
Highlights

ఒప్పో ఏ3ఎస్ పేరిట బడ్జెట్ స్మార్ట్ ఫోన్ ని విడుదల చేసింది. ఈ ఫోన్ ధర రూ. 10,990గా నిర్ణయించినట్లు కంపెనీ వెల్లడించింది.
 

చైనాకి చెందిన ప్రముఖ ఎలెక్ట్రానిక్ వస్తువుల తయారీ సంస్థ ఒప్పో... భారత మార్కెట్లోకి మరో స్మార్ట్ ఫోన్ ని విడుదల చేసింది.  ఒప్పో ఏ3ఎస్ పేరిట బడ్జెట్ స్మార్ట్ ఫోన్ ని విడుదల చేసింది. ఈ ఫోన్ ధర రూ. 10,990గా నిర్ణయించినట్లు కంపెనీ వెల్లడించింది.

 జూలై 15వ తేదీ నుంచి ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, పేటీఎం ద్వారా ఒప్పో స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయవచ్చని కంపెనీ స్పష్టం చేసింది. డార్క్ పర్పుల్, రెడ్ కలర్ వేరియంట్లలో ఈ ఫోన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు సంస్థ పేర్కొంది. 

ఒప్పో ఏ3ఎస్ స్మార్ట్‌ఫోన్‌ ఫీచర్స్ ఇలా ఉన్నాయి.
 2జీబీ ర్యామ్, 16జీబీ స్టోరేజ్, 4230ఎంఏహెచ్ బ్యాటరీ, స్నాప్‌డ్రాగన్ 450 ఎస్‌వోసీ, ఫీచర్ సెల్ఫీ కెమెరా, 13 మెగాపిక్సెల్, 2 మెగాపిక్సెల్ డ్యూయల్ రియర్ కెమెరా సెటప్, ఫ్రంట్ 8 మెగాపిక్సెల్ ఏఐ కెమెరా, 6.2 అంగుళాల డిస్‌ప్లే, 88.8 శాతం స్ర్కీన్-టూ- బాడీ రేషియో, ఏఐ బ్యూటీ టెక్నాలజీ 2.0, ఆండ్రాయిడ్ 8.1, ఎల్‌ఈడీ ఫ్లాష్ లైట్, సెల్ఫీ కెమెరా, 8 మెగాపిక్సెల్ సెన్సార్ కెమెరా, మైక్రో ఎస్డీకార్డు, 4జీ వీవోఎల్టీఈ, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్, ఏ-జీపీఎస్, మైక్రో-యూఎస్బీ, 3.5ఎంఎం హెడ్‌ఫోన్ జాక్ సౌకర్యం ఈ ఫోన్‌కు ఉన్నట్లు కంపెనీ పేర్కొంది.

loader