ఇన్‌స్టాగ్రామ్ కొంతకాలంగా పోస్ట్‌లలోని ‘లైక్స్’ సంఖ్యను తొలగించాలని ఆలోచిస్తోంది- సోషల్ మీడియాను వినియోగదారులకు ఆరోగ్యకరమైన ప్రదేశంగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఫేస్‌బుక్ యాజమాన్యంలోని ఫ్లాట్ ఫామ్ వచ్చే వారం నుంచి అమెరికాలో ఇన్‌స్టాగ్రామ్ ఫోటోల పై లైక్స్ కనిపించకుండా చేయడానికి ప్రయత్నాలు మొదలుపెట్టనుంది.

ఇన్‌స్టాగ్రామ్ సీఈఓ, ఆడమ్ మొస్సేరి, వైర్డ్ 25 సమావేశంలో మాట్లాడుతూ "సోషల్ మీడియా సర్విస్ కొంతమంది వినియోగదారులపై వచ్చే వారం యుఎస్‌ లో టెస్టింగ్  విస్తరింపచేస్తామని చెప్పారు. కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, జపాన్, ఐర్లాండ్, ఇటలీ మరియు బ్రెజిల్‌లలో కొన్ని నెలల తర్వాత ఈ ఫీచర్ టెస్టింగ్ జరుగుతుందని చెప్పారు".

also read  యూట్యూబ్ డెస్క్‌టాప్ కొత్త ఫీచర్

 "మీ ఫాలోవర్స్ మీరు పంచుకునే ఫోటోలు, వీడియోలపై దృష్టి పెట్టాలి కానీ ఫోటోస్ కి ఎన్ని లైక్స్ వచ్చాయో అని కాదు" అని ఇన్‌స్టాగ్రామ్ తెలిపింది. ఈ లక్షణం యువత గురించి, ఇది ఇన్‌స్టాగ్రామ్‌ను నిరుత్సాహపరచదానికి కాదు.

ఫోటో లైక్స్ పైన ఉన్న పోటీని తక్కువగా చేయడం కోసం, ఇన్‌స్టాగ్రామ్ లో వారు ఇష్టపడే వ్యక్తులతో కనెక్ట్ అవ్వడం ఇంకా వారికి స్ఫూర్తినిచ్చే విషయాలపై దృష్టి పెట్టడానికి ఉపయోగపడాలి అని మోసేరి చెప్పారు.

 వచ్చే వారం యుఎస్‌లో ఈ టెస్టింగ్ ప్రారంభమయ్యేటప్పుడు  పరిమిత సంఖ్య వినియోగదారులపై జరుగుతుంది. టెస్టింగ్ కోసం ఎంపికైన  వినియోగదారుడి ఖాతా ఇది టెస్టింగ్ లో భాగమని తెలియజేసే నోటిఫికేషన్‌ను చూడాలి. ఫోటో లైక్స్ కౌంట్ బహిర్గతం చేయకుండా ఎవరైతే లైక్ చేశారో వారి “[వినియోగదారు పేరు] చూపిస్తుంది. 

aslo read  లింక్డ్ ఇన్ కొత్త ఫీచర్‌: ఫ్రెండ్లీ ఫ్రీలాన్సర్

ఇటీవలి సంవత్సరాల్లో, తప్పుడు సమాచారం వ్యాప్తి చేయడమే కాకుండా దానికి సాంకేతికంగా సహాయపడటం చేసినందుకు సోషల్ మీడియా సంస్థలు నిప్పులు చెరిగారు. సైకలాజికల్ సైన్స్ లో  ప్రచురించబడిన ఒక అధ్యయనం ప్రకారం, టీనేజర్లు వారి ఫోటోలలో ఏక్కువ సంఖ్యలో “లైక్స్” చూసినప్పుడు యాక్టివేట్ అయ్యే మెదడు సర్క్యూట్లు డబ్బులు గెలవడం వల్ల వచ్చే తీరు ద్వారా ప్రేరేపించబడతాయి. టీనేజర్స్ వారిపై ఎక్కువ "లైక్స్" ఉన్న చిత్రాల మీద క్లిక్ చేసే అవకాశం ఉందని అధ్యయనం కనుగొంది.

ఇంతకుముందు ఇన్‌స్టాగ్రామ్ వారు అనుసరించే వినియోగదారుల కార్యాచరణను చూడటానికి వినియోగదారులను అనుమతించే ‘ఆక్టివిటీ’ క్రింద ‘ఫాలోయింగ్’ టాబ్‌ను తీసివేసింది. ఈ లక్షణాన్ని చాలా మంది వినియోగదారులు ఇతరులు ఇష్టపడటం లేదా వ్యాఖ్యానించడం గురించి తెలుసుకోవడానికి ఉపయోగించారు.