Asianet News TeluguAsianet News Telugu

14 రోజుల బ్యాటరీ లైఫ్ తో హువావే వాచ్ జిటి 2

హువావే కంపెనీ ఇండియా వెబ్‌సైట్‌లో దీనిని విడుదలకి సిద్దంగా ఉంచారు. దీని రిజిస్ట్రేషన్లను అంచనా వేయడానికి ‘నోటిఫై మి’ అనే బటన్ ను ఇప్పుడు ప్రత్యక్షంగా వెబ్‌సైట్‌లో ఉంచారు.

huwawei launches its new teo model watches in india
Author
Hyderabad, First Published Nov 30, 2019, 3:22 PM IST

హువావే వాచ్ జిటి 2 ఇప్పుడు హువావే కంపెనీ ఇండియా వెబ్‌సైట్‌లో దీనిని విడుదలకి సిద్దంగా ఉంచారు. దీని రిజిస్ట్రేషన్లను అంచనా వేయడానికి ‘నోటిఫై మి’ అనే బటన్ ను ఇప్పుడు ప్రత్యక్షంగా వెబ్‌సైట్‌లో ఉంచారు. అమెజాన్ మరియు ఫ్లిప్‌కార్ట్‌లో స్మార్ట్‌వాచ్ ఆన్‌లైన్‌లో మాత్రమే లభిస్తుందని కంపెనీ ధృవీకరించింది.

కంపెనీ దీని విడుదల తేదీని ఇంకా వెల్లడించలేదు, కానీ ఇప్పుడు ‘నోటిఫై మి’అనే  బటన్ ప్రత్యక్షంగా కనిపిస్తూ  ఉంటుంది. హువావే వాచ్ జిటి 2 మొదట ఐరోపాలో సెప్టెంబర్‌  నెలలో ప్రారంభమైంది. దీని గొప్ప ప్రత్యేకత ఏంటి అంటే ఇది 14 రోజుల బ్యాటరీ లైఫ్ ఇవ్వగలదు అలాగే  హార్ట్ బీట్ ను ట్రాకింగ్ చేయగలదు.

also read హైదరాబాద్ లో అతిపెద్ద ఆపిల్ విక్రయ కేంద్రం...

హువావే వాచ్ జిటి 2 లాంచ్ అయిన ప్రతిసారి ఫ్లిప్‌కార్ట్ మరియు అమెజాన్‌లో ప్రత్యేకంగా లభిస్తుందని హువావే ధృవీకరించింది. దీని ధర మరియు అమ్మకం తేదీ మినహా అన్ని ఫీచర్లను వెల్లడించారు.వచ్చే నెలలో భారతదేశంలో కిరిన్ ఎ1 శక్తితో కూడిన డివైజెను విడుదల చేయాలనే ఆలోచనని కంపెనీ ఈ నెల ప్రారంభంలో వెల్లడించింది. దీనితో పాటు హువావే ఫ్రీబడ్స్ 3 నిజంగా వైర్‌లెస్ ఇయర్‌ఫోన్‌లను విడుదల చేయనున్నట్లు సూచించింది.

ఐరోపాలో హువావే వాచ్ జిటి 2 ను 46mm మరియు 42mm అనే రెండు వేరిఎంట్ లలో విడుదల చేశారు. 46mm ధర యూరో 249 (సుమారు రూ. 19,500), చిన్న హువావే వాచ్ జిటి 2  42mm ధర యూరో 229 (సుమారు రూ .17,900). భారతదేశంలో కూడా ఇదే ధర ఉంటుందని తెలిపింది.

 హువావే వాచ్ జిటి 2  ఫీచర్స్ మరియు స్పెసిఫికేషన్ల విషయానికొస్తే 46mm మోడల్ 1.39-అంగుళాల (454x454 పిక్సెల్స్) OLED డిస్‌ప్లేను కలిగి ఉంది. 42mm మోడల్ 1.2-అంగుళాల (390x390 పిక్సెల్) OLED డిస్ప్లేని కలిగి ఉంది. స్మార్ట్ వాచ్ కిరిన్ A1 SoC చేత శక్తినిస్తుంది అలాగే 5ATM నీటి ప్రూఫ్ తో వస్తుంది. కనెక్టివిటీ ఎంపికలలో బ్లూటూత్ v5.1, GPS కూడా ఉన్నాయి.

ఆప్టికల్ హార్ట్ బీట్ సెన్సార్లు, ఫిట్‌నెస్ ట్రాకింగ్, స్లీప్ ట్రాకింగ్, ఒత్తిడి సంబందించిన లక్షణాలను తెలియజేస్తుంది. స్మార్ట్ వాచ్ జిపిఎస్ మోడ్ ఆన్ చేసిన 30 గంటల బ్యాటరీ లైఫ్‌ను అందిస్తుందని పేర్కొంది. ఒక సాధారణ రోజులో  బ్యాటరీ లైఫ్ 2 వారాలు (46 mm) మరియు 1 వారం (42 mm) వరకు ఉంటుంది. మీరు స్మార్ట్ వాచ్‌లో 500 పాటలను స్టోర్ చేసుకోవచ్చు. మీ ఫోన్ నుండి  150 మీటర్ల దూరంలో ఉన్నంతవరకు మీ చెయ్యి నుండి కాల్స్ తీసుకోవడానికి ఇది అంతర్నిర్మిత మైక్ మరియు స్పీకర్‌తో వస్తుంది.

also read రెడ్‌మి కొత్త వెరియేంట్ ఫోన్...లాంచ్ ఎప్పుడంటే..


హువావే వాచ్ జిటి 2 లో సుమారు 15 వర్కౌట్ మోడ్‌లు ఉన్నాయి. గుండ్రటి డయల్ వాచ్ 3 డి గ్లాస్ సర్ఫేస్ అనుసంధానిస్తుంది మరియు ఇది కేవలం 9.4mm సన్నగా ఉంటుంది. ఇది వైవిధ్యమైన వాచ్ ఫేస్‌లతో వస్తుంది మరియు మంచి విశ్రాంతి కోసం ఆరు రకాల నిద్ర సమస్యలను నిర్ధారిస్తుంది.

ఇది దాని ట్రూ రిలాక్స్ ఫీచర్ తో ఒత్తిడిని కూడా కొలవగలదు. ఇతర ఫీచర్స్ లో SMS సందేశాలు, ఇమెయిల్, క్యాలెండర్ మరియు ఇతర సోషల్ మీడియా యాప్ ల నుండి నోటిఫికేషన్లు అందుకోగలరు. మీరు వెదర్, అలారం, టైమర్, స్టాప్‌వాచ్, ఫ్లాష్‌లైట్ మరియు ఫైండ్ మై ఫోన్ వంటి లక్షణాలను కూడా  కూడా ఉపయోగించవచ్చు.
 

Follow Us:
Download App:
  • android
  • ios