హైదరాబాద్: యాపిల్ ఫోన్లు, గాడ్జెట్స్ లను  విక్రయించే  ఆప్ట్రోనిక్స్, ఇండియాలో ప్రపంచంలోనే అతిపెద్ద ఆపిల్ ప్రీమియం రిసెల్లార్ (ఎపిఆర్) ఒకటి హైదరాబాద్‌లో ఏర్పాటు చేసింది. కొండపూర్‌లోని శరత్ క్యాపిటల్ సిటీ మాల్‌లో 12,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ సంస్థ తమ స్టోర్‌లో సరికొత్త ఉత్పత్తులు మరియు సేవలను అందించనుంది.

also read వినియోదారులకు షాకింగ్ న్యూస్...మొబైల్‌ చార్జీలకు ఇక రెక్కలు...

ఈ స్టోర్ బ్యాంక్ టై-అప్స్, అనేక రకాల యాక్సెసోరిస్ మరియు ‘క్లబ్ ఆప్ట్రోనిక్స్ సభ్యత్వం’ సేవలను అందిస్తుంది. సందర్శకులకు ఫోటోగ్రఫీ, ఫిల్మ్ మేకింగ్, మ్యూజిక్ క్రియేషన్, ఆర్ట్ మరియు డిజైన్ ఇతర విభాగాలలో వర్క్‌షాపులకు హాజరయ్యే అవకాశం కూడా ఇక్కడ కల్పించారు.


సుతీందర్ సింగ్ మరియు మేఘనా సింగ్ నేతృత్వంలో ఈ సంస్థ హైదరాబాద్ మరియు భారతదేశంలో చైన్ స్టోర్స్ లాగా దీనిని విస్తరిస్తోంది. కంపెనీ ఇటీవలే ఫీనిక్స్ ముంబైలో తన మొదటి ఫ్లాగ్‌షిప్ ఎపిఆర్ స్టోర్‌ను స్థాపించింది.ఆప్ట్రోనిక్స్ ఇండియా (ప్రీమియం లైఫ్ స్టైల్ & ఫ్యాషన్ ఇండియా) వ్యవస్థాపకుడు సుతీందర్ సింగ్ మాట్లాడుతూ “మేము ఆప్ట్రోనిక్స్ లో  ఆపిల్ ను ఎంతో ఇష్టపడుతున్నాము.

also read ఫ్లిప్‌కార్ట్ వినియోగదారులకు శుభవార్త...అదేంటంటే ?

మేము బ్రాండ్‌ను దాని నాణ్యతను  కాపాడుతాము. అందువల్ల అన్ని నగరాల్లోని మా వినియోగదారులందరికీ ఆపిల్ అందించే ఉత్తమమైన సేవలను అందించడానికి మేము ఎల్లప్పుడూ ప్రయత్నిస్తాము”.ఆప్ట్రానిక్స్ ఇండియా డైరెక్టర్ మేఘనా సింగ్ మాట్లాడుతూ "ఆపిల్ ఈ ఏడాది ఉత్పత్తులను విడుదల చేయబోతున్నట్లు తెలిపింది. ఆప్ట్రోనిక్స్ భారతదేశం అంతటా లైఫ్ స్టోర్ల కంటే పెద్దవిగా ఉంటాయి" అని అన్నారు.