Asianet News TeluguAsianet News Telugu

వాట్సాప్ ఓపెన్ చేయకుండా, టైప్ చేయకుండా మీ ఫ్రెండ్స్ కి ఎలా మెసేజ్ చేయాలో ఈ ట్రిక్ తెలుసుకోండి

  మీకు వాట్సాప్ గురించి చాలా ఫీచర్స్ తెలిసే ఉంటాయి. కాని వాట్సాప్ ఓపెన్ చేయకుండా మెసేజ్ ఎలా పంపించాలో  తెలిస్తే మీరు షాక్ అవుతారు.

how to send whatsapp message with google assistant know all steps
Author
Hyderabad, First Published Mar 19, 2021, 1:17 PM IST

వాట్సాప్  కొత్త ప్రైవసీ పాలసీ గురించి వినియోగదారులలో తీవ్రమైన గందరగోళం ఏర్పడింది. దీనికి వ్యతిరేకంగా చాలా మంది ప్రజలు వారి వాట్సాప్ అక్కౌంట్ ను కూడా తొలగించారు. అంతేకాకుండా చాలా మంది సిగ్నల్, టెలిగ్రామ్ వంటి ఇతర యాప్స్ వాడటం ప్రారంభించారు.

కానీ ఇప్పటికీ కొందరు వాట్సాప్‌ను ఉపయోగిస్తున్నారు. సిగ్నల్, టెలిగ్రామ్ వంటి యాప్స్ చాలా మంది ఫోన్‌లో ఉన్నప్పటికి ఇన్స్టంట్ మెసేజింగ్  మాత్రం వాట్సాప్ ద్వారా మాత్రమే జరుగుతోంది.

 మీకు వాట్సాప్ గురించి చాలా ఫీచర్స్ తెలిసే ఉంటాయి. కాని వాట్సాప్ ఓపెన్ చేయకుండా మెసేజ్ ఎలా పంపించాలో  తెలిస్తే మీరు షాక్ అవుతారు. వాట్సాప్ తెరవకుండా, టైప్ చేయకుండా మెసేజ్ ఎలా పంపాలో ఇక్కడ పూర్తిగా తెలుసుకోండి.

also read ఆపిల్ మొట్టమొదటి మినీ-ఎల్ఈడి మాక్‌బుక్ ఎయిర్.. వచ్చే ఏడాదిలో ఇండియన్ మార్కెట్లోకి.. ...

  • మొదట మీ అండ్రాయిడ్ ఫోన్‌ను అన్‌లాక్ చేసి, ఒక గూగుల్ అని చెప్పండి. 
  • ఇక్కడ గూగుల్ అసిస్టెంట్ ఓపెన్ అవుతుంది లేదంటే మాన్యువల్ గా  మీరు మొదట సెటప్ చేయాలి.
  • సెటప్ చేయడానికి మొదట ఫోన్ సెట్టింగులను ఓపెన్ చేసి గూగుల్ అసిస్టెంట్ కోసం సెర్చ్ చేయండి 
  • ఇక్కడ లాంచ్ గూగుల్ అసిస్టెంట్ ఆప్షన్ కి వెళ్లి దాన్ని యాక్టివేట్ చేయండి.
  • ఇప్పుడు ఒకే గూగుల్  ద్వారా లేదా ఫోన్‌లోని గూగుల్ అసిస్టెంట్ బటన్‌ను నొక్కడం ద్వారా లేదా హోమ్ బటన్‌ను నొక్కడం ద్వారా గూగుల్ అసిస్టెంట్‌ ఓపెన్ అవుతుంది
  • ఇప్పుడు సెండ్ వాట్సాప్ మెసేజ్ అని చెప్పండి.
  • దీని తరువాత, మెసేజ్ ఎవరికి పంపించాలో గూగుల్ మిమ్మల్ని అడుగుతుంది, అప్పుడు  మెసేజ్ ఎవరికి పంపించాలో పేరు చెప్పండి.
  • తరువాత మే మెసేజ్ టైప్ చేసి సెండ్ బటన్ పై నొక్కండి అంతే దీని తరువాత, మీ మెసేజ్ వెళ్లిపోతుంది.
     
Follow Us:
Download App:
  • android
  • ios