ఆపిల్ మొట్టమొదటి మినీ-ఎల్ఈడి మాక్‌బుక్ ఎయిర్.. వచ్చే ఏడాదిలో ఇండియన్ మార్కెట్లోకి..

ఆపిల్ మొట్టమొదటి మినీ-ఎల్ఈడి మాక్‌బుక్  ఎయిర్ 2022లో రావచ్చని  తాజాగా వెల్లడించింది.అనలిస్ట్ మింగ్-చి కుయో ఈ విషయాన్ని కొత్త రీసెర్చ్ నోట్‌లో పేర్కొన్నారు. 

apple first miniled macbook air may arrive in 2022 with new series models


అమెరికన్ టెక్నాలజి కంపెనీ ఆపిల్  పాపులర్ డివైజ్  మాక్‌బుక్ (ల్యాప్‌టాప్)ని  ప్రజలు ఎంతో ఇష్టపడతారు. ఆపిల్ మొట్టమొదటి మినీ-ఎల్ఈడి మాక్‌బుక్  ఎయిర్ 2022లో రావచ్చని  తాజాగా వెల్లడించింది.
 
అనలిస్ట్ మింగ్-చి కుయో ఈ విషయాన్ని కొత్త రీసెర్చ్ నోట్‌లో పేర్కొన్నారు. ఆపిల్ మ్యాక్‌బుక్ ఎయిర్‌ను 2022 లో మినీ-ఎల్‌ఈడీ డిస్‌ప్లే ప్యానల్‌తో పరిచయం చేస్తుంది. ప్రస్తుతం, మాక్‌బుక్ ఎల్‌సిడి డిస్‌ప్లేతో వస్తుంది అని అన్నారు.

దీని గురించి మార్కెట్ లో వార్తలు  వేడి వేడిగా వినిపిస్తున్నాయి. ఐప్యాడ్ ప్రో మినీ ఎల్‌ఈడీ డిస్‌ప్లే 12.9 అంగుళాలతో రావచ్చని సమాచారం. కొత్త నివేదిక ప్రకారం, ఆపిల్ వచ్చే నెలలో  12.9-అంగుళాల ఐప్యాడ్ కాకుండా కొత్త సిరీస్ ఐప్యాడ్ లను కూడా విడుదల చేసే అవకాశం ఉంది.

also read ఇండియాలోకి టిక్‌టాక్ లాంటి మరో షార్ట్ వీడియో యాప్ వచ్చేసింది.. ఫేస్ బుక్, ఇస్టాగ్రామ్ కి పోటీగా లాంచ...

ఎల్‌ఈ‌డి డిస్ ప్లే  ప్రయోజనాలు
ఇలాంటి డివైజెస్ లో ఎల్‌ఈ‌డి డిస్ ప్లేతో వస్తే ఖచ్చితంగా కొన్ని ప్రయోజనాలు ఉంటాయి. ఎల్‌ఈడీ డిస్ ప్లేలో ఏదైనా  చూసినప్పుడు కలర్ బ్రైట్ నెస్, అధిక నాణ్యత గల వీడియోలను చూడటం భిన్నంగా ఉంటాయి. ప్రత్యేక విషయం ఏమిటంటే  ఎల్‌ఈ‌డి ద్వారా పవర్ కూడా చాలా సేవ్ అవుతుంది. అంతేకాకుండా మాక్‌బుక్  బ్యాటరీ లైఫ్ కూడా గణనీయంగా పెరుగుతుంది. 

కొంతమంది విశ్లేషకులు ఓ‌ఎల్‌ఈ‌డి ప్రోడక్టివిటీ  టూల్స్ తగినది కాదని భావిస్తున్నారు. అలాగే మినీ-ఎల్ఈడి, ఆపిల్ ప్రాసెసర్లు (ఆపిల్ సిలికాన్, ఐప్యాడ్ ప్రాసెసర్లు) కంపెనీ ప్రోడక్టివిటీ  డివైజెస్ కోసం రెండు ముఖ్యమైన హార్డ్ వేర్ టెక్నాలజి అని మేము నమ్ముతున్నాము అని తెలిపారు.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios