Asianet News TeluguAsianet News Telugu

స్మార్ట్​ఫోన్​కు రక్షణ కల్పించే యూఎస్బీ కండోమ్​ గురించి తెలుసా?

ప్రస్తుతం స్మార్ట్​ఫోన్ల వినియోగం భారీగా పెరిగింది. ఈ నేపథ్యంలో సైబర్​ నేరగాళ్లు స్మార్ట్​ఫోన్లను లక్ష్యంగా చేసుకుని ఛార్జింగ్ పాయింట్లతో యూజర్ల విలువైన సమాచారాన్ని దొంగిలిస్తున్నారు. వీటి నివారణకు మార్కెట్లో యూఎస్​బీ కండోమ్స్ అనే పరికరాలు అందుబాటులో ఉన్నాయి. అవి ఎలా పని చేస్తాయో పరిశీలిద్దాం..

How do I protect my online privacy from 'surveillance capitalism'?
Author
Hyderabad, First Published Dec 11, 2019, 11:59 AM IST

న్యూఢిల్లీ: మీ స్మార్ట్​ఫోన్​కు రక్షణనిచ్చే కండోమ్‌లు​ అందుబాటులోకి వచ్చాయి. ఇంతకీ స్మార్ట్​ ఫోన్​కు రక్షణగా కండోమ్ ఏంటనుకుంటున్నారా? దీని గురించి తెలుసుకుందాం.. రోజురోజుకు టెక్నాలజీ పెరుగుతున్నట్లే మోసాలు చేసే వారూ పెరుగుతున్నారు.

ముఖ్యంగా అజ్ఞాత ప్రదేశాల్లో స్మార్ట్​ ఫోన్​ ఛార్జింగ్​ పెట్టడం వల్ల ఈ మోసాలు ఎక్కువగా జరుగుతున్నాయి. వీటిని అరికట్టేందుకు తీసుకు వచ్చిందే 'యూఎస్బీ కండోమ్'​. దీన్నే 'డేటా బ్లాకర్​' అని.. అధికారికంగా 'పోర్టాపావ్​' మూడోతరం యూఎస్​బీ డేటా బ్లాకర్ అని కూడా పిలుస్తారు. ప్రస్తుతం స్మార్ట్​ఫోన్లకు ఛార్జింగ్ అనేది పెద్ద తల నొప్పిగా మారింది. ఇంట్లో ఉన్నప్పుడు ఇది పెద్ద సమస్య కాకున్నా ప్రయాణాల సమయంలో చాలా ఇబ్బందిగా ఉంటుంది. 

also read  సిమ్ కార్డ్ లేకున్నా కాల్స్ చేసుకోవచ్చు...ఎలా అంటే ?

ఇందుకోసం పవర్​ బ్యాంక్​లు ఉన్నా.. ఒకటి రెండు సార్లకన్నా ఎక్కువగా ఫోన్​ను ఛార్జింగ్​ చేయలేం. అలా ప్రయాణ సమయాల్లో ఉన్నప్పుడు రైల్వే స్టేషన్లలో, బస్టాండ్లలో ఎక్కడపడితే అక్కడ ఛార్జింగ్ పెట్టుకుంటారు చాలా మంది. అయితే అక్కడ ఛార్జింగ్ పెట్టుకోవడం ఎంత సురక్షితమని చాలా మంది అలోచించరు. 

How do I protect my online privacy from 'surveillance capitalism'?

ఇలాంటి ఛార్జింగ్​ స్పాట్​లను లక్ష్యంగా చేసుకుని స్కామర్లు చాలా మంది స్మార్ట్​ఫోన్​ యూజర్ల డేటాను చోరీ చేస్తున్నారు. అదేలా అంటే స్మార్ట్​ ఫోన్​ను ఆయా ఛార్జింగ్​ పాయింట్ల దగ్గర ఛార్జ్ చేసేందుకు కేబుల్ ద్వారా కనెక్ట్​ చేసినప్పుడు నేరుగా ఆ ఫోన్ల డేటా స్కామర్ల చేతికి వెళ్తోంది. దీని ద్వారా ఆనేక మోసాలు జరుగుతున్నాయి.

also read పాత కంప్యూటర్లు వాడుతున్నారా...మైక్రోసాఫ్ట్ సర్వేలో సంచలన విషయాలు...

కొత్త ప్రదేశాల్లో నేరుగా ఏదైన ఛార్జింగ్​ పోర్ట్​కు అనుసంధానం చేయాల్సి వచ్చినప్పుడు మీ డేటా.. చోరీకి గురవ్వకుండా ఉండేందుకు ఈ డేటా బ్లాకర్ అనే పరికరం ఉపయోగపడుతుంది.ఫోన్​ ఛార్జింగ్ పెట్టెడప్పుడు..ఛార్జర్​కు అనుసంధానం చేసే చివర ఈ డేటా బ్లాకర్​ పరికరాన్ని ప్లగ్​ ఇన్​ చేయాలి. దానికి యూఎస్​బీ కేబుల్​ను అనుసంధానం చేసి ఫోన్​ ఛార్జింగ్ చేసుకోవాలి. ఇది మీ ఫోన్​లో ఉన్న డేటా కేబుల్​ ద్వారా ట్రాన్స్​ఫర్​ కాకుండా చూస్తుంది. 

దీంతో మీ స్మార్ట్​ఫోన్ ఛార్జింగ్ ఎక్కడ పెట్టినా.. డేటా సురక్షితంగా ఉంటుంది. ప్రస్తుతం మార్కెట్లో యూఎస్​బీ కండోమ్​ ధర దాదాపు రూ.500గా ఉంది. అయితే యూఎస్బీ-సీ డివైజ్​లకు ఈ డేటా బ్లాకర్​ పని చేయదు. త్వరలోనే టైప్​-సీ పోర్ట్​కు సరిపోయే యూఎస్​బీ కండోమ్ మార్కెట్లోకి రానుంది.
 

Follow Us:
Download App:
  • android
  • ios