Asianet News TeluguAsianet News Telugu

సిమ్ కార్డ్ లేకున్నా కాల్స్ చేసుకోవచ్చు...ఎలా అంటే ?

ఎయిర్‌టెల్ వై-ఫై కాలింగ్ ఎయిర్‌టెల్ కస్టమర్లకు సాధారణ వాయిస్ కాల్ లాగానే ఎయిర్‌టెల్ వై-ఫై నెట్‌వర్క్ ద్వారా కాల్స్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఎయిర్‌టెల్ వై-ఫై కాలింగ్‌కు కొత్త సిమ్ అవసరం లేదు మరియు రోమింగ్ సమయంలో కూడా పనిచేస్తుంది.

airtel has now launched new wifi calling system in delhi ncr
Author
Hyderabad, First Published Dec 10, 2019, 6:27 PM IST

ఎయిర్‌టెల్ ఇప్పుడు కొత్త  వై-ఫై కాలింగ్ సర్విస్ ను ప్రారంభించింది. భారతదేశంలో దీనిని ప్రవేశపెట్టిన మొట్టమొదటి టెలికం ఆపరేటర్‌గా ఎయిర్‌టెల్ నిలిచింది. ఎయిర్‌టెల్ వై-ఫై కాలింగ్ ఎయిర్‌టెల్ కస్టమర్లకు సాధారణ వాయిస్ కాల్ లాగానే ఎయిర్‌టెల్ వై-ఫై నెట్‌వర్క్ ద్వారా కాల్స్ చేయడానికి ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ఎయిర్‌టెల్ వై-ఫై కాలింగ్‌కు ప్రత్యేకమైన యాప్ లాంటివి అవసరం లేదు. వై-ఫై కాలింగ్ ఆప్షన్ ద్వారా అన్ని అనుకూల ఫోన్‌లలో దీనిని ఉపయోగించుకోవచ్చు. 

also read  రెడ్‌మి నుండి రెండు కొత్త వేరిఎంట్ స్మార్ట్ ఫోన్స్ విడుదల


ఎయిర్‌టెల్ వై-ఫై కాలింగ్ ప్రస్తుతం ఢిల్లీ ఎన్‌సిఆర్‌లోని ఎయిర్‌టెల్ కస్టమర్లకు అందుబాటులో ఉంది. ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ఫైబర్ హోమ్ బ్రాడ్‌బ్యాండ్‌ ద్వారా ఈ కాలింగ్ సౌకర్యం అందుబాటులోకి రానుంది. ఇది అన్ని బ్రాడ్‌బ్యాండ్ సేవలకు, హాట్‌స్పాట్‌లకు, స్మార్ట్‌ఫోన్ లకు కూడా సపోర్ట్ చేసేలా ఇతర సంస్థలతో కలిసి పనిచేస్తున్నట్లు ఎయిర్‌టెల్ తెలిపింది.

ప్రస్తుతం, ఈ క్రింది ఫోన్‌లు మాత్రమే ఎయిర్‌టెల్  కొత్త సర్విస్ కు సపోర్ట్ చేస్తాయి.

ఆపిల్: ఐఫోన్ ఎక్స్‌ఆర్, ఐఫోన్ 6 ఎస్, ఐఫోన్ 6 ఎస్ ప్లస్, ఐఫోన్ 7, ఐఫోన్ 7 ప్లస్, ఐఫోన్ ఎస్‌ఇ, ఐఫోన్ 8, ఐఫోన్ 8 ప్లస్, ఐఫోన్ ఎక్స్, ఐఫోన్ ఎక్స్‌ఎస్, ఐఫోన్ ఎక్స్‌ఎస్ మాక్స్, ఐఫోన్ 11, ఐఫోన్ 11 ప్రో

వన్‌ప్లస్: వన్‌ప్లస్ 7, వన్‌ప్లస్ 7 ప్రో, వన్‌ప్లస్ 7 టి, వన్‌ప్లస్ 7 టి ప్రో

శామ్‌సంగ్: శామ్‌సంగ్ గెలాక్సీ జె 6, శామ్‌సంగ్ గెలాక్సీ ఆన్ 6, శామ్‌సంగ్ గెలాక్సీ ఎం 30 లు, శామ్‌సంగ్ గెలాక్సీ ఎ 10 ఎస్

షియోమి: పోకో ఎఫ్ 2, రెడ్‌మి కె 20, రెడ్‌మి కె 20 ప్రో


వినియోగదారులు తమ ఫోన్‌లో వై-ఫై కాలింగ్ ఫీచర్‌ను ఎనేబుల్ చేసి ఎయిర్‌టెల్ వై-ఫై కాలింగ్ ప్రారంభించడానికి సరికొత్త సాఫ్ట్‌వేర్ బిల్డ్‌కు అప్‌గ్రేడ్ చేయాలి. అంతేకాకుండా ఉత్తమ ఫలితాల కోసం వినియోగదారులు VoLTE ని ఆన్ చేయాలని సూచించారు. 5 నిమిషాల వై-ఫై కాల్ మాట్లాడితే 5MB కన్నా తక్కువ డేటాను వినియోగిస్తుంది. ఒకవేళ Wi-Fi నెట్‌వర్క్ ఆఫ్ చేస్తే  Wi-Fi కాల్ ఆటోమేటిక్ గా VoLTEకి మారుతుంది.

also read పాత కంప్యూటర్లు వాడుతున్నారా...మైక్రోసాఫ్ట్ సర్వేలో సంచలన విషయాలు...


ఎయిర్‌టెల్ వై-ఫై కాలింగ్  ప్రయోజనాల

 వినియోగదారులు ఎయిర్‌టెల్ వై-ఫై కాలింగ్ కోసం కొత్త సిమ్ కొనుగోలు చేయాల్సిన అవసరం లేదని కేవలం ఎయిర్‌టెల్ వై-ఫై నెట్‌వర్క్ ఉంటే చాలు ఆ ప్రదేశం నుండి కాల్స్ చేయవచ్చు మెసేజ్లను పంపవచ్చు. అలాగే కొత్త వై-ఫై ఆధారిత కాలింగ్ సర్విస్ VoLTE తో పోలిస్తే మెరుగైన కాల్ సెటప్ వాయిస్ క్లారీటి అందిస్తుందని పేర్కొంది. వినియోగదారులు ఇందుకోసం కొత్త రీఛార్జి ప్లాన్‌ లాంటివి ఎంచుకోవాల్సిన పని లేదు. ఎయిర్‌టెల్ వై-ఫై కాలింగ్ సర్విస్ ఉపయోగించడం కోసం అదనపు చెల్లింపులు  కూడా అవసరం లేదు. 

ఎయిర్‌టెల్ వై-ఫై కాల్ సాధారణ కాల్ లాగానే ఇతర (2G / 3G / 4G / VoLTE / Wi-Fi) నెట్‌వర్క్‌లకు  చేయవచ్చు. ఒకే తేడా ఏమిటంటే, కాల్ స్క్రీన్‌లో వై-ఫై కాల్ కోసం వై-ఫై కాల్‌కు ప్రత్యేకమైన సింబల్ ఉంటుంది. ఎయిర్‌టెల్  కస్టమర్లు రోమింగ్ సమయంలో కూడా వై-ఫై కాల్స్ చేయవచ్చు, కాని ఇంటెర్నేషనల్ కాలింగ్ మాత్రం చేసుకోలేరు.
 

Follow Us:
Download App:
  • android
  • ios