న్యూఢిల్లీ: వార్షిక ముగింపు సేల్‌తో ఫ్లిప్‌కార్ట్ వచ్చేసింది. శనివారం ప్రారంభమైన ఈ సేల్ 23వ తేదీతో ముగియనుంది. ఇందులో భాగంగా ఐఫోన్ 7, రెడ్‌మీ నోట్ 7 ప్రొ, రెడ్‌మీ8, రియల్‌మీ 5ప్రొ, వివో జడ్ 1 ప్రొతోపాటు మరిన్ని మొబైల్స్‌పై భారీ రాయితీలు ప్రకటించింది.

also read  2019లో అత్యంత యువ సంపన్నులు ఎవరో తెలుసా...

ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్, ఈఎంఐ లావాదేవీలపై 10 శాతం తక్షణ రాయితీ ప్రకటించింది. నో-కాస్ట్ ఈఎంఐలు ఆప్షన్, ఎక్స్చేంజ్ డిస్కౌంట్లు ఉన్నాయి. ఎలక్ట్రానిక్ వస్తువులపై 75 శాతం రాయితీ ప్రకటించింది. ల్యాప్‌టాప్‌లను రూ.19,999కు లిస్ట్ చేయగా, రియల్‌మీ 5 ప్రొను రూ.11,999, రియల్‌మీ 8 ఫోన్ రూ.8,999కి ఫ్లిప్‌కార్ట్ లిస్ట్ చేసింది.
 
రెడ్‌మీ నోట్7 ప్రొ 4 జీబీ ర్యామ్ విత్ 64 జీబీ స్టోరేజీ వేరియంట్‌ను రూ.9,999కే అందుబాటులోకి తెచ్చింది. అంటే ఏకంగా రూ.4 వేల రాయితీ లభిస్తుందన్నమాట. రియల్‌మీ 5 ప్రొ 4జీబీ ర్యామ్ విత్ 64 జీబీ వేరియంట్‌పై రూ.2 వేలు తగ్గించి రూ.11,999కే అందిస్తోంది. 6జీబీ ర్యామ్ విత్ 64 జీబీ వేరియంట్‌ను రూ.12,999కి, 8జీబీ ర్యామ్ విత్ 128 జీబీ వేరియంట్‌ను రూ.14,999లకు వినియోగదారులకు అందజేస్తోంది. 

రెడ్‌ మీ 8 4 జీబీ ర్యామ్ ఆప్షన్‌ ఫోన్ రూ.7,999, వివో జడ్1 ప్రొ ఫోన్ 4 జీబీ ర్యామ్ విత్ 64 జీబీ స్టోరేజీ వేరియంట్‌ రూ.12,990, 6 జీబీ ర్యామ్ విత్ 64 జీబీ వేరియంట్‌ను రూ.13,990లకు లిస్ట్ చేసింది. ముందస్తు నగదు చెల్లింపులు చేస్తే అదనంగా ఫ్లిప్ కార్ట్ రూ.1000 రాయితీ అందించనున్నది.

ఇంకా రెడ్‌మీ కే 20 4జీబీ విత్ 128 జీబీ వేరియంట్‌పై రూ. 4 వేలు, 8జీబీ విత్ 128 జీబీ ఆప్షన్‌పై రూ.1000 రాయితీ ప్రకటించింది. ఐఫోన్ 8ను రూ.33,999, పిక్సెల్ 3ఎ ఎక్స్ఎల్‌ను రూ.30,999, శాంసంగ్ గెలాక్సీ ఎస్9ప్లస్‌ను రూ.29,999, ఐఫోన్ ఎక్స్ఎస్ 64జీబీని రూ.59,990కి అందుబాటులో ఉంచింది.

also read కొత్త ప్లాన్లు, ఆఫర్లతో ఆకట్టుకుంటున్న టెలికాం నెట్‌వర్క్‌లు !

వీటితోపాటు ఎలక్ట్రానిక్స్‌పై 75 శాతం రాయితీ ప్రకటించింది. ల్యాప్‌టాప్‌లు, యాపిల్ వాచ్‌లు, స్పోర్ట్స్ కెమెరాలు, పవర్ బ్యాంకులు వంటివాటిపైనా భారీ రాయితీలు ఆఫర్ చేస్తోంది. హెచ్పీ 15 క్యూ ఏపీయూ విత్ 4జీబీ ర్యామ్ విత్ ఒక టీబీ హెచ్డీడీ, విండోస్ 10 ప్లస్ హోం ఓఎస్ గల డ్యుయల్ కోర్ ఏ9 లాప్ టాప్ రూ.19,999, అసుస్ రోగ్ గేమింగ్ లాప్ టాప్ రూ.57,999 నుంచి ప్రారంభమవుతుంది. 

8జీబీ రామ్ విత్ 512 జీబీ ఎస్సెడీ, విండోస్ 10 ఓఎస్ ఎసెర్ స్విఫ్ట్ 3 కోర్ ఐ5 ఎనిమిదో తరం లాప్ టాప్ రూ.44,990, ఆపిల్ మాక్ బుక్ ఎయిర్ కోర్ ఐ5 ఫిఫ్ట్ జనరేషన్ లాప్ టాప్ రూ.54,990లకు లభిస్తుంది. 

ఆపిల్ వాచ్ సిరీస్ 3 అతి తక్కువ ధరకు రూ.17,999లకు లభిస్తుంది. 32 జీబీ విత్ 9.7 అంగుళాల ఆపిల్ ఐ పాడ్ (ఆరవ జనరేషన్) రూ.22,999లకు అందుబాటులో ఉంది. హెచ్డీఎఫ్సీ కార్డుపై రూ.3000 డిస్కౌంట్ లభిస్తుంది. పవర్ బ్యాంక్స్ రూ.299 నుంచి మొబైల్ కవర్స్ రూ.149 నుంచి మొదలవుతాయి.