న్యూఢిల్లీ: ఆన్‌లైన్‌ మార్కెట్‌లో ఆఫర్ల పండుగ వచ్చేసింది. ఆదివారం నుంచి నాలుగు రోజులు ఇటు అమెజాన్‌ గ్రేట్‌ ఇండియన్‌ సేల్‌ 2020, అటు ఫ్లిప్‌కార్ట్‌ రిపబ్లిక్‌ డే సేల్‌ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. ఈ ఆఫర్లు 19వ తేదీన ప్రారంభమై 22వ తేదీ వరకు కొనసాగనున్నాయి. 

ఈ ఏడాది రెండు ఈ-కామర్స్‌ దిగ్గజాలు ఒకే తేదీల్లో స్పెషల్‌ సేల్స్‌కు దిగడంతో కస్టమర్లపై ఆఫర్ల వర్షం కురవనున్నది. ఇక ఆన్‌లైన్‌లో అత్యధికంగా అమ్ముడయ్యేవి స్మార్ట్‌ఫోన్లే కావడంతో వివిధ రకాల మధ్య, ఎగువ శ్రేణి మొబైల్స్‌పై పెద్ద ఎత్తున ధరల తగ్గింపు కనిపిస్తున్నది.

Also read:అమెజాన్ లో స్మార్ట్ ఫోన్లపై భారీ ఆఫర్లు, డిస్కౌంట్లు...కొద్దిరోజులు మాత్రమే...

మధ్య శ్రేణి స్మార్ట్‌ఫోన్లపై అమెజాన్‌లోడిస్కౌంట్లతోపాటు ఇప్పుడున్న పాత ఫోన్లను మార్చుకుని కొత్త ఫోన్లను తీసుకునే అవకాశం కస్టమర్లకు లభిస్తున్నది. ఒప్పో రెనో 2ఎఫ్‌, హువావే వై9 ప్రైం వంటి మధ్య శ్రేణి స్మార్ట్‌ఫోన్ల ధరల్ని తగ్గించింది. ఒప్పో ఫోన్‌ రూ.23,990 కి లభించనున్నది. దీని మార్కెట్‌ ధర రూ. 32,990. 

also read మరో ఐదేళ్లలో పది లక్షల ఉద్యోగాలు...

 హువావే మొబైల్‌ ధర రూ. 15,990గా ఉన్నది. మార్కెట్‌ ధర రూ.19,990. రెడ్‌మీ కే20 కూడా రూ.24,999లకే దొరుకుతుం ది. అసలు ధర రూ.28,999. సామ్‌సంగ్‌ గెలాక్సీ ఏ50 రూ.19,999, వివో ఎస్‌1 రూ. 15,990 లకు అందుబాటులో ఉంటాయి. కాగా, అమెజాన్‌ గ్రేట్‌ ఇండియన్‌ సేల్‌ 2020 ఇప్పటికే సంస్థ ప్రైం సభ్యులకు మొదలైంది. రెగ్యులర్‌ కస్టమర్లకు ఆదివారం నుంచి అందుబాటులో ఉంటుంది.

ఇక రెడ్‌మీ కే20 ప్రో 256జీబీ మొబైల్‌ ఫ్లిప్‌కార్ట్‌లో రూ.22,999కే లభిస్తుంది. దీని మార్కెట్‌ ధర రూ.28,999. అలాగే ఒప్పో ఎఫ్‌11 ప్రో 64జీబీ మొబైల్‌ రాయితీపై రూ.14,990కే అందుకోవచ్చు. దీని అసలు ధర రూ.28,990. ఇక 32జీబీ ఐఫోన్‌ 7 ప్లస్‌ రూ.33.999లకే కొనేయొచ్చు. మార్కెట్‌ ధర రూ.37,990లుగా ఉన్నది. 64జీబీ ఐఫోన్‌ 8 మోడల్‌ డిస్కౌంట్‌లో రూ.34,999 లుగానే ఉన్నది. అసలు ధర రూ.39,900.

ఎగువ శ్రేణి స్మార్ట్‌ఫోన్లపై ఎల్‌జీ జీ8, ఒప్పో రెనో 10ఎక్స్‌ జూమ్‌ వంటి ప్రీమియం స్మార్ట్‌ఫోన్లపై భారీ రాయితీలు, ఎక్సేంజ్‌ ఆఫర్లను అమెజాన్‌ అందిస్తున్నది. ఎల్‌జీ జీ8 రూ.35,990కే లభిస్తుంది. దీని అసలు ధర రూ.48,990లుగా ఉన్నది. 

ఒప్పో రెనో 10ఎక్స్‌ జూమ్‌ రూ.33,990కే అందుకోవచ్చు. మార్కెట్‌ ధర రూ.55,990. ఇక సామ్‌సంగ్‌ గెలాక్సీ నోట్‌9 ధర కేవలం రూ. 41,990. దీని మార్కెట్‌ ధర రూ.73,600 కావడం గమనార్హం. అలాగే ఐఫోన్‌ 11 64జీబీ ప్రారంభ ధర రూ.64,899గా ఉన్నది. రాయితీపై ఐఫోన్‌ ఎక్స్‌ఆర్‌ రూ.42,900లకు పొందవచ్చు. అసలు ధర రూ.49,900.

గూగుల్‌ పిక్సల్‌ 3ఏ, 3ఏ ఎక్స్‌ఎల్‌, శామ్‌సంగ్‌ గెలాక్సీ ఎస్‌9 వంటి ప్రతిష్ఠాత్మక స్మార్ట్‌ఫోన్లపై ఫ్లిప్‌కార్ట్‌ భారీ డిస్కౌంట్లను ప్రకటించింది. 3ఏ, 3ఏ ఎక్స్‌ఎల్‌ మొబైల్స్‌ ధర రూ.27,999 మాత్రమే. వీటి మార్కెట్‌ ధర రూ.39,999గా ఉన్నది. గెలాక్సీ ఎస్‌9 రూ. 22,999కే లభ్యం కానున్నది. దీనిపై ఏకంగా 60 శాతం డిస్కౌంట్‌ ఉండటం గమనార్హం. 

మార్కెట్‌లో ఈ మొబైల్‌ అసలు ధర రూ.62,500. గెలాక్సీ ఎస్‌9 ప్లస్‌ రూ.27,999లకే లభించనున్నది. అసలు ధర రూ.70 వేలు. షియామీ బ్లాక్‌ షార్క్‌2 64జీబీ మోడల్‌ కూడా రూ.29,999లకే లభించనున్నది. దీని మార్కెట్‌ ధర రూ.45,999. ఇందులో 256జీబీ రకం రూ.39,999లుగా ఉంది. మార్కెట్‌ ధర రూ.59,999.