ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ స్మార్ట్ ఫోన్లపై భారీ ఆఫర్లను ప్రకటించింది. ఈ ఆఫర్ లో భాగంగా వన్ ప్లస్ స్మార్ట్ ఫోన్, టీవీ కొనుగోలు చేసిన వినియోగదారులకు  రూ.6వేల క్యాష్ బ్యాక్, అడిషనల్ గా ఎక్సేంజ్ తో పాటు రూ.3 వేల డిస్కౌంట్ ను అందించేలా బంపర్ ఆఫర్ ప్రకటించింది.

ఈ ఏడాది తొలి అమెజాన్ గ్రేట్ ఇండియన్ సేల్ 2020లో భాగంగా ఈ ఆఫర్లను అందిస్తున్నట్లు చైనా స్మార్ట్ ఫోన్  సంస్థ వన్ ప్లస్ తెలిపింది. ఈ ఆఫర్లను ఆన్ లైన్ లో వన్ ప్లస్  స్టోర్, అమెజాన్ ఇండియా, ఆఫ్ లైన్ లో వన్ ప్లస్ స్టోర్ లో పొందవచ్చు. ఈ ఆఫర్ ను నేటి(జనవరి 18) నుంచి అందుబాటులో తెస్తున్నట్లు తెలిపిన సంస్థ..క్యాష్ బ్యాక్, 3వేల  అడిషనల్ ఎక్సేంజ్ డిస్కౌంట్, ఆఫర్ల తో పాటు నోకాస్ట్ ఈఎంఐ ఆప్షన్ ద్వారా జనవరి 26వరకు ఈ ఆఫర్లను సొంతం చేసుకోవచ్చని సూచించింది.

also read మరో ఐదేళ్లలో పది లక్షల ఉద్యోగాలు...

అమెజాన్ ప్రైమ్ మెంబర్స్ కు ఈ ఆఫర్ జనవరి 18,శనివారం సాయంత్రం 8గంటల నుంచి అందుబాటులో ఉండగా...సాధారణంగా కొనుగోలు చేసే వినియోగదారులకు జనవరి 18 ఆదివారం నుంచి అందుబాటులోకి రానుంది.  
   


 వన్ ప్లస్ స్మార్ట్ ఫోన్లపై  ఆఫర్లు

వన్ ప్లస్ 7 ప్రో, వన్ ప్లస్ 7టీ, వన్ ప్లస్ 7టీ ప్రో స్మార్ట్ ఫోన్లను ఎస్ బీఐ బ్యాంక్ ద్వారా కొనుగోలు చేసిన వినియోగదారులకు రూ.3వేల డిస్కౌంట్ తో పాటు సంవత్సరం పాటు నో కాస్ట్ ఈఎంఐ అందిస్తున్నట్లు వన్ ప్లస్ సంస్థ తెలిపింది. అమెజాన్ నుండి ఎస్ బీఐ క్రెడిట్ కార్డ్ ద్వారా కొనుగోలు చేసిన వినియోగదారులకు రూ.15వందల డిస్కౌంట్ తో  పాటు వన్ ప్లస్ 7ప్రోను కొనుగోలు చేసిన కష్టమర్లకు వన్ ప్లస్ బుల్లెట్ వైర్ లెస్ వీ1 ను, వన్ ప్లస్ 7టీని కొనుగోలు చేసిన కష్టమర్లకు బుల్లెట్ వైర్ లెస్ వీ2ను ఉచితంగా అందిస్తున్నట్లు ప్రకటించింది.

వన్ ప్లస్ "రెడ్ కేబుల్ క్లబ్ " ప్రైమ్ మెంబర్స్ కు వన్ ప్లస్ స్మార్ ఫోన్ మరియు టీవీలపై రూ.5వేల వోచర్ ను సొంతం చేసుకోవచ్చని సదరు సంస్థ తెలిపింది. అంతేకాదు వన్  ప్లస్ టీ7ను అమెజాన్ లో అమెజాన్ గ్రేట్ ఇండియన్ సేల్ లో కొనుగోలు చేస్తే రూ.2వేల క్యాష్ బ్యాక్ ను అందించనుంది.

also read రిలయన్స్‌ జియో మరో రికార్డు... మూడున్నరేళ్లకే ‘టాప్’ రేంజి లోకి ...

వన్ ప్లస్ టీవీల పై ఆఫర్లు

అమెజాన్ లో వన్ ప్లస్ టీవీ 55క్యూను కొనుగోలు చేసిన కష్టమర్లు రూ.10వేల క్యాష్ బ్యాక్, వన్ ప్లస్ టీవీ 55క్యూ1 ప్రో ను కొనుగోలు చేసిన కష్టమర్లు రూ. 15వేల క్యాష్  బ్యాక్ ను సొంతం చేసుకోవచ్చు. దీంతో పాటు అమెజాన్ లో సంవత్సరం వరకు నోకాస్ట్ ఈఎంఐ, రిలయన్స్ డిజిటల్ 6నెలల నోకాస్ట్ ఈఎంఐ సౌకర్యంతో పాటు  రూ.3వేల ఎక్సేంజ్ ఆఫర్, వన్ ఇయర్ వారంటి, ఈరోస్ నౌ ఫ్రీ సబ్ స్క్రిప్షన్ ను అందిస్తుంది. వన్‌ప్లస్ స్టోర్స్‌లో వన్‌ప్లస్ టీవీ 55 క్యూ 1 ప్రో, వన్ ప్లస్ టీవీ 55 క్యూ 1 ను కొనుగోలు చేసినందుకు గాను ఉచితంగా బుల్లెట్ వైర్‌లెస్ వి 2తో పాటు  క్యాష్ బ్యాక్ ఇవ్వనున్నట్లు వన్ ప్లస్ ప్రకటించింది.