ప్రముఖ ఈ-కామర్స్ వెబ్ సైట్ ఫ్లిప్ కార్ట్ మరోసారి ఆఫర్ల వర్షం కురిపించేందుకు సిద్ధమైంది. మరో ఈ-కామర్స్ వెబ్ సైట్ అమేజాన్ ప్రైమ్ డే సేల్ కి తెరలేపిన వెంటనే.. ఫ్లిప్ కార్ట్ బిగ్ షాపింగ్ డేస్ ప్రారంభించింది.

 జూలై 16 నుంచి ప్రారంభమయ్యే ఈ బిగ్‌ షాపింగ్‌ డేస్‌, జూలై 19 వరకు కొనసాగనుంది. ఈ సేల్‌లో స్మార్ట్‌ఫోన్లు, డ్రస్‌లు, గాడ్జెట్లు వంటి ఇతర ఉత్పత్తులపై బంపర్‌ ఆఫర్లను, బిగ్‌ డీల్స్‌ను అందించనున్నట్టు తెలిపింది. కాగ, అమెజాన్‌ ప్రైమ్‌ డే సేల్‌ కూడా జూలై 16నే ప్రారంభమవుతుంది. అయితే అమెజాన్‌ సేల్‌ మధ్యాహ్నం 12 గంటల నుంచి ప్రారంభమవుతుండగా.. ఫ్లిప్‌కార్ట్‌ సేల్‌ ఆ రోజు సాయంత్రం 4 గంటల నుంచి మొదలవుతుంది. 

ఈ సేల్‌ భాగంగా ఎస్‌బీఐ క్రెడిట్‌ కార్డు ద్వారా ఉత్పత్తులు కొనుగోలు చేసే వినియోగదారులకు ఇన్‌స్టాంట్‌ 10 శాతం డిస్కౌంట్‌ను ఫ్లిప్‌కార్ట్‌ ఆఫర్‌ చేస్తుంది. ఈ సేల్‌ తేదీల్లో ప్రతి ఎనిమిది గంటలకు ఒక్కసారి భారీగా ధరల తగ్గింపు ఉంటుంది. ఈ సేల్‌ ప్రారంభమైన తొలి రెండు గంటలు ‘రష్‌ అవర్‌’ డీల్స్‌ను  ఫ్లిప్‌కార్ట్‌ నిర్వహించబోతుంది. అంటే జూలై 16న సాయంత్రం 4 గంటల నుంచి ఆరు గంటల వరకు ఈ డీల్స్‌ను ఫ్లిప్‌కార్ట్‌ అందిస్తుంది. అదనంగా నో కాస్ట్‌ ఈఎంఐ స్కీమ్స్‌ను కూడా ఫ్లిప్‌కార్ట్‌ ఆఫర్‌ చేస్తుంది. 

స్మార్ట్‌ఫోన్లపై ఆఫర్లు : ఈ సేల్‌లో భాగంగా గూగుల్‌ పిక్సెల్‌ 2 ఎక్స్‌ఎల్‌ ఫోన్‌ రూ.42,999కే అందుబాటులో ఉంటుంది. దీనిలోనే ఎక్స్చేంజ్‌పై 3 వేల రూపాయల తగ్గింపు, 8 వేల రూపాయల క్యాష్‌బ్యాక్‌ ఆఫర్‌ అందుబాటులో ఉంటుంది. 37 వేల రూపాయల వరకు బై-బ్యాక్‌ ఆఫర్‌ గ్యారెంటీ కూడా ఈ స్మార్ట్‌ఫోన్‌కు లభ్యమవుతుంది. ఈ సేల్‌లో శాంసంగ్‌ ఫోన్ల ధరలు 10,900 రూపాయల నుంచి ప్రారంభమవుతున్నాయి. హానర్‌ 9 లైట్‌ కూడా స్పెషల్‌ ఆఫర్‌ కింద అందుబాటులో ఉంటుంది. ఈ సేల్‌లో భాగంగా ఏ స్మార్ట్‌ఫోన్‌ను ఎక్స్చేంజ్‌ చేసుకున్న కనీసం వెయ్యి రూపాయలు తగ్గింపును యూజర్లు పొందనున్నారు.