భారతదేశపు పాపులర్ టెక్నాలజి ఎలక్ట్రిక్ గూడ్స్ అండ్ కన్స్యూమర్ డ్యూరబుల్స్ కంపెనీ హావెల్స్ ఇండియా లిమిటెడ్ 3 స్టేజ్  ఎయిర్ ప్యూరిఫైయర్‌తో కూడిన సీలింగ్ ఫ్యాన్‌ను దేశంలోకి తీసుకొచ్చిన మొట్టమొదటి సంస్థగా అవతరించింది.

ఈ టెక్నాలజి కారణంగా ఈ పి‌ఎం 2.5, పి‌ఎం 10 కాలుష్య కారకాల వి‌ఓ‌సి ఫిల్టర్ చేయగలదు. అలాగే దాదాపు 130 క్యూ. ఎం/ హెచ్‌ఆర్ స్వచ్ఛమైన గాలిని అందిస్తుంది. ఈ ఎయిర్ సీలింగ్ ఫ్యాన్ ధర రూ .15 వేలు.

ఈ ఫ్యాన్ స్వచ్చమైన గాలిని ఇవ్వడమే కాక గాలిని శుభ్రపరుస్తుంది కూడా. అదనంగా ఈ ఫ్యాన్ లో హెచ్‌ఈ‌పి‌ఏ ఫిల్టర్లు ఆక్టివేటెడ్ కార్బన్, ప్రీ-ఫిల్టర్లు ఉన్నాయి, ఇవి కలుషిత గాలిని తీసుకొని తాజా  గాలిని అందిస్తాయి.

ఈ రిమోట్  కంట్రోల్ కి కూడా సపోర్ట్ చేస్తుంది. రిమోట్ కంట్రోల్ తో ఫ్యాన్ లైట్, ఎయిర్ ప్యూరిటీ ఎల్‌ఈ‌డి ఇండికేటర్ మొదలైన వాటిని కంట్రోల్ చేయవచ్చు. ఈ ఫ్యాన్ బ్లేడ్ ఏరోడైనమిక్ తో వస్తుంది ఈ కారణంగా ఫ్యాన్ శబ్దం చేయదు.

also read హ్యాపీ బర్త్ డే ట్విట్టర్: ఈ మొట్టమొదటి ట్వీట్ 18 కోట్లకు వేలం.. మీకు తెలియని కొన్ని ఆసక్తికరమైన విష...

పర్సనల్ లైఫ్ స్టైల్ ఫ్యాన్- హావెల్స్ ఫ్యాన్ మెట్ 
కంపెనీ హావెల్స్ ఫ్యాన్ మెట్ అనే ప్రత్యేక ఫ్యాన్ ని కూడా ప్రారంభించింది. ఈ ఫ్యాన్ ని  మీరు ఎక్కడికైనా  హాయిగా తీసుకు వెళ్లవచ్చు. ఈ ఫ్యాన్ లో కార్బన్ ఫిల్టర్లను కలిగి ఉంటుంది, ఇది చెడు వాసనను తొలగిస్తుంది అలాగే గాలిని శుద్ధి చేస్తుంది.

అలాగే ఫ్యాన్  గాలిని  అవసరామైన దిశకు అనుగుణంగా మార్చవచ్చు. అంతేకాకుండా 3-గంటల బ్యాటరీ బ్యాకప్  ఇస్తుంది. దీనిని యూ‌ఎస్‌బి కేబుల్ లేదా మొబైల్ ఛార్జర్ ద్వారా కూడా ఛార్జ్ చేయవచ్చు. దీన్ని ల్యాప్‌టాప్‌కు కూడా కనెక్ట్ చేయవచ్చు. దీన్ని ఆపరేట్ చేయడానికి టచ్ ప్యాడ్ కూడా ఉంది. దీని ధర సుమారు రూ .2,000.

  హావెల్స్ ఇండియా లిమిటెడ్ ప్రెసిడెంట్-ఎలక్ట్రికల్ కన్స్యూమర్ డ్యూరబుల్స్ రవీంద్ర సింగ్ నేగి మాట్లాడుతూ, 'ఎలక్ట్రిక్ ఫ్యాన్స్ చాలా పోటీ ఇంకా అభివృద్ధి చెందుతున్న మార్కెట్. ఇది హావెల్స్‌కు చాలా ముఖ్యమైన విభాగం, కాబట్టి కస్టమర్ల అవసరాలను అర్థం చేసుకోవడం ద్వారా వారి అనుభవాన్ని మెరుగుపరిచే ఒక ఉత్పత్తితో మేము ముందుకు వచ్చాము. వాయు కాలుష్యం గురించి పెరుగుతున్న ఆందోళనలు ఎయిర్ ప్యూరిఫైయర్లను తప్పనిసరి చేస్తాయి, తద్వారా మీ కుటుంబం మంచి ఆరోగ్యం కలిగి ఉంటారు.