హ్యాపీ బర్త్ డే ట్విట్టర్: ఈ మొట్టమొదటి ట్వీట్ 18 కోట్లకు వేలం.. మీకు తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు..

ట్విట్టర్ మొదటి ట్వీట్ 15 సంవత్సరాల క్రితం 22 మార్చి 2006న చేశారు. ఈ ట్వీట్‌లో "జస్ట్ సెటింగ్ అప్ మై ట్విట్టర్" అని ట్వీట్ చేశారు. మార్చి 21న మధ్యాహ్నం 2.20 గంటలకు ట్విట్టర్ సీఈఓ జాక్ డోర్సే చేసిన ట్వీట్ ప్రపంచంలోనే మొట్టమొదటి ట్వీట్. 

twitter 15th birthday twitter first tweet by ceo jack dorsey auctioned for 18 crores

మీలో చాలా మంది మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విట్టర్‌ను ఉపయోగిస్తుంటారు, కాని మొదటి ట్వీట్ ఎవరు, ఎప్పుడు చేశారో మీకు తెలుసా. మొదటి ట్వీట్ 15 సంవత్సరాల క్రితం 22 మార్చి 2006న చేశారు. ఈ ట్వీట్‌లో "జస్ట్ సెటింగ్ అప్ మై ట్విట్టర్" అని ట్వీట్ చేశారు. మార్చి 21న మధ్యాహ్నం 2.20 గంటలకు ట్విట్టర్ సీఈఓ జాక్ డోర్సే చేసిన ట్వీట్ ప్రపంచంలోనే మొట్టమొదటి ట్వీట్. 

ఇప్పుడు అంటే 15 సంవత్సరాల తరువాత జాక్ డోర్సే చేసిన ఈ ట్వీట్  2.5 మిలియన్ డాలర్లకు వేలం జరిగింది అంటే సుమారు 18 కోట్లు. ఈ ట్వీట్ ఎన్ఎక్స్ టి ద్వారా వేలం వేయబడింది అంటే నాన్ ఫంగబుల్ టోకెన్.

ఎన్ఎక్స్ టి అనేది క్రిప్టోగ్రాఫిక్ టోకెన్ ఇది చాలా ప్రత్యేకమైనదిగా సూచిస్తుంది, అంటే మీకు ఎన్ఎక్స్ టి ఉంటే మీకు ప్రత్యేకమైన లేదా పురాతన డిజిటల్ ఆర్ట్ వర్క్ లేదా ప్రపంచంలో మరెవరి దగ్గర లేనిది ఉందని అర్థం. ట్విట్టర్ 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్నా ప్రత్యేక సందర్భంగా మీకు  తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు...

also read రిలయన్స్ జియోకి ఎయిర్‌టెల్ గట్టి షాక్.. తగ్గిపోతున్న ఆక్టివ్ యూజర్లు.. కారణం ఏంటంటే ? ...

ట్విట్టర్ లో అత్యధికంగా  ఫాలోవర్స్ ఉన్న అక్కౌంట్స్ - మార్చి 2021 వరకు

బరాక్ ఒబామా : 130 మిలియన్ ఫాలోవర్స్ 

జస్టిన్ బీబర్ : 114.1 మిలియన్ ఫాలోవర్స్ 

కేటి పెర్రీ : 109.5 మిలియన్ ఫాలోవర్స్ 

రిహన్న : 102.5 మిలియన్ ఫాలోవర్స్ 

క్రిస్టియానో ​​రొనాల్డో : 91.6 మిలియన్

టేలర్ స్విఫ్ట్ : 88.6 మిలియన్ ఫాలోవర్స్ 

లేడీ గాగా : 84.1 మిలియన్ ఫాలోవర్స్ 

అరియానా గ్రాండే : 82.6 మిలియన్ ఫాలోవర్స్ 

ఎల్లెన్ డిజెనెరెస్ : 79.1 మిలియన్ ఫాలోవర్స్ 

యూట్యూబ్ : 73 మిలియన్ ఫాలోవర్స్ 

కిమ్ కర్దాషియాన్ : 69.5 మిలియన్ ఫాలోవర్స్ 

నరేంద్ర మోడీ : 66.4 మిలియన్ ఫాలోవర్స్ 

సెలెనా గోమెజ్: 64.8 మిలియన్ ఫాలోవర్స్ 

జస్టిన్ టింబర్‌లేక్ : 64.1 మిలియన్ ఫాలోవర్స్ 

సి‌ఎన్‌ఎన్ బ్రేకింగ్ న్యూస్ : 61.1 మిలియన్ ఫాలోవర్స్ 

తాజాగా ట్విటర్‌ మరో సరికొత్త ఫీచర్‌ను యూజర్లకు అందుబాటులోకి తీసుకురానుంది. కొత్తగా రాబోతున్న ఈ ఫీచర్‌లో టీట్లకు ఎడిట్, డిలీట్‌ చేసేలా ‘అన్‌ డూ’ఆప్షన్‌  కనిపించనుంది. అయితే  ఈ ఫీచర్ ఉచితం కాదు.. సబ్‌స్క్రైబ్‌‌ చేసుకుంటే తప్ప ఈ ఫీచర్‌ అందుబాటులో ఉండదు. దీంతో ఇప్పుడు ట్విటర్‌ వాడుతున్న వారు భవిష్యత్తులో ఈ ఫీచర్‌ కోసం సబ్‌స్క్రిప్షన్‌ తీసుకోవాల్సిందే.  ప్రపంచవ్యాప్తంగా   యూజర్ల డిమాండ్లను దృష్టిలో ఉంచుకుని ట్విట్టర్‌ ఈ ‘అన్‌డూ’ ఫీచర్‌ను తీసుకువస్తున్నట్లు తెలుస్తోంది.  

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios