Asianet News TeluguAsianet News Telugu

బీఎస్‌ఎన్‌ఎల్‌ సేవల విస్తరణ... 70వేల చోట్ల 4జీ సేవలు...

ప్రభుత్వ రంగ టెలికం సంస్థ భారత్ సంచార్ నిగం లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) ఈ నెలాఖరు నాటికి 50 వేల 4జీ లైన్ ఎక్విప్‌మెంట్స్ కోసం టెండర్లు పిలువనున్నట్లు ప్రకటించింది. 

BSNL to float tender for 50K 4G line equipments by Nov-end
Author
Hyderabad, First Published Nov 25, 2019, 12:21 PM IST

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ భారత్‌ సంచార్‌ నిగమ్‌ (బీఎస్‌ఎన్‌ఎల్‌) సేవల విస్తరణ దిశగా వడివడిగా అడుగులేస్తున్నది. దేశంలో భారీగా 4జీ సేవలను అందుబాటులోకి తేవడానికి సమాయత్తం అవుతోంది. ఇందులో భాగంగా 4జీ టెక్నికల్‌ ఉపకరణాల కోసం సంస్థ అంతర్జాతీయ మేటి సంస్థల సాయం తీసుకోవాలని నిర్ణయించింది 

also read  మొబైల్.. చార్జీల పెంపు ప్రకటన...వినియోగదారులలో ఆందోళన...

4జీ సేవల కోసం తాము త్వరలోనే హువావే, ఎరిక్‌సన్‌, నోకియా, జెడ్‌టీఈ వంటి సంస్థల నుంచి ఉపకరణాలను కొనుగోలు చేయనున్నట్లు బీఎస్ఎన్ఎల్ తెలిపింది. రానున్న ఆరు నెలల్లో తాము 4జీ సేవలను దేశంలో పూర్తిస్థాయిలో అందుబాటులోకి తేవాలని నిర్ణయించామని సంస్థ తెలిపింది. 

4జీ టెక్నాలజీని అంది పుచ్చుకొనేందుకు టెక్నాలజీ సాయానికి తాము ఒపెన్‌ టెండర్‌ విధానానికి వెళుతున్నట్లు బీఎస్‌ఎన్‌ఎల్‌ తెలిపింది. ప్రపంచ వ్యాప్తంగా టెలికం రంగంలో మేటి ఉన్న అన్ని సంస్థలు బిడ్డింగ్‌లో పాల్గొనే విధంగా తాము చర్యలు పడుతున్నామని బీఎస్‌ఎన్‌ఎల్‌ చైర్మెన్‌ ప్రవీణ్‌ కుమార్‌ తెలిపారు.

also read  వెంటనే వాట్సాప్‌ డిలేట్ చేయండి లేదంటే మీ ఫోటోలు,మెసేజ్లు లీక్...: టెలిగ్రామ్ సి‌ఈ‌ఓ

నెట్‌వర్క్‌ ఇక్విప్‌మెంట్‌ నిమిత్తం తాము రానున్న రెండేళ్లలో రూ.1,200 కోట్లు వెచ్చిస్తామని బీఎస్ఎన్ఎల్ చైర్మన్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. సర్కారు నుంచి ఇటీవలే రూ.74వేల కోట్ల పునరుద్ధరణ ప్యాకేజీని అందుకున్న సంస్థ దేశ వ్యాప్తంగా దాదాపు 70వేల ప్రాంతాల్లో 50వేల కొత్త 4జీ మొబైల్‌ సైట్లను ఏర్పాటు చేయనుంది. 

వచ్చే ఏడాది తొలిఅర్థ భాగంలో 4జీని అందుబాటులోకి తేవాలని తాము భావిస్తున్నట్టుగా బీఎస్ఎన్ఎల్ చైర్మన్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. హువావే సంస్థ టెలికాం ఇక్విప్‌మెంట్స్‌లో గోపత్య సమస్యలు వెలువడు తున్నందున ఆ సంస్థను బిడ్డింగ్‌కు అనుమతిస్తారా అన్న ప్రశ్నకు బీఎస్‌ఎన్‌ వర్గాలు స్పందించాయి. చట్టానికి లోబడి అన్ని సంస్థలకు అవకాశం ఇవ్వనున్నట్టుగా తెలిపారు.

Follow Us:
Download App:
  • android
  • ios