Asianet News TeluguAsianet News Telugu

32జిబి ర్యామ్‌, రెండు డిస్‌ప్లేలతో ఆసుస్ కొత్త ల్యాప్‌టాప్‌లు విడుదల.. 1టిబి స్టోరేజ్ తో బెస్ట్ ఫీచర్స్ ఇవే..

డ్యూయల్ డిస్‌ప్లేతో ఆసుస్  భారతదేశంలో రెండు కొత్త ల్యాప్‌టాప్‌లను విడుదల చేసింది. ఆసుస్ జెన్‌బుక్ డుయో 14 ధర  రూ .99,990, జెన్‌బుక్ ప్రో డుయో 15 ఒఎల్‌ఇడి  ధర రూ .2,39,990.

asus zenbook duo 14 and zenbook pro duo 15 oled laptop launched in india with screenpad plus secondary display know more here
Author
Hyderabad, First Published Apr 14, 2021, 5:39 PM IST

తైవాన్ ఎలక్ట్రోనిక్  కంపెనీ ఆసుస్  భారతదేశంలో రెండు జెన్‌బుక్ సిరీస్ ల్యాప్‌టాప్‌లను విడుదల చేసింది. వీటిలో ఆసుస్ జెన్‌బుక్ డుయో 14, జెన్‌బుక్ ప్రో డుయో 15 ఒఎల్‌ఇడి ఉన్నాయి. ఈ రెండు ల్యాప్‌టాప్‌లలో స్క్రీన్‌ప్యాడ్ ప్లస్ అనే డ్యూయల్ డిస్‌ప్లే ఉంది.

జెన్‌బుక్ డుయో 14 లో 11వ జనరేషన్ ఇంటెల్ కోర్ ప్రాసెసర్ ఉండగా, జెన్‌బుక్ ప్రో డుయో 15 ఓఎల్‌ఇడిలో ఎన్విడియా జిఫోర్స్ ఆర్టిఎక్స్ 3070 గ్రాఫిక్‌లతో 10వ జనరేషన్ ఇంటెల్ కోర్ ప్రాసెసర్ ఉంది.

ఆసుస్ జెన్‌బుక్ డుయో 14  (యూ‌ఎక్స్ 482) ధర రూ .99,990 కాగా,  ఆసుస్ జెన్‌బుక్ ప్రో డుయో 15 ఒఎల్‌ఇడి (యుఎక్స్ 582) ధర రూ .2,39,990. జెన్‌బుక్ డుయో 14 సేల్ ఈ రోజు అంటే ఏప్రిల్ 14 నుండి  ప్రారంభం కాగా, ఆసుస్ జెన్‌బుక్ ప్రో డుయో 15 ఓఎల్‌ఇడి సేల్ వచ్చే నెల నుంచి అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, ఆఫ్‌లైన్ స్టోర్ల ద్వారా ప్రారంభమవుతుంది.

ఆసుస్ జెన్‌బుక్ డుయో 14 స్పెసిఫికేషన్లు
ఆసుస్ జెన్‌బుక్ డుయో 14లో  14 అంగుళాల పూర్తి హెచ్‌డి డిస్‌ప్లే, 1920x1080 పిక్సెల్‌ల రిజల్యూషన్‌,  ఎల్‌ఈడీ బ్యాక్‌లైట్, 400 నిట్స్ బ్రైట్ నెస్, స్క్రీన్‌ప్యాడ్ ప్లస్ పేరుతో 12.65 అంగుళాల ఫోల్డబుల్ సెకండ్  డిస్‌ప్లే ఉంది. దీని రిజల్యూషన్ 1920x515 పిక్సెల్స్. దీనికి స్టైలస్ సపోర్ట్ కూడా ఉంది.

also read రెడ్‌మి, పోకో, వివోకి పోటీగా రియల్‌మీ కొత్త బడ్జెట్ ఫోన్.. నేడే ఫస్ట్ సేల్.. ధర ఎంతంటే ? ...

విండోస్ 10 హోమ్ ల్యాప్‌టాప్‌లో వస్తుంది. ఇందులో ఇంటెల్ కోర్ ఐ 7-1156 జి 7 ప్రాసెసర్, ఎన్విడియా జిఫోర్స్ ఎంఎక్స్ 450 జిపియు గ్రాఫిక్స్, ఎల్‌పిడిడిఆర్ 4xర్యామ్ 16 జిబి వరకు, 1 టిబి వరకు స్టోరేజ్ లభిస్తుంది. కనెక్టివిటీ కోసం ఆసుస్ జెన్‌బుక్ డుయో 14 లో రెండు థండర్‌బోల్ట్ 4 పోర్ట్‌లు, యుఎస్‌బి 3.2 జెన్ 2 టైప్-ఎ పోర్ట్, హెచ్‌డిఎంఐ 1.4, 3.5 ఎంఎం హెడ్‌ఫోన్ జాక్ ఉన్నాయి.

అంతేకాకుండా ల్యాప్‌టాప్‌లో వై-ఫై 6, బ్లూటూత్ వి5.0 ఉన్నాయి. ల్యాప్‌టాప్‌లో హార్మోన్ కార్డాన్ స్పీకర్, కోర్టానా సపోర్ట్ తో మైక్రోఫోన్ కూడా ఉంది. దీనిలో ఏ‌ఐ ఆధారిత సౌండ్ క్యాన్సలేషన్ అందించారు. ఈ ల్యాప్‌టాప్‌లో 70Wh బ్యాటరీ, 17 గంటల బ్యాకప్ ఇస్తుంది.

సుస్ జెన్‌బుక్ ప్రో డుయో 15 స్పెసిఫికేషన్లు
ఆసుస్ జెన్‌బుక్ ప్రో డుయో 15లో 15.6-అంగుళాల ఓ‌ఎల్‌ఈ‌డి  4కే  యూ‌హెచ్‌డి నానోఈజ్ టచ్ డిస్‌ప్లే, 400 నిట్ల బ్రైట్ నెస్, టియువి రైన్‌ల్యాండ్ సరిఫికేషన్ కూడా లభించింది. దీని సెకండ్ స్క్రీన్ 3840x1100 పిక్సెల్స్ రిజల్యూషన్‌తో 14.1 అంగుళాల డిస్ ప్లే, ఇంటెల్ కోర్ i9-10980HK ప్రాసెసర్, 32జి‌బి  డి‌డి‌ఆర్4  ర్యామ్, 1టి‌బి ఎస్‌ఎస్‌డి స్టోరేజ్ ఉంది. కనెక్టివిటీ కోసం దీనికి రెండు థండర్ బోల్ట్ జెన్ 2 టైప్-ఎ పోర్ట్స్, హెచ్‌డిఎంఐ 2.1, హెడ్‌ఫోన్ జాక్ ఉన్నాయి. వై-ఫై 6, బ్లూటూత్ వి5.0 ను కూడా ఉంది. దీనికి 92Wh బ్యాటరీని  అందించారు, దీని బరువు 2.34 కిలోలు.

Follow Us:
Download App:
  • android
  • ios