అమెజాన్ ఇండియా  ఫాబ్ ఫోన్స్ ఫెస్ట్ అమ్మకాలు అనేక ప్రముఖ మొబైల్ ఫోన్లలతో ఒప్పందాలు చేసుకొని ఆఫర్లను ప్రవేశపెట్టింది. ఫ్యాబ్ ఫోన్స్ ఫెస్ట్ సేల్ ఆఫర్లతో పాటు ఎంచుకున్న స్మార్ట్‌ఫోన్‌లపై 40 శాతం వరకు తగ్గింపును కూడా అందిస్తోంది. ఈ అమ్మకాలపై ఆఫర్ నవంబర్ 29 వరకు ఉంటుంది. అమెజాన్ యాక్సిస్ బ్యాంక్‌తో ఒప్పందం కుదుర్చుకుని  బ్యాంక్ క్రెడిట్ లేదా డెబిట్ కార్డు వినియోగదారులకు 1,500 వరకు తక్షణ తగ్గింపు ఇస్తుంది. యాక్సిస్ బ్యాంక్ కార్డులను ఉపయోగించి వారికి EMI లావాదేవీలపై మాత్రమే డిస్కౌంట్ చెల్లుతుంది.

also read ఈ ప్లాట్‌ఫామ్ పై ఆల్-టైమ్ హై...100 మిలియన్లు దాటిన స్నాప్‌డీల్


అమెజాన్ ఫ్యాబ్ ఫోన్స్ ఫెస్ట్ 2019 అమ్మకాలలో  ప్రస్తుతం ఉన్న ఉత్తమ ఆఫర్లు

ఐఫోన్ XR
ఆపిల్ యొక్క ఐఫోన్ ఎక్స్‌ఆర్ 64 జిబి వెరిఏంట్ ఈ వారం ఫాబ్ ఫోన్స్ ఫెస్ట్ అమ్మకంలో దీని ధర రూ. 42,900 (ఎంఆర్‌పి రూ .49,900) సాధారణంగా దీని ధర ఆన్‌లైన్ లో రూ. 44,999 ఉంది. మీరు మీ పాత స్మార్ట్‌ఫోన్‌ తో ఎక్స్ఛేంజి ద్వారా కొనుగోలు చేస్తే రూ. 7,050 డిస్కౌంట్ పొందుతారు. నో-కాస్ట్ ఇఎంఐ ఆప్షన్స్  ప్రధాన క్రెడిట్ కార్డులతో ద్వార అందుబాటులో ఉంది మరియు యాక్సిస్ బ్యాంక్ కార్డ్ యూజర్లు అదనంగా EMI లావాదేవీలపై  రూ. 1,500 తక్షణ తగ్గింపు ఉంటుంది.


శామ్‌సంగ్ గెలాక్సీ ఎం 30
శామ్‌సంగ్ గెలాక్సీ ఎం 30  4 జిబి ర్యామ్, 64 జిబి స్టోరేజ్ వేరియంట్ అమెజాన్ ఫాబ్ ఫోన్స్ ఫెస్ట్ అమ్మకం సమయంలో ధిని ధర రూ. 12,499 (MRP ధర రూ. 16,490). ఈ స్మార్ట్‌ఫోన్ వెనుక భాగంలో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌తో పాటు 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాతో వస్తుంది. గెలాక్సీ ఎం 30 సామ్‌సంగ్ ఎక్సినోస్ 7904 SoC చేత శక్తినిస్తుంది, దీనికి 4GB RAM సపోర్ట్ ఉంది. 


వన్‌ప్లస్ 7 ప్రో
అమెజాన్ ఇండియా ప్రస్తుతం వన్‌ప్లస్ 7 ప్రో (8 జీబీ, 256 జీబీ వేరియంట్) ను రూ. 42,999 కే లభ్యంకానుంది(ఎంఆర్‌పి ధర రూ. 52,999). హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డ్ యూజర్లు పరిమిత కాలానికి వన్‌ప్లస్ 7 ప్రోతో 2,000 తక్షణ డిస్కౌంట్‌ పొందుతారు. ఎంపిక చేసిన క్రెడిట్ మరియు డెబిట్ కార్డులతో నో-కాస్ట్ EMI చెల్లింపు ఎంపికలు కూడా అందుబాటులో ఉన్నాయి.

also read  ఇండియాలో ఐఫోన్‌...తయారీ, విక్రయాలు ఎక్కడి నుంచి చేస్తున్నారో తెలుసా...?


హానర్ 20
హానర్ 20 (6 జీబీ, 128 జీబీ) ను ఈ వారం అమెజాన్ ఫాబ్ ఫోన్స్ ఫెస్ట్ అమ్మకంలో దీని ధర రూ. 22,999 (MRP ధర రూ .35,999). మీరు హానర్ 20 ను కొనడానికి  ఇది మంచి సమయం. మీరు మీ పాత స్మార్ట్‌ఫోన్‌ను మార్చుకొని రూ. 7,050 వరకు అదనపు తక్షణ తగ్గింపు పొందగలరు. యాక్సిస్ బ్యాంక్ కార్డుదారులు  ఇఎంఐ లావాదేవీలపై రూ. 1,500 అదనపు డిస్కౌంట్ కూడా పొందగలరు.


వివో వి 17 ప్రో
వివో వి 17 ప్రో  ఈ వారం అమెజాన్ ఇండియా ఫ్యాబ్ ఫోన్స్ ఫెస్ట్ అమ్మకంలో దీని ధర రూ. 27,990 (ఎంఆర్‌పి ధర రూ. 32,990). ఈ స్మార్ట్‌ఫోన్ బండిల్డ్ ఎక్స్ఛేంజ్ ఆఫర్‌తో వస్తుంది,  ఎంపిక చేసిన ప్రధాన క్రెడిట్ కార్డులతో నో-కాస్ట్ EMI ఎంపికలు కూడా అందుబాటులో ఉన్నాయి. వివో వి 17 ప్రో క్వాడ్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఇది క్వాల్‌కామ్  స్నాప్‌డ్రాగన్ 675 SoC చేత పనిచేస్తుంది.

వన్‌ప్లస్ 7 టి
వన్‌ప్లస్ 7 టి (8 జీబీ, 128 జీబీ) అమెజాన్ ఇండియాలో పరిమిత కాలానికి దీని ధర రూ.34,999 (ఎంఆర్‌పి ధర రూ. 37,999). అమెజాన్‌లో వన్‌ప్లస్ ఐదవ వార్షికోత్సవ వేడుకల్లో డిస్కౌంట్ కూడా ఒక భాగం. మీరు మీ పాత మొబైల్ ఫోన్‌ను వన్‌ప్లస్ 7 టితో ఎక్స్ఛేంజి చేయడం ద్వారా రూ.  7,050 రూపాయలు తగ్గింపు లభిస్తుంది. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డ్ యూజర్లు కూడా అదనంగా రూ. 1,500 తక్షణ తగ్గింపు ఉంటుంది.