ప్రముఖ ఈ-కామర్స్ వెబ్ సైట్ అమేజాన్ మరోసారి భారీ డిస్కౌంట్ సేల్ కి తెరలేపింది. అమేజాన్ ఫ్రీడమ్ సేల్ పేరిట డిస్కౌంట్ సేల్ ప్రకటించారు. ఆగస్ట్ 9 నుంచి ఆగస్ట్ 12 అర్ధరాత్రి వరకు ఈ సేల్ కొనసాగనుంది. స్మార్ట్‌ఫోన్స్, కన్జూమర్ ఎలక్ట్రానిక్స్, ఫ్యాషన్, టీవీలులాంటి వాటిపై మొత్తం 20 వేల డీల్స్ ఉన్నట్లు కంపెనీ ప్రకటించింది. 

వన్‌ప్లస్, వివో, జేబీఎస్, ఎల్‌జీ, ఫిలిప్స్, కాసియో బ్రాండ్లపై పెద్ద ఎత్తున ఆఫర్లు ఉన్నాయి. ఎస్‌బీఐ క్రెడిట్, డెబిట్ కార్డులపై పది శాతం అదనపు డిస్కౌంట్ లభిస్తుంది. అన్ని ప్రోడక్ట్‌లపై ఈఎంఐ ఆప్షన్స్ ఉంటాయి. ఫ్రీడమ్ సేల్‌లో భాగంగా మొబైల్ ఫోన్లు, యాక్సెసరీలపై 40 శాతం వరకు డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి.

వన్‌ప్లస్ 6, రియల్‌మి 1 6జీబీ, హానర్ 7ఎక్స్, మోటో జీ6, సామ్‌సంగ్ గెలాక్సీ నోట్ 8, హువావీ పీ20 లైట్, హానర్ 7సీ, మోటో ఈ5 ప్లస్, సామ్‌సంగ్ గెలాక్సీ ఆన్7 ప్రైమ్, వివో నెక్స్, నోకియా 6.1, ఒప్పో ఎఫ్5, ఎల్జీ వీ30లాంటి మొబైల్స్‌పై ఎక్స్‌చేంజ్ డిస్కౌంట్లు కూడా ఉంటాయి. సేల్‌లో భాగంగా హానర్ ప్లే, హువావీ నోవా 3ఐ, బ్లాక్‌బెర్రీ కీ2 మొబైల్స్ కూడా లాంచ్ చేయనున్నారు. 

ఆగస్ట్ 9న ప్రపంచవ్యాప్తంగా లాంచ్ కానున్న సామ్‌సంగ్ గెలాక్సీ నోట్ 9 కూడా సేల్‌లో భాగంగా అందుబాటులో ఉండే అవకాశం ఉంది. మొబైల్స్ కాకుండా కన్జూమర్ ఎలక్ట్రానిక్స్, ల్యాప్‌టాప్స్, కెమెరాలు, హెడ్‌ఫోన్లపై కూడా భారీగా ఆఫర్లు ప్రకటించింది అమెజాన్.