చైనాలో రెడ్‌మి కె30తో పాటు రెడ్‌మిబుక్ 13 ని లాంచ్ చేశారు. మొదటిగా రెడ్‌మి రౌటర్ తరువాత రెడ్‌మి స్మార్ట్ స్పీకర్‌తో పాటు వీటిని లాంచ్ చేశారు. షియోమి లాంచ్ చేసిన రెండు వారిఎంట్లలో ఒకటి 4జి ఫోన్,  రెండోది 5జి ఫోన్‌. ఇందులో డ్యూయల్ సెల్ఫీ కెమెరాలను కలిగి హోల్-పంచ్ డిస్ ప్లే  తో వస్తుంది. క్వాడ్ రియర్ కెమెరా సెటప్‌ ఇందులో  ఉంది. 

బ్యాక్ కెమెరా సెటప్‌లో 64 మెగాపిక్సెల్ సోనీ IMX686 సెన్సార్ అమర్చారు. ఈ ఫోన్ లో సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ ఉంది.ఇదీ ఆండ్రాయిడ్ 10 ఆధారంగా పనిచేస్తుంది. దీనికి 4,500 ఎంఏహెచ్ బ్యాటరీ, 20 మెగాపిక్సెల్ సెల్ఫి కెమెరా, ఎంఐయుఐ 11 ఇంకా ఎన్నో ఫీచర్స్ ఉన్నాయి. 4జి మరియు 5జి వేరియంట్లలో వేర్వేరు ప్రాసెసర్లు, విభిన్న కెమెరాలు ఉన్నాయి.

also read పాత కంప్యూటర్లు వాడుతున్నారా...మైక్రోసాఫ్ట్ సర్వేలో సంచలన విషయాలు...

రెడ్‌మి కె30, రెడ్‌మి కె30 5జి ఫోన్ ధరలు
రెడ్‌మి కె30 5జి వేరిఎంట్ లో 6 జిబి ర్యామ్ + 64 జిబి స్టోరేజ్ గల ఫోన్ సిఎన్‌వై 1,999 (సుమారు రూ. 20,100), 6 జిబి ర్యామ్ + 128 జిబి స్టోరేజ్ ఫోన్ సిఎన్‌వై 2,299 (సుమారు రూ. 23,100), చైనాలో 8GB RAM + 128GB స్టోరేజ్ ఫోన్ సిఎన్‌వై 2,599 (సుమారు రూ .26,100) , 8GB RAM + 256GB స్టోరేజ్ ఫోన్ CNY 2,899 (సుమారు రూ. 29,100). రెడ్‌మి కె30 5జి ఫోన్లో డీప్ సీ లైట్, టైమ్ మోనోలాగ్, ఫ్లవర్ షాడో, పర్పుల్ జెడ్ ఫాంటసీ కలర్ ఆప్షన్స్‌లో లభిస్తుంది. షియోమి ఫోన్‌ను ఎం‌ఐ.కామ్ ఇంకా జెడి.కామ్‌లో  ప్రీ-సేల్ ఈ రోజు ప్రారంభం చేశారు.


మరోవైపు, రెడ్‌మి కె30 4జి వేరియంట్  చైనాలో 6 జిబి ర్యామ్ + 64 జిబి స్టోరేజ్ ఆప్షన్‌కు ఫోన్ సిఎన్‌వై 1,599 (సుమారు రూ .16,100), 6 జిబి ర్యామ్ + 128 జిబి స్టోరేజ్ ఆప్షన్స్ ఫోన్ సిఎన్‌వై 1,699 (సుమారు రూ .17,100), 8GB RAM + 128GB స్టోరేజ్ ఫోన్ CNY 1,899 (సుమారు రూ. 19,100), మరియు 8GB RAM + 256GB స్టోరేజ్  ఫోన్ CNY 2,199 (సుమారు రూ. 22,100) వరకు ఉంటుంది. 4జి వేరియంట్ డీప్ సీ లైట్, ఫ్లవర్ షాడో, పర్పుల్ జాడే ఫాంటసీ కలర్ ఆప్షన్లలో మాత్రమే లభిస్తుంది.

also read అదిరిపోయే స్పెషల్ ఫీచర్స్ తో విపణిలోకి వివో వీ17...

రెడ్‌మి కె30 4జి, రెడ్‌మి కె 30 5జి స్పెసిఫికేషన్స్, ఫీచర్స్
రెడ్‌మి కె30 డ్యూయల్ సిమ్ (నానో + నానో) స్లాట్‌, ఆండ్రాయిడ్ 10 ఆధారంగా MIUI 11తో నడుస్తుంది. ఫోన్‌లో 6.67-అంగుళాల ఫుల్-హెచ్‌డి + (1080x2400 పిక్సెల్స్) హోల్-పంచ్ డిస్ప్లే , 91 శాతం స్క్రీన్-టు-బాడీ రేషియో, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 5 జి వేరియంట్ 7nm స్నాప్‌డ్రాగన్ 765G SoC ద్వారా పనిచేస్తుంది. 

రెడ్‌మి కె30 4G వేరియంట్ స్నాప్‌డ్రాగన్ 730G ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇంటర్నల్ స్టోరేజ్ 64GB, 128GB మరియు 256B ఆప్షన్ లో లభిస్తుంది. ఫోన్లో మరింత స్టోరేజ్ విస్తరణ కోసం హైబ్రిడ్ మైక్రో SD కార్డ్ స్లాట్‌కు (256GB వరకు) సపోర్ట్ చేస్తాయి.


కెమెరాల విషయానికొస్తే, రెడ్‌మి కె30లో క్వాడ్ రియర్ కెమెరా సెటప్‌, క్వాడ్ రియర్ కెమెరా సెటప్‌లో 64 మెగాపిక్సెల్ సోనీ IMX686 సెన్సార్,  వెనుక కెమెరాలో f/1.89 ఎపర్చరు, 1/1.7-అంగుళాల సెన్సార్ అలాగే 6P లెన్స్‌లను కలిగి ఉంది. ప్రధాన కెమెరాకు 5 మెగాపిక్సెల్ మాక్రో లెన్స్, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ అలాగే 8-మెగాపిక్సెల్ 120 డిగ్రీల వైడ్ యాంగిల్ సెన్సార్ దీని ప్రత్యేకత.  నైట్ సీన్ మోడ్, రా ఫార్మాట్ సపోర్ట్ ఇంకా ఇతర AI- బ్యాక్డ్ ఫీచర్లు ఉన్నాయి. 4జి వేరియంట్లో, 5మెగాపిక్సెల్  కెమెరా స్థానంలో 2 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది.


రెడ్‌మి కె30 5జి లో సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌, 30W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 4,500 ఎంఏహెచ్ బ్యాటరీ ప్యాక్ తో వస్తుంది. 4జి వేరియంట్ తో పోల్చితే 27W ఫాస్ట్ ఛార్జింగ్కు సపోర్ట్. రెండు ఫోన్‌లలోని ఇతర కనెక్టివిటీలో ఎన్‌ఎఫ్‌సి, 5జి జిపిఎస్, యుఎస్‌బి టైప్-సి పోర్ట్ అలాగే 3.5 ఎంఎం ఆడియో జాక్ సపోర్ట్ చేస్తుంది.