ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ లావా మార్కెట్లోకి కొత్త ఫోన్ ను తీసుకొచ్చింది. లావా యువ స్టార్ 2 పేరుతో తీసుకొచ్చిన  ఈ ఫోన్ లో కళ్లు చెదిరే ఫీచర్లను అందించారు. ఈ ఫోన్ ధర ఎంత.? ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..  

5000mAh బ్యాటరీతో ల్యావా కంపెనీ బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. ఐఫోన్ 16లా గ్లాసీ బ్యాక్ ప్యానెల్‌తో ప్రీమియం లుక్‌తో వస్తుంది. ల్యావా యువ స్టార్ 2 పేరుతో వస్తున్న ఈ ఫోన్‌లో వెనుక వైపు రెండు కెమెరాలు నిలువుగా ఉన్నాయి. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

ల్యావా యువ స్టార్ 2: ఫీచర్లు, స్పెసిఫికేషన్లు

ఈ బడ్జెట్ ఫోన్‌లో 6.75-అంగుళాల HD+ డిస్‌ప్లే, 2.5D గ్లాస్, 60 Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. ఆక్టా-కోర్ Unisoc ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 14 గో ఎడిషన్‌తో పనిచేస్తుంది. 4GB RAM, 64GB స్టోరేజ్‌తో వస్తుంది. దీన్ని 512GB వరకు పెంచుకునే అవకాశాన్ని కల్పించారు. 

Scroll to load tweet…

కెమెరా విషయానికొస్తే.. ల్యావా యువ స్టార్ 2 వెనుక 13MP AI కెమెరా, సెకండరీ కెమెరా ఉంది. ముందు 5MP సెల్ఫీ కెమెరాను అందించారు. డ్యూయల్ సిమ్ సపోర్ట్ కూడా ఉంది. సైడ్‌లో ఫింగర్‌ప్రింట్ సెన్సార్ ను అందించారు. 

అదనపు ఫీచర్లలో 3.5mm ఆడియో జాక్, FM రేడియో ఉన్నాయి. 5,000mAh బ్యాటరీ, 10W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. IP54 రేటింగ్ కూడా ఉంది. అంటే దుమ్ము, నీటి నిరోధకతను కలిగి ఉంటుంది.

ల్యావా యువ స్టార్ 2: ధర, కలర్స్ 

ల్యావా యువ స్టార్ 2 ధర 6,499 రూపాయలుగా నిర్ణయించారు. 4GB RAM, 64GB స్టోరేజ్ వేరియంట్‌లో లభిస్తుంది. రేడియంట్ బ్లాక్, స్పార్క్లింగ్ ఐవరీ రంగుల్లో లభిస్తుంది. మైక్రో SD కార్డ్ ద్వారా స్టోరేజ్‌ను పెంచుకోవచ్చు. 8GB వరకు వర్చువల్ RAM పెంచుకోవచ్చు.

iQOO Neo 10 త్వరలో

ఇదిలా ఉంటే మరో ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ ఐక్యూ కూడా కొత్త ఫోన్ ను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. iQOO Neo 10 సిరీస్‌లో రెండో ఫోన్‌గా iQOO Neo 10ను కంపెనీ అధికారికంగా ప్రకటించింది. ఈ ఏడాది ప్రారంభంలో iQOO Neo 10Rను విడుదల చేసింది. గత ఏడాది నవంబర్‌లో చైనాలో iQOO Neo 10ను మొదట విడుదల చేసిన విషయం తెలిసిందే.