వై-ఫై హాట్ స్పాట్‌లు వాడొద్దు..!

Wi-Fi hot-spots pose danger
Highlights

వై-ఫై హాట్ స్పాట్‌లు వాడొద్దు..!

హైదరాబాద్: రష్యాలో వరల్డ్ కప్ మ్యాచ్‌లు జరిగే స్టేడియంల దగ్గర అందుబాటులో ఉన్న వై-ఫై నెట్‌వర్క్‌లను వినియోగించే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించాలని సైబర్ సెక్యూరిటీ నిపుణులు హెచ్చరిస్తున్నారు. మ్యాచ్‌లు జరిగే నగరాల్లో ఏర్పాటు చేసిన హాట్ స్పాట్‌లలో 20 శాతం సేఫ్ కాదని రష్యాకు చెందిన సైబర్ సెక్యూరిటీ కంపెనీ కాస్‌పెర్‌స్కీ ల్యాబ్ తాజా అధ్యయనం తేల్చి చెప్పింది. 


ట్రాఫిక్ ఎన్‌స్క్రిప్షన్ లేకపోవడానికి తోడు ఫిఫా వరల్డ్ కప్ లాంటి మెగా ఈవెంట్లు జరుగుతున్న వేళ యూజర్ డేటాను ఈజీగా యాక్సెస్ చేయడంలో వైర్‌లైస్ వై-ఫై నెట్‌వర్క్‌‌లు క్రిమినల్స్‌కు టార్గెట్ అవుతాయి అని కాస్‌పెర్‌స్కీ ల్యాబ్ సీనియర్ సెక్యూరిటీ రీసెర్చర్ డెనిస్ లిగెజో ఒక స్టేట్‌మెంట్‌లో స్పష్టం చేశారు. 
వరల్డ్ కప్ మ్యాచ్‌లు జరగనున్న సరాన్స్‌క్, సమర, నిజ్‌ని నోవ్‌గొరొడ్, కజన్, వోల్గోగ్రాడ్, మాస్కో, ఎకటెరిన్‌బర్గ్, సోచి, రోస్తోవ్, కెలినిన్‌గ్రాడ్, సెయింట్ పీటర్స్‌బర్గ్‌ నగరాల్లో ఏర్పాటు చేసిన హాట్ స్పాట్‌లను కాస్‌పెర్‌‌స్కీ ల్యాబ్ స్టడీ చేసింది.

loader