ఆయనెవరు: ఆసీస్ దిగ్గజంపై క్రిస్ గేల్ వ్యంగ్యం

Who's Ian Chappell?: Chris Gayle
Highlights

క్రిస్ గేల్ మైదానంలోనే కాకుండా వెలుపల కూడా ఏదో రకమైన వివాదానికి కేంద్ర బిందువు అవుతూ ఉంటాడు.

ముంబై: క్రిస్ గేల్ మైదానంలోనే కాకుండా వెలుపల కూడా ఏదో రకమైన వివాదానికి కేంద్ర బిందువు అవుతూ ఉంటాడు. తద్వారా వార్తల్లో నిలస్తూ ఉంటాడు. ఆస్ట్రేలియా దిగ్గజం, మాజీ కెప్టెన్ ఇయాన్ చాపెల్ ఎవరంటూ తాజాగా ప్రశ్నించి వివాదానికి తెరలేపాడు. ఆయనెవరో తనకు తెలియదని వ్యంగ్యంగా అన్నారు.

2016లో బిగ్‌బాష్‌ లీగ్‌ సందర్భంగా ఓ మహిళా వ్యాఖ్యాతతో గేల్‌ అసభ్యకరంగా మాట్లాడి వివాదం సృష్టించాడు. ఆ సందర్భంలో గేల్‌ను క్రికెట్‌ నుంచి బహిష్కరించాలని ఇయాన్ చాపెల్‌ అన్నాడు. 
తాజాగా ముంబై మిర్రర్‌ ఇంటర్వ్యూలో ఇయాన్ చాపెల్ చేసిన డిమాండ్ ను ప్రస్తావించగా చాపెల్‌ అంటే ఎవరంటూ ఎదురు ప్రశ్నించాడు.

loader