తనదైన శైలిలో స్పందిస్తూ అభిమానులను అలరిస్తుంటాడు 

సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తనదైన శైలిలో స్పందిస్తూ అభిమానులను అలరిస్తుంటాడు టీమిండియా మాజీ డాషింగ్‌ ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌. మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్‌ తనకు దైవంతో సమానమని ఎప్పుడు చెప్పే సెహ్వాగ్‌.. మరోసారి అతనిపై తనకున్న భక్తిని సోషల్‌ మీడియా వేదికగా తెలియజేశాడు.

సచిన్‌ రాముడైతే.. తాను హనుమంతుడిని అని తెలిపిన సెహ్వాగ్‌.. ఆ రాముడి, హనుమంతిడి స్టైల్‌లో దిగిన ఓ ఫొటోను షేర్‌ చేశాడు. దానికి క్యాప్షన్‌గా.. ‘దేవుడితో ఉన్నప్పుడు..అతని పాదాల వద్ద ఉండటం బాగుంది.’ అని పేర్కొన్నాడు. ఈ పోస్ట్‌కు ఫిదా అయిన అభిమానులు.. అద్భుతమైన జోడి అంటూ కామెంట్‌ చేస్తున్నారు.

View post on Instagram