టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి మనదేశంలోనే కాకుండా పక్క దేశంలో కూడా ఫ్యాన్స్ ఉన్నారన్న విషయం మన అందరికీ తెలిసిందే. ఆయన కనపడితే చాలు.. ఆటో గ్రాఫుల కోసం, ఫోటోల కోసం అభిమానులు ఎగపడతారు. ఇక ఆయన సతీమణి అనుష్క శర్మ బాలీవుడ్ అందాల రాశి. ఆమెకు కూడా ఫ్యాన్స్ కోకొల్లలు. అలాంటి జంట ఒకేసారి కనపడితే.. ఫోటో, ఆటోగ్రాఫ్ అడగకుండా ఉండలేరు.అలాంటిది విరుష్క జంటకు ఓ బుడతడు షాకిచ్చాడు. వారి దగ్గర ఆటోగ్రాఫ్ కాకుండా... వాళ్లకే తన ఆటో గ్రాఫ్ ఇచ్చాడు.

పూర్తి వివరాల్లోకి వెళితే... కోహ్లీ విండీస్ పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. అన్నింటిలోనూ టీం ఇండియా విజయం సాధించేలా కోహ్లీ కృషి చేశాడు. సినిమాలకు కాస్త విరామం ఇచ్చిన అనుష్క శర్మ కూడా అక్కడే వాలిపోయింది. మ్యాచ్ ల నుంచి కాస్త విరామం దొరికినా ఇద్దరూ విండీస్ లో చక్కర్లు కొట్టారు. వాటికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో కూడా షేర్ చేసుకున్నారు.

అయితే... ఈ జంట విహారానికి వెళ్లిన సమయంలో వారిని ఓ బుడ్డ అభిమాని గుర్తుపట్టాడు. వెంటనే విరుష్క జంట వద్దకు వెళ్లి.. మీకు నా ఆటో గ్రాఫ్ కావాలా అని అడిగాడు. అది చూసి తొలత షాకైన విరుష్క జంట... వెంటనే ఆ బాలుడి ఆటోగ్రాఫ్ ని తీసుకొని అతనిని సంతోషపెట్టారు. దీంతో ఆ చిన్నారి ఆనందానికి అవధులే లేవు.

దీనికి సంబంధించిన వీడియోని ఆ బాలుడి బంధువు ఒకరు ట్విట్టర్ లో షేర్ చేశారు. కాగా... వీడియో వైరల్ గా మారింది. విరుష్క జంటబాలుడి పట్ల చూపించినప్రేమకు అందరూ ఫిదా అయిపోయారు. సూపర్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు.