రషీద్ స్పిన్ మాయాజాలం.. ఆ బంతి కోహ్లీ మతి పొగొట్టింది

virat kohli stunned rashid ball
Highlights

ఇంగ్లాండ్‌తో మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా లీడ్స్ జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 8 వికెట్ల తేడాతో ఓటమి పాలవ్వడం.. సిరీస్ కోల్పోయిన సంగతి తెలిసిందే. స్పిన్‌ను సమర్థవంతంగా ఆడతారని ప్రపంచం చేత జేజేలు కొట్టించుకున్న భారత బ్యాట్స్‌మెన్‌ ఈ వన్డేలో అదే స్పిన్‌కు తలొగ్గక  తప్పలేదు

ఇంగ్లాండ్‌తో మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా లీడ్స్ జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 8 వికెట్ల తేడాతో ఓటమి పాలవ్వడం.. సిరీస్ కోల్పోయిన సంగతి తెలిసిందే. స్పిన్‌ను సమర్థవంతంగా ఆడతారని ప్రపంచం చేత జేజేలు కొట్టించుకున్న భారత బ్యాట్స్‌మెన్‌ ఈ వన్డేలో అదే స్పిన్‌కు తలొగ్గక  తప్పలేదు. ముఖ్యంగా ఇంగ్లాండ్ జట్టు స్పిన్నర్ రషీద్ స్పిన్ మాయాజాలంలో టీమిండియా విలవిలలాడిపోయింది.

ఈ మ్యాచ్‌లో సహచరులంతా పెవిలియన్ బాట పడుతున్నప్పటికీ కెప్టెన్ విరాట్ కోహ్లీ సంయమనంతో ఆడి జట్టుకు గౌరవప్రదమైన స్కోరును అందించాడు. 72 బంతుల్లో 7 ఫోర్లతో కోహ్లీ 71 పరుగులు చేశాడు. అయితే కోహ్లీ కూడా రషీద్‌ స్పిన్‌కు దొరికిపోయాడు. 31 ఓవర్లో చెలరేగిన రషీద్.. దినేశ్ కార్తీక్‌ను బౌల్డ్ చేశాడు.. ఆ తర్వాత వేసిన  అద్భుతమైన లెగ్‌బ్రేక్‌ లెగ్‌స్టంప్‌పై పడి గిర్రున తిరిగి కోహ్లీ బ్యాట్‌ను ముద్దాడి ఆఫ్‌స్టంప్‌ను కూల్చింది..

ఈ అనూహ్యమైన బంతికి ఆశ్చర్యపోయిన కోహ్లీ కొద్దిసేపు బౌలర్‌ను, పిచ్‌ను, వికెట్లను చూస్తూ షాక్‌లో నిలిచిపోయాడు... ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్  చేస్తోంది. 
 

loader