జట్టు కష్టాల్లో ఉన్న సయయంలో ... సహచరులు  ఒక్కొక్కరు వెనుదిరుగుతున్నా.. నాయకుడిగా జట్టును నడిపించేవాడే నిజమైన కెప్టెన్. యువకుడిగా దూకుడు తగ్గించి విరాట.. కెప్టెన్‌గా ఎలా ఉండోలో ప్రపంచానికి చాటి చెబుతున్నాడు. కెప్టెన్ ఇన్నింగ్స్  అంటే ఎంటో క్రికెట్ ప్రపంచానికి చూపించాడు. బర్మింగ్‌హోమ్‌లో ఇంగ్లాండ్‌తో జరుగుతున్న తొలి టెస్ట్‌లో తన స్ఫూర్తిదాయక ఇన్నింగ్స్‌తో జట్టును ఒడ్డున పడేశాడు.

తొలి ఇన్నింగ్స్‌లో బరిలోకి దిగిన టీమిండియాకు ఓపెనర్లు విజయ్, ధావన్ 50 పరుగులతో మంచి ఆరంభాన్నిచ్చారు..  అయితే ఈ జోడీతో పాటు వన్‌డౌన్‌లో వచ్చిన కేఎల్ రాహుల్‌, రహానే, దినేశ్ కార్తీక్ వెంట వెంటనే అవుట్ అయ్యారు. అనంతరం క్రీజులోకి వచ్చిన హార్డిక్ పాండ్యా 22 పరుగులతో కెప్టెన్ కోహ్లీకి సహకరించాడు.. వీరిద్దరూ ఆరో వికెట్‌కు 48 పరుగులు జోడించాక.. తరువాతి స్పెల్‌లోకి వచ్చిన కరన్ మరోసారి పాండ్యాను పెవిలియన్‌కు పంపాడు..  

అశ్విన్, షమీ, ఇషాంత్, ఉమేశ్‌ల సాయంతో పోరాడిన కోహ్లీ సెంచరీతో చేశాడు.. చివరికి రషీద్ బౌలింగ్‌లో క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. గతంలో సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రావిడ్ లాంటి ఆటగాళ్లు కూడా టాయిలెండర్ల సాయంతో ఇన్నింగ్స్‌ను నడిపించలేదు. నాలుగేళ్ల క్రితం ఇంగ్లాండ్ పర్యటనకు వచ్చిన కోహ్లీ.. 10 ఇన్నింగ్స్‌ల్లో 288 బంతులను ఎదుర్కొని 134 పరుగులు చేశాడు.

దీనిని గుర్తుపెట్టుకున్న ఇంగ్లీష్ జట్టు అభిమానులు కోహ్లీ గ్రౌండ్‌లోకి అడుగుపెట్టే సమయంలో గేలి చేస్తూ స్వాగతించారు కూడా. ఈ విమర్శలకు ఒకే ఒక్క ఇన్నింగ్స్‌తో సమాధానం చెప్పాడు కోహ్లీ.. అది ఎంతలా అంటే ఔటై పెవిలియన్‌కే చేరే సమయంలో భారత్ పాటు ఇంగ్లాండ్ అభిమానులు నిలబడి చప్పట్లతో అభినందించారు. తక్కువ పరుగులకు అలౌటైనా ఒక్క ఇన్నింగ్స్‌తో రాబోయే సిరీస్‌కు జట్టులో అతని ఆట స్ఫూర్తిని నింపుతుందని విశ్లేషకులు అంటున్నారు.