కోహ్లీ గడ్డానికి ఇన్సూరెన్స్..?

Virat Kohli Gets His Beard 'Insured'; KL Rahul Pokes Fun at the Indian Skipper
Highlights

అసలు నిజాన్ని బయటపెట్టిన కేఎల్ రాహుల్

టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ని ఈ మధ్య గనమించారో లేదో.. ఎప్పుడు చూసినా గడ్డంతోనే కనపడుతున్నారు. తన భార్య, బాలీవుడ్ నటి అనుష్క శర్మకు తాను గడ్డంతోనే ఉండటం ఇష్టం కాబట్టి గడ్డాన్ని పెంచుతున్నట్లు గతంలో కోహ్లీ వెల్లడించాడు.

గతేడాది ఐపీఎల్ సందర్భంగా 'బ్రేక్ ద బియర్డ్' ఛాలెంజ్ ఎంతో పాపులర్ అయింది. చాలా మంది క్రికెటర్లు ఈ ఛాలెంజ్‌ని స్వీకరించి గడ్డం తీసి ఒకరి తర్వాత మరొకరికి ఛాలెంజ్‌లు విసురుకున్న సంగతి తెలిసిందే. అయితే కోహ్లీ దగ్గరకు వచ్చే సరికి తాను గడ్డం తీయలేనని చెప్పడం జరిగింది.

దీనికి అనుష్క శర్మ స్పందిస్తూ 'నువ్వు తీయలేవు' అని తన ఇన్‌స్టాగ్రామ్‌లో కామెంట్ పెట్టింది. అయితే, విరాట్ కోహ్లీ తన గడ్డాన్ని తీయకపోవడం పెద్ద కథే ఉంది. అందుకు సంబంధించిన రహాస్యాన్ని టీమిండియా క్రికెటర్ కేఎల్ రాహుల్ బయట పెట్టాడు.

 

విరాట్ తన గడ్డానికి ఇన్సూరెన్స్ చేయించుకున్నారట. అందుకే గడ్డాన్ని తీయడం లేదట. దుకు సంబంధించిన ఓ వీడియోని కేఎల్ రాహుల్ తన ట్విట్టర్‌లో పోస్టు చేశాడు. 'నీ గడ్డం నిన్ను బాగా విసిగిస్తుందని నాకు తెలుసు. నీ గడ్డానికి ఇన్సూరెన్స్ తీసుకున్నావన్న ఈ వార్త నేను చెప్పిన విషయాన్ని నిజం చేసింది' అంటూ రాహుల్ కామెంట్ పెట్టాడు.
 

loader