భర్త కష్టాల్లో ఉన్నప్పుడు భార్య ఇచ్చే సాంత్వన చాలా బాగా పనిచేస్తుంది. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి కూడా తన భార్య అనుష్క శర్మ గ్రౌండ్‌లో కనిపిస్తే చాలు.. ఎక్కడ లేని ధైర్యం వచ్చేస్తోంది. భార్యను మ్యాచ్‌లకు తీసుకురాకూడదని చెబుతున్నప్పటికీ కోహ్లీ మాత్రం మనసు మార్చుకోవడం లేదు. తాజాగా ఇంగ్లాండ్‌తో జరుగుతున్న మొదటి టెస్టులో 182కే 8 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడ్డ జట్టును విరాట్ కోహ్లీ కెప్టెన్ ఇన్నింగ్స్‌తో ఒడ్డుకు చేర్చాడు..

టాయిలెండర్ల సాయంతో సెంచరీ చేసి.. తాను ఎలాంటి క్లిష్ట  పరిస్థితుల్లోనైనా బ్యాటింగ్ చేయగలనని నిరూపించాడు. సెంచరీ చేసిన ఆనందంలో ఎగిరి గంతులేసిన కోహ్లీ... తన శతకాన్ని భార్యకి అంకితం చేశాడు..చైన్‌తో పాటు మెడలో ఉంచిన వెడ్డింగ్ రింగ్‌కి ముద్దిస్తూ.. గ్యాలరీలో కూర్చొన్న తన శ్రీమతి అనుష్క వైపుకు చూపుతూ స్టైల్‌గా వందనం తెలిపాడు. భర్త తనపై చూపుతున్న ప్రేమకు అనుష్క ఆనందంతో గంతులేసింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.