మ్యాచ్‌లో డివిలియర్స్‌ ఈ అద్భుత విన్యాసాన్ని చేశాడు (వీడియో)

First Published 18, May 2018, 11:42 AM IST
Virat Kohli Compares AB de Villiers To A Marvel Superhero After Miracle Catch
Highlights

డివిలియర్స్‌ క్యాచ్‌పై స్పందించినకోహ్లి

సూపర్‌ మ్యాన్‌ను తలపించాడు. ఐపీఎల్‌లో భాగంగా సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో డివిలియర్స్‌ ఈ అద్భుత విన్యాసాన్ని చేశాడు. సన్‌రైజర్స్‌ ఛేదనలో ఎనిమిదో ఓవర్లో మొయిన్‌ అలీ వేసిన బంతిని ఎదుర్కొనేందుకు హేల్స్‌ ముందుకు వచ్చాడు. డీప్‌ మిడ్‌ వికెట్‌ మీదుగా బంతిని బలంగా బాదాడు. అది సిక్స్‌ వెళ్లేలా కనిపించింది. కానీ, బౌండరీ వద్ద ఉన్న డివిలియర్స్‌ అమాంతం గాల్లోకి ఎగిరి ఒంటి చేత్తో క్యాచ్‌ పట్టాడు. కాలు బౌండరీ లైన్‌ను తాకకుండా తనకు తాను నియంత్రించుకున్నాడు. ఈ క్యాచ్‌ ఈ మ్యాచ్‌కే హైలెట్‌గా నిలిచింది.

 

డివిలియర్స్‌ క్యాచ్‌పై స్పందించినకోహ్లి .. అది ఒక స్పైడర్‌మన్‌ స్టఫ్‌ అలా ఎవరు అనుకరించకండి. అది కచ్చితంగా సిక్స్‌ అని నేను భావించా. కానీ ఏబీ అద్భుతంగా అందుకున్నాడు. అతని ఫీల్డింగ్‌ను నేను అనుకరిస్తున్నాను. హోంగ్రౌండ్‌లో జరిగిన చివరి మ్యాచ్‌కు మద్దతు తెలిపిన అభిమానులందరికి కృతజ్ఞతలు’ అని కోహ్లి పేర్కొన్నాడు.

 

loader