భారత క్రికెట్ దేవుడు, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ రికార్డులను బద్ధలు కొట్టగల సత్తా కోహ్లీకి మాత్రమే ఉందని మాజీ క్రికెటర్లు, అభిమానులు చెబుతున్న మాటలు నిజమవుతున్నాయి

భారత క్రికెట్ దేవుడు, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ రికార్డులను బద్ధలు కొట్టగల సత్తా కోహ్లీకి మాత్రమే ఉందని మాజీ క్రికెటర్లు, అభిమానులు చెబుతున్న మాటలు నిజమవుతున్నాయి. తాజాగా మరోసారి సచిన్‌ను వెనక్కినెట్టేశాడు కోహ్లీ. టెస్టుల్లో ఇప్పటి వరకు 22 శతకాలు సాధించిన విరాట్ ఈ ఘనతను 113 ఇన్నింగ్స్‌ల్లోనే సాధించాడు.

మాస్టర్ తన కెరీర్‌లో 22 సెంచరీలు సాధించేందుకు 114 ఇన్నింగ్స్‌లు తీసుకున్నాడు. తద్వారా సచిన్ కంటే వేగవంతంగా సెంచరీలు సాధించిన క్రికెటర్‌గా రికార్డ్ సాధించాడు. అంతేకాకుండా ఇంగ్లాండ్ జట్టుపై వెయ్యి పరుగులు పూర్తి చేసిన 13వ భారత క్రికెటర్‌గా కోహ్లీ ఘనత సాధించాడు. దీనితో పాటుగా కెప్టెన్‌గా అత్యధిక శతకాలు కొట్టిన ఆటగాళ్లలో 15 సెంచరీలతో కోహ్లీ మూడవ స్థానంలో నిలిచాడు.