వీడియో అసిస్టెంట్ రిఫరీ రెడీ

VAR at World Cup
Highlights

వీడియో అసిస్టెంట్ రిఫరీ రెడీ

హైదరాబాద్: ఎట్టకేలకు వీడియో అసిస్టెంట్ రిఫరీలను(వీఏఆర్) వాడుకోవడానికి ఫుట్‌బాల్ గేమ్ రెడీ అయిపోయింది. ఆటతీరును అంచనా వేయడంలో రిఫరీలను హెల్ప్ చేసే ఈ టెక్నాలజీకల్ రిఫరీలను రష్యాలో జరిగే వరల్డ్ కప్‌లో తొలిసారిగా వినియోగిస్తున్నారు. వీఏఆర్‌ను బరిలోకి దింపాలని మార్చి మూడవ తేదీన ఫిఫా డిసైడ్ కావడంతో వీటి గురించి చర్చలు మొదలయ్యాయి. 1,000కి పైగా మ్యాచ్‌ల్లో టెస్ట్ చేసిన తర్వాత వీటి వినియోగానికి ఫిఫా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అలా చూసినప్పుడు రీప్లేలను రివ్యూ చేయడంలో గేమ్‌కు యావరే‌జ్‌గా 55 సెకండ్లు మాత్రమే లాస్ అవుతున్నది. అయితే ఫౌల్స్ (8 నిముషాల 51 సెకండ్లు), కార్నర్ కిక్‌లు(3 నిముషాల 57 సెకండ్లు), ప్లేయర్ల సబ్‌స్టిట్యూషన్(2 నిముషాల 57 సెకండ్ల) తో పోల్చినప్పుడు వీఏఆర్ వల్ల కోల్పోయే టైమ్ చాలా తక్కువే మరి. అయితే వీటి వల్ల గేమ్‌లో మజా పోతుందంటున్నారు ఫుట్‌బాల్ వీరాభిమానులు. 

loader