Asianet News TeluguAsianet News Telugu

టెన్నిస్ స్టార్ సానియా మీర్జా రిటైర్మెంటుకు కారణం ఇదేనట..

స్టార్ టెన్నిస్ క్రీడాకారిణి సానియామీర్జా తన రిటైర్మెంట్ గురించి మాట్లాడుతూ.. అంతా ఖాళీగా అనిపిస్తుంది అన్నారు.  తను చాలా ఎమోషనల్ పర్సన్ అని కూడా చెప్పారు.

This is the reason for tennis star Sania Mirza's retirement - bsb
Author
First Published Feb 3, 2023, 8:41 AM IST

భారతదేశపు అత్యుత్తమ టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా - 2023లో తన కెరీర్‌ నుంచి నిష్క్రమించాలని నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఆస్ట్రేలియన్ ఓపెన్ 2023 : ఓటమితో గ్రాండ్ స్లామ్ కెరీర్‌ను సానియా మీర్జా ముగించారు. అయితే, ఈ నిర్ణయానికి ఎందుకు రావాల్సి వచ్చిందో ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఇలా చెప్పుకొచ్చారు. 

భారత లెజెండరీ టెన్నిస్ స్టార్ సానియా మీర్జా టెన్నిస్ రంగంలో అత్యున్నత స్థాయి విజయాలను అందుకున్నారు. 2023లో తన కెరీర్‌ నుంచి విరామం తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. 36 ఏళ్ల ప్రపంచ మాజీ నంబర్ వన్ సానియా మీర్జా ఆస్ట్రేలియన్ ఓపెన్‌కు ముందు ఇది తన చివరి గ్రాండ్‌స్లామ్ అని ప్రకటించింది. ఈ ప్రసిద్ధ టెన్నిస్ స్టార్ గురువారం ఇండియాటుడేతో ప్రత్యేకంగా మాట్లాడారు. ఈ నిర్ణయానికి రావడానికి తన శరీరం, మనసు తీవ్రంగా మధనపడిందని చెప్పుకొచ్చారు.  

ఆస్ట్రేలియన్ ఓపెన్ 2023 : ఓటమితో గ్రాండ్ స్లామ్ కెరీర్‌ను ముగించిన సానియా మీర్జా..

"కొంతకాలంగా దీని గురించి నేను ఆలోచిస్తున్నాను. నా శరీరం అలిసిపోయిందనుకుంటున్నాను. నేను ఈ స్థాయికి రావడానికి, ఈ స్థాయిలో పోటీ పడడానికి నేను ఎంత కష్టపడ్డానో..ఎలా ప్రయత్నించానో నాకే తెలుసు. ఇక ముందు ఆ స్థాయిలో నేను పోటీ పడగలనో లేదో తెలియదు. దీనివల్ల నాకు ఏదో ఖాళీ ఏర్పడిన భావన కలుగుతుంది’ అంటూ సానియా చెప్పుకొచ్చారు. 

సానియా మీర్జా భారతదేశం గర్వించదగిన మహిళా టెన్నిస్ క్రీడాకారిణిగా ఎన్నో గుర్తింపులు దక్కించుకుంది. ఆరు గ్రాండ్ స్లామ్ డబుల్స్ టైటిళ్లను గెలుచుకుంది. ‘డబ్ల్యూటీఏ ఫైనల్స్ ఆడబోతున్నాం.  డబ్ల్యూటీఏ ఫైనల్స్ తర్వాత నేను టెన్నిస్ ను ఆపివేస్తాను" అని చెప్పుకొచ్చారు.

టెన్నిస్ స్టార్ గురువారం మాట్లాడుతూ తాను ఎప్పుడూ ఎమోషనల్ పర్సన్‌గా ఉండనని, ఎప్పుడూ కోర్టులో ఒకరిగా ఉండనని ఉన్న ప్రచారం బూటకమని చెప్పుకొచ్చారు. దీనిమీద అడిగిన ప్రశ్నకు ఆమె మాట్లాడుతూ.. "మీరు చెప్పింది నిజమే. నేను ఆడేటప్పుడు కూడా పెద్దగా ఎమోషన్‌ని ప్రదర్శించను. గెలిచినా, ఓడిపోయినా కూడా ఆ రోజు నా ఎమోషన్స్‌ని అదుపులో ఉంచుకుంటాను. కానీ, అది నేను కాదు. భావోద్వేగ వ్యక్తి కాదు. దానిని ఫేక్ చేయడం ఎలాగో నాకు బాగా తెలుసు. 

అదంతా వాస్తవమైనది. నేను నియంత్రించుకోలేను. నాకు చాలా భావోద్వేగాలుంటాయి. గత రెండు వారాలు అది మీకు తెలుసు. అది అలా అని తెలిసి చివరిసారి నేను గ్రాండ్‌స్లామ్‌లో పోటీ పడబోతున్నాను. నేను దీనికి చాలా కృతజ్ఞతతో ఉన్నాను. మరో గ్రాండ్‌స్లామ్‌ ఫైనల్‌లో ఆడుతూ నా గ్రాండ్‌స్లామ్ ప్రయాణాన్ని ముగించగలిగాను" అని చెప్పుకొచ్చారు. 

Follow Us:
Download App:
  • android
  • ios