గత కొన్ని నెలలుగా సాగుతున్న భారత జైత్రయాత్రకు న్యూజిలాండ్ బ్రేక్ వేసింది. ఆస్ట్రేలియాలో వన్డే, టెస్టు సిరీస్ విజయాలతో ఊపు మీదున్న భారత్.. న్యూజిలాండ్‌ను మట్టికరిపించి వన్డే సిరీస్‌ను కైవసం చేసుకున్న టీమిండియా.. టీ20కి వచ్చేసరికి చతికిలపడింది.

ముఖ్యంగా మూడు టీ20ల సిరీస్‌లో నిర్ణయాత్మకమైన మూడో టీ20ల భారత్ 4 పరుగుల తేడాతో ఓడిపోవడాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. చాలా మంది రోహిత్ సేన ఓటమికి అనవసర తప్పిదాలే కారణమని విశ్లేషిస్తున్నారు. వాటిలో..

1. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోవడం:

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా సారథి రోహిత్ శర్మ ఫీల్డింగ్ ఎంచుకోవడం సరైన నిర్ణయం కాదంటున్నారు. పూర్తిగా బ్యాటింగ్‌కు సహకరించే పిచ్‌పై ఏ కెప్టెన్ అయినా బ్యాటింగ్‌కే మొగ్గు చూపుతాడు. పైగా కివీస్ టాప్ ఆర్డర్‌లొని మున్రో, సీఫెర్ట్‌, రాస్ టేలర్ వంటి విధ్వంసక ఆటగాళ్లను దృష్టిలో ఉంచుకుని కూడా రోహిత్ ఈ నిర్ణయం ఎలా తీసుకున్నాడా అని మాజీలు ప్రశ్నిస్తున్నారు. రోహిత్ లెక్క తప్పి తొలి నుంచి కివీస్ బ్యాట్స్‌మెన్లు భారత బౌలింగ్‌ను చీల్చి చెండాడి మరోసారి స్కోరు బోర్డును 200 పరుగులు దాటించారు. 

2. కీలక క్యాచ్‌లు జారవిడిచిన భారత ఫీల్డర్లు:

ఇటీవలి కాలంలో ప్రపంచంలోనే అత్యుత్తమ ఫీల్డింగ్‌గా మన్ననలు అందుకున్న భారత ఫీల్డింగ్ ఆదివారం పూర్తిగా విఫలమైంది. న్యూజిలాండ్ బ్యాట్స్‌మెన్లు ఇచ్చిన సులువైన క్యాచ్‌లను మనోళ్లు జారవిడిచారు. ముఖ్యంగా మున్రోకు పలు మార్లు జీవన ధానం చేయడంతో అతను రెచ్చిపోయి 76 పరుగులు చేశాడు.

దీనితో పాటు మిస్‌ఫీల్డ్‌కు చేసి అదనంగా పరుగులు సమర్పించుకున్నారు. అయితే రోహిత్ ప్రయోగాలను కూడా ఇక్కడ ప్రశంసించాల్సిన అవసరం ఉంది..కీలకమైన ప్రపంచకప్‌కు ముందు మైదానంలోని అన్ని రకాల పరిస్థితులను చూసేందుకే ఫీల్డింగ్‌ ఎంచుకున్నట్లు మ్యాచ్ అనంతరం రోహిత్ శర్మ స్పష్టం చేశాడు.

మ్యాచ్ ఓడినప్పటికీ ఆల్‌రౌండర్స్‌ విజయ్ శంకర్, కృనాల్ పాండ్యాలు తెరమీదకు వచ్చారు. కృనాల్ అటు బౌలింగ్, ఇటు బ్యాటింగ్ రెండింట్లోనూ తనకు సత్తా ఉందని నిరూపించాడు. దినేశ్ కార్తీక్ కూడా ఒత్తిడిలో ఆడుతూ ప్రపంచకప్ రేసులో ఉన్నానని గుర్తు చేశాడు. 

దేశమే ముందు: ధోనీ దేశభక్తికి సలాం

పరుగు కోసం పాండ్యా...వెనక్కెళ్లమన్న దినేశ్ కార్తీక్: నెటిజన్ల ఫైర్

హామిల్టన్ టీ20: పోరాడి ఓడిన భారత్, సిరీస్ న్యూజిలాండ్ వశం

టీ20ల్లో ధోనీ అరుదైన రికార్డు.. 300 మ్యాచ్‌లు ఆడిన క్రికెటర్‌గా..

క్యాచ్‌లు నేలపాలు.. నెత్తి బాదుకుంటూ పాండ్యా ఫ్రస్ట్రేషన్

అదృష్టం న్యూజిలాండ్ వైపే.. ఆ బాల్ వైడ్ అయ్యుంటే