ఇప్పటికే తన పేరిట ఎన్నో రికార్డులు లిఖించుకున్న టీమిండియా మాజీ కెప్టెన్, వికెట్ కీపర్ మహేంద్ర సింగ్ ధోనీ అరుదైన రికార్డును నెలకొల్పాడు. భారత్ తరపున 300 టీ20 మ్యాచ్‌లుఆడిన క్రికెటర్‌గా ఘనత వహించాడు. న్యూజిలాండ్‌తో జరిగిన చివరి టీ20 ద్వారా ధోనీ ఈ మైలురాయిని అందుకున్నాడు.

భారత జాతీయ జట్టు తరుపున 96, ఐపీఎల్‌లో 175, ఛాంపియన్స్ ట్రోఫీ టీ20 లీగ్‌లో 24, జార్ఖండ్ తరపున 4, ఫస్ట్ క్లాస్‌ టీ20లలో 1 మ్యాచ్ ద్వారా మొత్తం కలిపి 300 మ్యాచ్‌లు ఆడాడు. తద్వారా 300 అంతర్జాతీయ టీ20లు ఆడిన ఏకైక భారత క్రికెటర్‌గా ధోనీ నిలిచాడు.

ఈ జాబితాలో వెస్టిండీస్ ఆల్‌రౌండర్ పొలార్డ్ 446 మ్యాచ్‌లతో అగ్రస్థానంలో ఉన్నాడు. క్రిస్‌గేల్, డ్వేన్ బ్రేవో, షోయబ్ మాలిక్‌లు ధోనీ కన్నా ముందు ఉన్నారు. భారత ఆటగాళ్లలో రోహిత్ శర్మ, సురేశ్ రైనా ధోనీ తర్వాతి స్థానాల్లో ఉన్నారు.